Kashmir assembly
-
కశ్మీర్ అసెంబ్లీలో రచ్చ!
హంద్వారా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. హంద్వారా పరిస్థితులపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హంద్వారా పరిస్థితులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కశ్మీర్ అసెంబ్లీని గుర్తించం: పాక్
ఇస్లామాబాద్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో జరగనున్న కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆహ్వానించే ప్రసక్తి లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కశ్మీర్ అసెంబ్లీని చట్టబద్ధమైందిగా తాము గుర్తించట్లేదని, ఆమోదించట్లేదని పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల్లో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, దాని అసెంబ్లీని పాక్ గుర్తించబోదని చెప్పారు. ఈ సదస్సుకు కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను కనుక ఆహ్వానించినట్లయితే.. కశ్మీర్‌పై పాక్ అనుసరిస్తున్న విధానం విషయంలో రాజీ పడినట్టే అవుతుందన్నారు. కాబట్టి ‘ఆక్రమిత జమ్మూకశ్మీర్’ అసెంబ్లీ స్పీకర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరు కావాలంటూ భారత్‌లోని ఇతర రాష్ట్రాల స్పీకర్లందరికీ ఆహ్వానం పంపిన పాకిస్తాన్.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం పంపలేదు. దీనిపై భారత్ ప్రతిస్పందిస్తూ.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ కవీందర్ గుప్తాకు ఆహ్వానం పంపకపోయినట్లయితే.. ఈ సదస్సును బహిష్కరిస్తామ హెచ్చరించింది. -
కాశ్మీర్ ప్రజలు పేరు మోసిన దొంగలు: ఫరూక్
రాజకీయ నాయకులు ముందు వెనుక చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆతర్వాత దాని ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్తగా పేరున్న జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ప్రజలు దొంగలు కాదు.. పేరుమోసిన దొంగలు (మహా చోర్) అని అన్నారు. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్ల వినియోగించడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను దొంగలు అంటూ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్ అసెంబ్లీలో పెద్ద దూమారాన్నే లేపాయి. ఫరూక్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా సిగ్గుమాలిన ప్రకటనలు ఎలా చేస్తారంటూ మహబూబా ముఫ్టీ మండిపడ్డారు.