tribal death
-
వదంతులు నమ్మవద్దు
నిజామాబాద్: సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు నమ్మ వద్దని నిజామాబాద్ ఇంచార్జ్ సీపీ, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం చేంగల్‌లో ఓ గిరిజనుడిని దొంగగా భావించి గ్రామస్తులు దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం హత్యా నేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాకు సమాచారమిస్తే మేము స్పందిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అవసరమైన అన్ని చోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. వదంతులను నమ్మకుండా ప్రజల్ని చైతన్యపరిచేందుకు కళాజాత ద్వారా వదంతులను తిప్పికొట్టేలా ప్రచారం చేస్తామని వివరించారు. జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు మా దృష్టికొస్తున్నాయని చెప్పారు. -
దొంగలనుకొని గ్రామస్తుల దాడి
భీమ్‌గల్ (బాల్కొండ): గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ గిరిజనుడు మృతి చెందాడన్న వార్త నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సమీపంలోని 12 తండాల గిరిజనులు చేంగల్ గ్రామంలోని పలు ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురుతిరిగారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడ్డారు. ఒకదశలో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం దొంగలుగా భావించి గ్రామస్తులు జరిపిన దాడిలో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మాలావత్ దేవ్యా (40), దేగావర్ లాలూ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవ్యా బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిరిజనులు చేంగల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలతో సహా 100 మంది సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు నిజామాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్ రంగంలోకి దిగి గిరిజన పెద్దలతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ.8.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు, ఐదెకరాల ప్రభుత్వ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాడికి పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా ఇంకా ఎంత మంది ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో గిరిజనులు శాంతించి వెనుదిరిగారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
మృతదేహంతో 3 కి.మీ.
వైద్యం అందక గిరిజనుడి మృత్యువాత విశాఖ జిల్లా రావికమతం మండలం కొంజుర్తి సమీపం లోని పెడెం పాలెం గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు (46) 4 రోజులుగా జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధప డ్డాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి తీవ్రతరం కావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. వాహనం ఖాళీ లేదనడంతో.. కళ్యాణపులోవ వరకూ డోలిలో మోసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా ఓ ప్రైవేట్ వాహనంలో రోలుగుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి నుంచి మృత దేహాన్ని కళ్యాణపులోవ వరకు ఆటోలో తీసుకొచ్చి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర స్వగ్రామానికి డోలీలో మోసుకుపోయారు. రావికమతం (చోడవరం) -
పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి
* సీపీఎం, గిరిజన సంఘాల ఆందోళన భద్రాచలం: ఖమ్మం జిల్లా చర్ల మండలం దోశలపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో నర్సింహారావు అనే గిరిజనుడు మృతి చెందాడు. బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడిన అతనిని పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆదివారం రాత్రి చనిపోయాడు. కాగా, నర్సింహారావు, గ్రామానికే చెందిన సత్తిబాబు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపారని, బ్రేక్ పడకపోవడంతో వాహనం ముందుకు వెళ్లిందని, దీంతో వారిని మావోయిస్టులుగా భావించిన పోలీసులు కాల్పులు జరిపారని నర్సింహారావు కుటుంబసభ్యులు చెబుతున్నారు. దోశలపల్లి, దేవరనాగారం గ్రామాల మధ్య మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నర్సింహారావుకు గాయాలయ్యాయని పోలీసులంటున్నారు. దీనిపై సీపీఎం, గిరిజన సంఘం నాయకులు చర్లలో ప్రదర్శన నిర్వహించారు. కాగా, సత్తిబాబు ఆచూకీ తెలియడం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వర్షబీభత్సం
= జడివానలతో జన జీవనం అస్తవ్యస్తం = పిడుగులు పడి ఇద్దరు మృతి = చోడవరంలో నీటమునిగిన పంటపొలాలు = {పమాద స్థాయికి పెద్దేరు, తాచేరు నదులు = కోనాం గేట్లు ఎత్తివేత చోడవరం,న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను వాయుగుండం కారణంగా జిల్లా అస్తవ్యస్తమయింది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి జడివానలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్.రాయవరం, పెదబయలు మండలాల్లో చెరొకరు మృతి చెందారు. మాకవరపాలెం,చీడికాడ మండలాల్లో ఏడు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఒక పక్క కరెంటు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో వంక ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సమస్య తీవ్రమైంది. కరెంటు లేక కార్మికులకు, వర్షాల వల్ల కూలీలకు పనిలేకుండా పోయింది. చోడవరంలో సుమారు 4 సెం.మీ వర్షం పడింది. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట, వడ్డాది ప్రాంతాల్లో 2 నుంచి 3 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులతోపాటు కొండగెడ్డలు పొంగి ప్రవిహ స్తున్నాయి. పెద్దేరు, తాచేరులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. భీమిలి-నర్సీపట్నం రోడ్డులో చోడవరం సమీపంలో బొడ్డేరు నదిపై ఉన్న కాజ్‌వేకు భారీ గండి పడింది. కాజ్వే పైనుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది. గండి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ దారిలో వెళ్లాల్సిన వాహనాలను గౌరీపట్నం మీదుగా వడ్డాది జంక్షకు మళ్లిస్తున్నారు. కోనాం జలాశయం నుంచి ఒక గేట్లు ఎత్తి 300క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేయగా పెద్దేరు జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి వదిలారు. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. లక్ష్మీపురం, కస్పా, ఎం.కోటపాడు, ముకుందపురం ప్రాంతాల్లో కనుచూపుమేరలో పొలాలు నీట మునిగాయి. చోడవరంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దాంతో పనులు లేక ప్రజలంతా అల్లాడిపోయారు. గ్రామాలు చీకట్లోనే కాలం వెళ్లదీశాయి. యలమంచిలిలోనూ వర్షం కురిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుకుంపేట మండలంలో భారీ వర్షానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో వర్షాల వల్ల కూరగాయల పంటలకు మేలు కలుగుతుందని గిరిరైతులు అంటున్నారు. పాడేరులోనూ వర్షం కురిసింది. గిరిజనుడి మృతి హుకుంపేట: పశువులు కాసేందుకు కొండపైకి వెళ్లిన గిరిజనుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. తీగలవలసలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బోయిన సీతారామయ్య (40) పశువులు కాసేందుకు సమీపంలో కొండపైకి తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురవంతో చెట్టు కిందకు చేరాడు. చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో సీతారామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి మాకవరపాలెం మండలంలో పిడుగుపాటుకు మూడు పశువులు చనిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. లచ్చన్నపాలెంలో కిల్లాడ రామ్మూర్తి ఇంటి వద్ద పిడుగుపడి రూ. 50 వేల విలువైన ఆవు మృతి చెందింది. వజ్రగడలో అప్పలనాయుడుకు చెందిన లక్ష విలువైన రెండు గేదెలు పిడుగుపాటుతో మృతి చెందాయి. పిడుగులు పడి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. చీడికాడ మండలంలో పిడుగులకు నాలుగు పశువులు మృతి చెందాయి. చినబోడిమెట్టలో బొడ్డు మంగునాయుడుకు చెందిన రెండు ఎద్దులు, , చీడికాడలో గండి అక్కునాయుడుకు చెందిన రెండు ఆవులు ఒకేచోట మృతి చెందాయి.