served
-
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్‌కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్‌కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్‌లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్‌ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్‌ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్‌ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
వెజ్ బిర్యానీలో ‘బల్లి ’
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహారంపై విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన కాగ్ రిపోర్ట్ అనుగుణంగా రైల్వేల బాగోతం మరోసారి బట్ట బయలైంది. ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించడం ఆందోళన రేపింది. పూర్వా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి మంగళవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంటులో సమర్పించిన కాగ్ నివేదిక నేపథ్యంలో ప్రయాణికుల ఆందోళన, ఆశ్చర్యం ఇంకా చల్లారకముందే రైళ్ళలో ఆహారం మానవ వినియోగానికి తగదన్న కఠోర సత్యం మరోసారి రుజువైంది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న యాత్రికులు బృందం లక్నో కు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. దీంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. అంతేకాదు దీన్ని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటికి విసిరి పారేశారు తప్ప ఎలాంటి స్పందన లేదు. అటు రైల్వే టికెట్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో విసుగెత్తిన ఒక ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే వారికి కొన్ని మందులు అందించారు. సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఇక్కడికి రావడానికి ముందే, వైద్యుల సహాయంతో మెడిసిన్స్ సూచించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే దీనికి సబంధించి మంత్రిత్వశాఖకు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కాగా రైళ్ళలో, రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరానిదని, చాలా అనాగ్య పరిస్థితులలో, కలుషితమైన నీటితో వండుతారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిన సంగతి తెలిసిందే. -
హోదా గళాలకు సంకెళ్లు .
-
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పాచిపోయిన ఆహారం!
ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఇటీవల ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా విమానంలో నిల్వ పదార్థాలను సర్వ్ చేశారంటూ ప్రయాణీకులు గొడవకు దిగారు. మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు సహా విమానంలోని అనేక మంది ప్రయాణీకులకు సిబ్బంది పాడైపోయిన, నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో అసలు గొడవ మొదలైంది. భోపాల్ నుంచి ఢిల్లీ కి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో నాణ్యత లేని ఆహరం అందించారంటూ ప్రయాణీకులు సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్ ఇండియా ఫైట్ AI-435 లో జరిగిన సంఘటనలో, అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న పార్టమెంట్ సభ్యుడు సహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక ప్రశ్నించిన వారికి సరైన సమాధానం ఇవ్వని క్రూ ప్రవర్తనపై కూడ అభ్యంతరాలు తెలిపారు. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచుగా విమానాలు ఆలస్యంగా నడవడం, పైలట్లతో గొడవలు వంటి అనేక కారణాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా... ప్రస్తుతం నాణ్యత లేని పదార్థాలను ప్రయాణీకులకు అందించి మరోసారి వార్తల్లో నిలిచింది.