అగ్రరాజ్యాధిపతిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో భారత్‌లోని కొన్ని ప్రముఖ నగరాల్లో పర్యటించారు. ఎక్కువగా మాంసాహారమే ఇష్టపడే ట్రంప్ మన దేశంలోని ప్రధాన నగరాల్లోని శాకాహార రెసిపీలను చాలా ఇష్టంగా ఆస్వాదించారు. ఆయన ఇష్టంగా తిన్న వంటకాలేంటో చూద్దామా..!.
ట్రంప్ తన భారత పర్యటనలో గుజరాత్, ఢిల్లీ, ఆగ్రాతో సహా మూడు ముఖ్యమైన నగరాలను సందర్శించారు. కూరగాయలంటేనే ఇష్టపడని ట్రంప్ కాశ్మీరీ కెహ్వా, నారింజతో చేసే పన్నాకోటా, బ్రోకలి, మొక్కజొన్న సమోసా, ఖామన్, నిమ్మ కొత్తిమీరతో చేసిన షోర్బా, పాలక్ చాట్, సాల్మన్ టిక్కా, ఆలూ టిక్కీ, అంజీర్ మలై కోఫ్తా, మష్రూమ్ కర్రీ తదితరాలను ఆస్వాదించారు. అలాగే మేతి కుల్చా, నాన్, తందూరీ రోటీలను ట్రై చేశారు. ఇక నాన్‌వెజ్‌లో మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టంగా ఆరగించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
అలాగే మన భారతీయ ఆతిథ్య సంప్రదాయానికి అనుగుణంగా భోజనం చివర్లో అందించే కాజు బర్ఫీ, హాజెల్‌నట్ యాపిల్, రబ్దీతో కూడిన మాల్పువా, ఫ్రూట్ సలాడ్స్‌ని కూడా ఇష్టంగా తిన్నారు ట్రంప్. ముఖ్యంగా మన దేశంలో యూఎస్ ప్రతినిధులకు తప్పనిసరిగా అందించే డార్జిలింగ్ టీ, ఇంగ్లీష్ టీ, లెమన్ టీ అస్సాం టీ వంటి వాటిని కూడా ఆస్వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాగైన మనదేశంలోని వంటకాలు ఎప్పుడు కూరగాయల వైపు చూడని వాళ్లని కూడా ఓ సారి తిని చూద్దాం అనేలా నోరూరిస్తాయి కదూ..!
(చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!)
Comments
Please login to add a commentAdd a comment