ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఇటీవల ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా విమానంలో నిల్వ పదార్థాలను సర్వ్ చేశారంటూ ప్రయాణీకులు గొడవకు దిగారు. మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు సహా విమానంలోని అనేక మంది ప్రయాణీకులకు సిబ్బంది పాడైపోయిన, నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో అసలు గొడవ మొదలైంది.
భోపాల్ నుంచి ఢిల్లీ కి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో నాణ్యత లేని ఆహరం అందించారంటూ ప్రయాణీకులు సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్ ఇండియా ఫైట్ AI-435 లో జరిగిన సంఘటనలో, అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న పార్టమెంట్ సభ్యుడు సహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక ప్రశ్నించిన వారికి సరైన సమాధానం ఇవ్వని క్రూ ప్రవర్తనపై కూడ అభ్యంతరాలు తెలిపారు. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
ఇటీవల తరచుగా విమానాలు ఆలస్యంగా నడవడం, పైలట్లతో గొడవలు వంటి అనేక కారణాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా... ప్రస్తుతం నాణ్యత లేని పదార్థాలను ప్రయాణీకులకు అందించి మరోసారి వార్తల్లో నిలిచింది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పాచిపోయిన ఆహారం!
Published Fri, Apr 8 2016 2:53 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement