విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. రావికమతంలో బుధవారం ఉదయం స్థానిక టీడీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది.
విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. రావికమతంలో బుధవారం ఉదయం స్థానిక టీడీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో నర్నీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు కారు పాదచారులను ఢీకొన్న అనంతరం కొద్దిదూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవింగ్పై అవగాహన లేకపోవటం వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.