కాశ్మీర్ ప్రజలు పేరు మోసిన దొంగలు: ఫరూక్
కాశ్మీర్ ప్రజలు పేరు మోసిన దొంగలు: ఫరూక్
Published Mon, Mar 3 2014 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
రాజకీయ నాయకులు ముందు వెనుక చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆతర్వాత దాని ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్తగా పేరున్న జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ప్రజలు దొంగలు కాదు.. పేరుమోసిన దొంగలు (మహా చోర్) అని అన్నారు.
కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్ల వినియోగించడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను దొంగలు అంటూ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్ అసెంబ్లీలో పెద్ద దూమారాన్నే లేపాయి. ఫరూక్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా సిగ్గుమాలిన ప్రకటనలు ఎలా చేస్తారంటూ మహబూబా ముఫ్టీ మండిపడ్డారు.
Advertisement