ravikamatam
-
మృతదేహంతో 3 కి.మీ.
వైద్యం అందక గిరిజనుడి మృత్యువాత విశాఖ జిల్లా రావికమతం మండలం కొంజుర్తి సమీపం లోని పెడెం పాలెం గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు (46) 4 రోజులుగా జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధప డ్డాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి తీవ్రతరం కావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. వాహనం ఖాళీ లేదనడంతో.. కళ్యాణపులోవ వరకూ డోలిలో మోసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా ఓ ప్రైవేట్ వాహనంలో రోలుగుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి నుంచి మృత దేహాన్ని కళ్యాణపులోవ వరకు ఆటోలో తీసుకొచ్చి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర స్వగ్రామానికి డోలీలో మోసుకుపోయారు. రావికమతం (చోడవరం) -
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
-
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. రావికమతంలో బుధవారం ఉదయం స్థానిక టీడీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో నర్నీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కారు పాదచారులను ఢీకొన్న అనంతరం కొద్దిదూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవటం వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.