మృతదేహంతో 3 కి.మీ. | healing of the tribal is the death of the tribal man | Sakshi
Sakshi News home page

మృతదేహంతో 3 కి.మీ.

Published Sat, Jul 29 2017 3:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

మృతదేహంతో 3 కి.మీ.

మృతదేహంతో 3 కి.మీ.

వైద్యం అందక  గిరిజనుడి మృత్యువాత
విశాఖ జిల్లా రావికమతం మండలం కొంజుర్తి సమీపం లోని పెడెం పాలెం గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు (46) 4 రోజులుగా జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధప డ్డాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి తీవ్రతరం కావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు.

వాహనం ఖాళీ లేదనడంతో.. కళ్యాణపులోవ వరకూ డోలిలో మోసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా ఓ ప్రైవేట్‌ వాహనంలో రోలుగుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి నుంచి మృత దేహాన్ని కళ్యాణపులోవ వరకు ఆటోలో తీసుకొచ్చి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర స్వగ్రామానికి డోలీలో మోసుకుపోయారు.

 రావికమతం (చోడవరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement