పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి | tribal died in police fire at dosa palli | Sakshi
Sakshi News home page

పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి

Published Mon, Dec 15 2014 12:34 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి - Sakshi

పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి

* సీపీఎం, గిరిజన సంఘాల ఆందోళన

భద్రాచలం: ఖమ్మం జిల్లా చర్ల మండలం దోశలపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో నర్సింహారావు అనే గిరిజనుడు మృతి చెందాడు. బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడిన అతనిని పోలీసులు  హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆదివారం రాత్రి చనిపోయాడు.

కాగా, నర్సింహారావు, గ్రామానికే చెందిన  సత్తిబాబు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపారని, బ్రేక్ పడకపోవడంతో వాహనం ముందుకు వెళ్లిందని, దీంతో వారిని మావోయిస్టులుగా భావించిన పోలీసులు కాల్పులు జరిపారని నర్సింహారావు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

దోశలపల్లి, దేవరనాగారం గ్రామాల మధ్య మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నర్సింహారావుకు గాయాలయ్యాయని పోలీసులంటున్నారు. దీనిపై సీపీఎం, గిరిజన సంఘం నాయకులు చర్లలో ప్రదర్శన నిర్వహించారు. కాగా, సత్తిబాబు ఆచూకీ తెలియడం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement