mehbooba mufti
-
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
నా ఓటమికి ఎన్నో కారణాలు: ఇల్తిజా ముఫ్తీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆమె దక్షిణ కశీ్మర్లోని బిజ్బెహరా స్థానం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ వీరీ చేతిలో పరాజయం చవిచూశారు. తన ఓటమిపై ఇల్తిజా ముఫ్తీ మంగళవారం స్పందించారు. బీజేపీతో గతంలో పీడీపీ పొత్తు పెట్టుకోవడం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. తన పరాజయానికి బీజేపీతో అప్పటి స్నేహం కారణం కాదని స్పష్టంచేశారు. తాను ఆశించిన ఫలితం రాలేదని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలు చాలామంది పీడీపీకి దూరమయ్యారని, దీనివల్ల పార్టీ కొంత బలహీన పడిందని అంగీకరించారు. బిజ్బెహరా నుంచి గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ రిస్క్ చేశానని ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. రిస్క్ చేసినప్పటికీ తగిన ఫలితం రాలేదన్నారు. సురక్షితమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే గొప్పేం ఉంటుందని ప్రశ్నించారు. పరాజయం ఎదురైనా కుంగిపోనని, పోరాటం సాగిస్తూనే ఉంటానని తేలి్చచెప్పారు. ఐదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
J&K: అసెంబ్లీ ఎన్నికల ముందు.. పీడీపీ పార్టీకి కీలక నేత రాజీనామా
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం మెహబూబాఫ్తీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నేతృత్వంలోని జమ్మకశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను పీడీపీ నుంచి వైదొలిగినట్లు సుహైల్ బుఖారీ వెల్లడించారు. అందుకు గల కారణాలను ఆయన వివరించలేదు.అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సుహైల్ బుఖారీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగూరా-క్రీరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు, అయితే గత నెలలో మాజీ మంత్రి బషారత్ బుఖారీ తిరిగి పీడీపీలోకి రావడంతో ఆయనకు వాగూరా-క్రిరీ టికెటు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సుహైల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.జర్నలిస్టు అయిన సుహైల్ బుఖారీ.. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఆయన సన్నిహితుడు. ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సలహాదారుగా కూడా పనిచేశారు. -
గృహ నిర్బంధంలో మెహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుంది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయంటూ సుప్రీంకోర్టుకు చెబుతున్న కేంద్రం.. ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెహబూబా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..మరో వైపు ప్రజల నిజమైన ఆకాంక్షలను అణగదొక్కుతోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. తాము శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదని పీడీపీ తెలిపింది. రాజ్భాగ్లో కొందరు పీడీపీ కార్యకర్తలు ‘ఆగస్ట్ 5 బ్లాక్ డే’అనే ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కాగా, శ్రీనగర్‌లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్‌లను పోలీసులు మూసివేశారు. -
మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్‌లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा. ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT बाला साहेब की भाषा में कहें तो 'लालू के… pic.twitter.com/a85OzVCi70 — Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
శివునికి జలాభిషేకం చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
-
రాహుల్ యాత్రకు యూపీ నేతలు ముఖం చాటిన..కాశ్మీర్ నేతలంతా కదిలి వస్తారు!
న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు తొమ్మిది రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 3న ఢ్లిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు యూపీ నేతలు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జమ్ము కాశ్మీర్ నాయకులంతా హాజరయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ యాత్రలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటామని ట్వీట్టర్ ద్వారా తమ పూర్తి మద్దతును తెలిపారు. అంతేగాదు సీపీఐకి చెందిన ఎంవై తరిగామి గూప్కార్ కూటమికి చెందిన మరో సభ్యుడు కూడా హాజరవుతారని అంటున్నారు. కాగా, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా.."భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరాల్సిందిగా నన్ను అధికారికంగా ఆహ్వానించారు. అతని అలు పెరగని ధైర్యానికి వందనం. ఫాసిస్ట్ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తితో నిలబడటం తన కర్తవ్యమని నమ్ముతున్నాను. మెరుగైన భారతదేశం కోసం అతనితో కలిసి పాల్గొంటాను." అని ట్వీట్ చేశారు. ఈ మేరకు భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం జమ్ము చేరుకున్న కాంగ్రెస్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్టాడుతూ..యాత్ర ఇక్కడకు చేరుకోగానే కాశ్మీర్లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. యాత్రలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఇదిలా ఉండగా, యూపీ నుంచి జయంత్ చౌదరి ఇప్పటికే రానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన అఖిలేష్ యాదవ్ కూడా హజరయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన వస్తారా లేక ప్రతినిధిని పంపుతారా అనేదానిపై స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో విభేదిస్తున్న మాయావతి కూడా అధికారికంగా స్పందించ లేదు. ఐతే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేసినప్పటికీ పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యాత్రను అడ్డుకునేందుకు ఆప్ కోవిడ్ ప్రోటోకాల్‌లను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కూడా రాసింది. దీంతో కాంగ్రెస్ నేత ఈ యాత్రను ఆపేందుకు ఇదోక సాకుగా చెబుతున్నారంటూ మండిపడ్డారు కూడా. (చదవండి: భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై) -
‘కశ్మీర్ ఫైల్స్’ను ఆయుధంగా మార్చుతున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని కేంద్ర ప్రభుత్వం కావాలని అధికంగా ప్రమోట్ చేస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ పండిట్ల బాధను కూడా తమకు అనుకూలంగా ఓ ఆయుధంగా మార్చుకుంటుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ సినిమాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును గమనిస్తే.. వారి(బీజేపీ) దురుద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా పేరులో రెండు వర్గాలను ఉద్దేశపూర్వకంగా చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత గాయాలను మాన్పి, రెండు వర్గాల మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి బదులు వాటిని చీల్చడానికే తెరలేపుతోందని మండిపడ్డారు. అంతకు ముందు ఈ సినిమాపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమైన దోషులను గుర్తించడానికి.. ఆ సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఆ సమయంలో గవర్నర్‌గా ఉన్న జగ్మోహన్ బతికి ఉంటే వాస్తవాన్ని చెప్పేవారని అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రతి సినిమా.. కథను ఒక ప్రత్యేకమైన రీతిలో చిత్రీకరిస్తుందని, సినిమా ఖచ్చితమైన సత్యాన్ని చిత్రీకరించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇదిలా ఉండగా, కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ ద్వేషాన్ని పెంచుతూ లాభం పొందుతోందని మండిపడుతోంది. 1990లో కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా సత్యాన్ని సరైన రూపంలోకి తెచ్చిందని, చరిత్రను ఎప్పటికప్పుడు సరైన సందర్భంలో అందించాలని ప్రధాని మోదీ తెలిపారు. -
కాంగ్రెస్ లేని కూటమితో ప్రయోజనం లేదు
జమ్మూ: కాంగ్రెస్ లేని రాజకీయ కూటమి లేదా థర్డ్ ఫ్రంట్‌తో బీజేపీని ఓడించడం సాధ్యంకాదని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. దేశ మౌలిక పునాదులను బీజేపీ పెకిలించివేస్తోందని ఆమె మంగళవారం దుయ్యబట్టారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. బీజేపీ ఎన్నికలు జరిపించడం ద్వారా కశ్మీర్ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నంత భావనలో ఉందన్నారు. దేశాన్ని నిర్మించడంలో 70ఏళ్లపాటు కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, దేశంలో ఆ పార్టీకి మినహా ప్రత్యామ్నాయం లేదని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం మాటలపై ఆమె స్పందించారు. కాంగ్రెస్ లేని ఏ కూటమి బీజేపీతో యుద్ధం చేయలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం వచ్చిందని ముఫ్తీ చెప్పారు. దేశ లౌకిక రూపును మార్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. చదవండి: న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం -
గుప్కార్ నేతల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు నిరసనగా ర్యాలీ తలపెట్టిన ముగ్గురు మాజీ సీఎంలు సహా గుప్కార్ కూటమి రాజకీయ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధంలో ఉంచారు. ‘గుడ్‌మార్నింగ్, 2022కు స్వాగతం. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భయపడిన జమ్మూకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధంగా మళ్లీ ప్రజలను గృహనిర్బంధం చేశారు’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ ఇంటి లోపలి గేటును పోలీసులు మూసివేశారన్నారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. -
జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు. -
గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్‌ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్‌తక్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్‌ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. -
కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా?
జమ్మూ: ఓట్ల కోసం బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని, కశ్మీరీ పండిట్ల ఆవేదనను, అగచాట్లను ఒక ఆయుధంగా వాడుకుంటోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. పరాయి ప్రాంతాలకు వలస వెళ్లిన హిందూ సోదరులు కశ్మీర్‌కు క్షేమంగా, గౌరవప్రదంగా తిరిగి రావాలని ఇక్కడ ముస్లింలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు కశ్మీరీ పండిట్లం అని చెప్పుకొంటూ ఢిల్లీలో టీవీ స్టూడియోల్లో కూర్చొని విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పండిట్లు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లతో కూడిన ప్రతినిధి బృందం తాజాగా మహబూబా ముఫ్తీతో సమావేశమయ్యింది. కశ్మీర్లో ఇటీవల సామాన్య పౌరులపై ఉగ్రవాదుల దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తమ భయాందోళనలను ఆమె దృష్టికి తీసుకెళ్లింది. పండిట్లు వలస వెళ్లడం వల్ల కశ్మీరీ ముస్లింలు ఎంతగానో నష్టపోయారని మహబూబా ముఫ్తీ చెప్పారు. మనల్ని విడదీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పండిట్లకు పిలుపునిచ్చారు. (చదవండి: ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి) -
మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం
శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని మంగళవారం జమ్మూకశ్మీర్ అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. తన కదలికలపై ఆంక్షలు విధించడం ‘కశ్మీర్లో శాంతి నెలకొందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిందని మెహబూబా పేర్కొన్నారు. ‘ఈ రోజు నన్ను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. అందుకు వారు చెబుతున్న కారణం..కశ్మీర్లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవన్నది. ఇక్కడ శాంతి నెలకొన్నదంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని తేలిపోయింది’ అని మెహబూబా మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో పౌరుల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కశ్మీరీలకు మాత్రం అలాంటి హక్కులు లేకుండా చేస్తోందని ఆరోపిస్తూ గుప్కార్లోని తన నివాసం ప్రధాన గేటు వద్ద భద్రతా బలగాల వాహనం ఉన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న కుల్గాం జిల్లాలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లాలని తెలపగా.. పాక్ అనుకూల వేర్పాటువాద నేత గిలానీ మరణానంతరం అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని మెహబూబాకు సర్ది చెప్పి, ఆపామని అధికారులు తెలిపారు. -
అఫ్గాన్ నుంచి పాఠాలు నేర్చుకోండి
శ్రీనగర్: అఫ్గానిస్తాన్ పరిణామాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హితవు పలికారు. శనివారం కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పార్టీ కార్యకర్తల భేటీలో ఆమె మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని భాగస్వామ్య పక్షాలతో కేంద్రం చర్చలు జరపాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని ప్రస్తావిస్తూ తమను పరీక్షించవద్దంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొరుగు దేశంలో ఏం జరిగిందో చూడండి, పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దండి అని సూచించారు. సూపర్ పవర్ అమెరికా తట్టాబుట్టా సర్దుకొని అఫ్గాన్ నుంచి తోక ముడిచిందన్నారు. కశ్మీర్లో చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి భారత ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల మెహబూబాకు దురభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
మాజీ సీఎం భార్యకు ఈడీ సమన్లు
శ్రీనగర్: మనీలాండరింగ్ కేసులో జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తల్లి గుల్షన్ నజీర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కేసు విచారణ కోసం ఆగస్టు 18న శ్రీనగర్ ఈడీ ఆఫీసుకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఫ్తీ ముహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్. 70సంవత్సరాలు పైబడిన వృద్దురాలికి నోటీసులు పంపడంపై ముఫ్తీ, ఆమె పార్టీ పీడీపీలు తీవ్ర విమర్శలు చేశాయి. కాశ్మీర్లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఏదైనా కార్యక్రమం చేపట్టగానే ఎవరికోఒకరికి సమన్లు జారీ అవుతాయని పీడీపీ దుయ్యబట్టింది. గురువారం కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసి రెండేళ్లయిన సందర్బంగా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందుకే ముఫ్తీ తల్లికి సమన్లు వచ్చాయని విమర్శించిన పీడీపీ, ఈ కేసు వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ వివరాలుంటే తాము లీగల్‌గా సిద్దమవుతామని తెలిపింది. -
అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయను: ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అణచివేత శకానికి ముగింపు పలికితేనే ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంప్రదింపులు ప్రక్రియకు విశ్వసనీయత ఉంటుందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (62) తేల్చిచెప్పారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించడం నేరమేమీ కాదని.. దీన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఆమె తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ప్రజలకు ఊపిరిపీల్చే హక్కు ఉండాలని, ఆ తర్వాతే ఏదైనా అని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 14 మంది నేతల బృందంతో గురువారం ప్రధాని మోదీ నిర్వహించిన భేటీతో ఈ బాధల ఉపశమనానికి ఒక మార్గం ఏర్పడిందని భావిస్తున్నట్లు చెప్పారు. మెహబూబా ముఫ్తీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఉద్యోగాలు, భూములపై హక్కులను కాపాడాలి ‘‘జమ్మూకశ్మీర్ పార్టీల నాయకులతో చర్చల ప్రక్రియకు విశ్వసనీయత అనేది కేంద్రం పరిధిలోనే ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలను ప్రారంభించాలి. జమ్మూకశ్మీర్ వాసులను ఊపిరి పీల్చుకోనివ్వాలి. వారి ఉద్యోగాలను, వారి భూములపై హక్కులను కాపాడాలి. ఊపిరి పీల్చుకోనివ్వండి అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే.. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జైల్లో విసిరేస్తున్నారు. ఇటీవలే తన మనోభావాలను వ్యక్తం చేసిన ఓ పౌరుడిని జైల్లో పెట్టారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ అధికారులు జైలు నుంచి విడుదల చేయలేదు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ మాత్రం దిల్ కీ దూరీ.. దిల్లీ కీ దూరీ (హృదయాల మధ్య దూరం.. ఢిల్లీతో అంతరం) అంతం కావాలని కోరుకుంటున్నానని చెబుతున్నారు. అంతకంటే ముందు జమ్మూకశ్మీర్ ప్రజలపై అణచివేతను అంతం చేయండి. ప్రజలకు వ్యతిరేకంగా క్రూరమైన ఉత్తర్వులు జారీ చేయడం వెంటనే నిలిపివేయాలి. రాష్ట్రం ఒక జైలుగా మారింది జమ్మూకశ్మీర్‌ను నేను ఒక రాష్ట్రంగానే పరిగణిస్తా. ఈ మొత్తం రాష్ట్రం ఇప్పుడొక జైలుగా మారిపోవడం దారుణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. జమ్మూకశ్మీర్‌తోపాటు లద్దాఖ్‌లో పర్యాటకం, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, తగిన సాయం అందించాలి. ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వ ప్రతిస్పందనను అంచనా వేయడానికే ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాల్గొన్నా. పవర్ పాలిటిక్స్ కోసం వెళ్లలేదు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించే దాకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని గతంలోనే చెప్పా. అదే మాటకు కట్టుబడి ఉన్నా. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అందరి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రధానితో జరిగిన భేటీని ఒక అవకాశంగా భావించా. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగితే ఎన్నికల్లో నేను పోటీ చేసే ప్రసక్తే లేదు. అదే సమయంలో రాజకీయంగా లాభపడే అవకాశాన్ని మరొకరికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే గత ఏడాది జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గుప్కర్ కూటమితో కలిసి మా పార్టీ పోటీ చేసింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటిస్తే కలిసి కూర్చొని, చర్చించుకొని, నిర్ణయం తీసుకుంటాం’’అని మెహబూబా ముఫ్తీ తెలిపారు. -
కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో కశ్మీర్‌కు చెందిన పార్టీలన్నీ ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పార్టీలో అంతర్గత చర్చలు ప్రారంభించారు. చర్చల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుందామనే విషయంలో సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ‘‘ఎన్సీ చీఫ్ పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి అలీ మహమ్మద్ సాగర్, కశ్మీర్ ప్రావిన్షియల్ అధ్యక్షుడు నసీర్ అస్లామ్ వణీతో చర్చించారు. ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై స్పష్టత వస్తుంది’’అని పార్టీ నాయకుడొకరు ఆదివారం వెల్లడించారు. కశ్మీర్లో మరో ప్రధాన పార్టీ పీడీపీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశమై నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కట్టబెట్టింది. ‘‘అఖిలపక్ష సమావేశంపై తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి ముఫ్తీకి కట్టబెడుతూ పీఏసీ నిర్ణయించింది’’అని పీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ సుహైల్ బుఖారి చెప్పారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) మంగళవారం సమావేశమై అసలు సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని నిర్ణయిస్తారు. కశ్మీర్ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 24, గురువారం మధ్యాహ్నం 3 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: కాంగ్రెస్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారో లేదో కాంగ్రెస్ స్పష్టంగా వెల్లడించలేదు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌కే తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. -
అంబేడ్కర్ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు
శ్రీనగర్: ఆర్టికల్ 370కి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడడాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడు మనమధ్య లేరని, ఒకవేళ జీవించి ఉంటే ఆయన పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ నాయకులు దూషించేవారని అన్నారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం కూలదోసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: రవిశంకర్ ఆర్టికల్ 370 విషయంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఖరేంటో స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు. దిగ్విజయ్ చెప్పినట్లుగా ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్ నిరాకరణ
శ్రీనగర్: కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తి మొహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్ పాస్‌పోర్టు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీస్ శాఖ ఇచ్చిన ప్రతికూల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్షన్ కూతురు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన పాస్‌పోర్టు దరఖాస్తును అధికారులు తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తల్లి, కూతురు పవిత్ర మక్కా వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) ప్రకారం జమ్మూకశ్మీర్ పోలీస్ సీఐడీ విభాగం పాస్‌పోర్ట్ దరఖాస్తును తిరస్కరించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి కార్యాలయం గుల్షన్‌కు లేఖ పంపింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ‘ఏడు పదుల వయస్సున్న నా తల్లితో దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి, ఆమెకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. వారి మాట విన లేదని భారత ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి విధానాలతో వేధించేందుకు, శిక్షించేందుకు పూనుకుంది’అని విమర్శించారు. ఎవరైనా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లడం ద్వారా దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు అధికారులు పాస్‌పోర్ట్‌ను నిరాకరించేందుకు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) సెక్షన్ అధికారం కల్పించింది. దరఖాస్తుదారుకు పాస్‌పోర్ట్ మంజూరు ప్రజాసంక్షేమం కోసం కాదని కేంద్రం భావించిన సందర్భాల్లో కూడా అనుమతి నిరాకరించవచ్చు. చదవండి: మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్ -
ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, కశ్మీర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి , జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎదరు దెబ్బ తగిలింది. దేశ భద్రతకుముప్పు అంటూ ముప్తీ పాస్‌పోర్టును రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఫ్తీ ట్విట్ చేశారు. 2019 ఆగస్టు (స్పెషల్ స్టేటస్ రద్దు)తరువాత రాష్ట్రంలో నెలకొన్న సాధారణ పరిస్థితికి ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పాస్‌పోర్ట్ ఇవ్వడం ఇంత పెద్ద దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఎలా అవుతుందంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు. (మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కార్యాలయం తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు. తన పాస్‌పోర్ట్ గతేడాది మే 31 తో ముగిసిందని, తదనుగుణంగా 2020 డిసెంబర్ 11 న తాజా పాస్‌పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్‌పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఈడీ నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు జారీకి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో ముఫ్తీని ఈడీ విచారిస్తోంది. జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది.జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేస నమోదు చేసింది. కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనతరం, మెహబూబాతోపాటు ఇతర నేతలను కేంద్రం దాదాపు సంవత్సరంపాటు నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. Passport Office refused to issue my passport based on CID’s report citing it as ‘detrimental to the security of India. This is the level of normalcy achieved in Kashmir since Aug 2019 that an ex Chief Minister holding a passport is a threat to the sovereignty of a mighty nation. pic.twitter.com/3Z2CfDgmJy — Mehbooba Mufti (@MehboobaMufti) March 29, 2021 -
అమిత్‌షాకు ముఫ్తీ కౌంటర్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో అధికరణ 370,35(ఎ) పునరుద్దరణ కోసం కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాటాన్ని జాతి వ్యతిరేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించడంపై ఆ పార్టీ నేత మహబూబ ముఫ్తీ ట్విట్టర్లో స్పందించారు. దేశాన్ని రక్షించడంతో తామే(బీజేపీ) ముందున్నామని, తమ రాజకీయ ప్రత్యర్థులు దాంట్లో ఆమడ దూరంలో ఉంటారనే పాత ప్రచారాన్ని బీజేపీ ఇంకా కొనసాగిస్తుందన్నారు. లవ్ జిహాద్, తుక్డే తుక్డే గ్యాంగ్, గుప్కర్ డిక్లరేషన్లపై ప్రజల దృష్టిని మరల్చి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అంశాలను మరుగున పడేస్తున్నారని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రానికి కశ్మీర్ పార్టీల నాయకులకి మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతన్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా జమ్మూ కశ్మీర్లో త్వరలో రెండో విడత జిల్లా అభివృద్ధి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ, పీపుల్స్ పార్టీపై నాయకులు ఇస్తున్న ప్రకటనలపై విమర్శలు ఎక్కు పెట్టింది. అయితే తమ పార్టీని ముఠాగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. పాత అలవాట్లను ఇంకా బీజేపీ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. (చదవండి: పాకిస్తాన్ వైపు భారీ నష్టం!) మొదట భారత సార్వ భౌమత్వానికి తుక్డే తుక్డే గ్యాంగులతో ప్రమాదమని ప్రచారం చేశారు. ఇప్పుడు గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాడే మాలాంటి వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసిన రోజు నుంచి ఇప్పటి వరకూ లక్షల మంది ప్రజలు మరణించారని ట్వీట్ చేశారు. అధికారం కోసం బీజేపీ అనేక కూటమిలతో జట్టు కడుతుందని, అదే ఎన్నికల కోసం తాము పోరాడితే మాత్రం జాతి ప్రయోజనాలకి విరుద్ధమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. కశ్మీర్ నేతలు వరుసగా చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం స్పందించారు. చైనా-పాక్ సాయంతో జమ్ముకాశ్మీర్‌లో అధికరణ 370 ని తిరగి పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని నిలదీశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన జట్టు కట్టవచ్చని వాటి జాతి వ్యతిరేకంగా కనిపించిన ఎజెండాపై మాత్రం బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందన్నారు. గుప్కర్ డిక్లరేషన్: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (ఆర్టికల్ 370) రద్దు చేయడాని కంటే ఒక రోజు ముందు ఆరు పార్టీలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్) కలిసి శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో సమావేశమయ్యారు. ఆ ఇల్లు గుప్కర్ రోడ్డులో ఉండటంతో దానిని గుప్కర్ డిక్లరేషన్‌గా పిలుస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్ కశ్మీర్లో తిరిగి నిబంధన 370 ని పునరుద్ధరణ. -
జెండా ఎగురవేయను.. ముఫ్తీని అరెస్ట్ చేయండి
కశ్మీర్: త్రివర్ణపతాకంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కశ్మీర్లో ప్రత్యేక జెండా ఎగురవేసే అనుమతి వచ్చే వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయననటంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 14 నెలల నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన ముఫ్తీ నిన్న మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామన్నారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకుడు రవీందర్ రైనా మాట్లాడుతూ.. ‘ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం.. జమ్ము కశ్మీర్ ప్రత్యేక జెండాను ఎగరవేయడం చేయలేవు. మన జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారు. జమ్ము కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం. కనుక ఇక్కడ ఒకే ఒక్క జెండా ఎగురుతుంది.. అది కూడా త్రివర్ణ పతాకం మాత్రమే’ అన్నారు. అంతేకాక ముఫ్తీ కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఏదైనా తప్పు జరిగితే ఆమె తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శాంతి, సాధారణ స్థితి, సోదరభావానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. అలానే కశ్మీరీ నాయకులు భారతదేశాన్ని అసురక్షితంగా భావిస్తే.. పాకిస్తాన్, చైనా వెళ్ళవచ్చు అన్నారు. (చదవండి: ‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’) జాతీయ జెండాపై మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. -
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
పీడీపీ చీఫ్ మెహబూబాకు విముక్తి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి గృహ నిర్బంధం నుంచి దాదాపు 14 నెలలకు విముక్తి లభించింది. మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ పరిణామంపై మెహబూబా కుమార్తె ఇల్తిజా స్పందించారు. ‘మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధం ఎట్టకేలకు ముగిసింది. ఈ కష్ట కాలంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ రుణ పడి ఉంటాను’అని తన తల్లి ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్ ఖాతాను ఇకపై తన తల్లే ఉపయోగిస్తారని తెలిపారు. ఎందరో యువకులు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారనీ, వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మెహబూబాకు విముక్తి కలిగినందుకు జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలంపాటు ఆమె నిర్బంధం కొనసాగడం ప్రజాస్వామ్యం ప్రాథమిక నియమాలకే విరుద్ధమన్నారు. ఒమర్, మెహబూబా వంటి నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందునే వారిని నిర్బంధంలో ఉంచినట్లు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట సమర్థించుకున్నారు. కాగా, ఈ నెల 16వ తేదీన మెహబూబా మీడియాతో మాట్లాడతారని పీడీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ముఫ్తీని ఎంతకాలం నిర్భంధంలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏ ఆదేశం ప్రకారం, ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారని కోర్టు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని.. ఒక వారంలోపు దీనిపై వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. దాంతో రెండు వారాలు గడువు ఇచ్చింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె, కుమారుడు ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 15కు వాయిదా వేసింది. మెహబూబా ముఫ్తీ విడుదల కోసం ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తల్లిని నిర్బంధించడం అక్రమమని ఆరోపించారు. దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ముకశ్మీర్ అధికారులు కోర్టుకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని.. ఇది కోర్టు పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. అధికారులు తన తల్లిని కలిసేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం కోర్టు అనుమతి కోరారు. (చదవండి: ఆ తీర్పుపై స్పష్టత అవసరం: సుప్రీంకోర్టు) జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరుగకుండా మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. ప్రజా రక్షణ చట్టం కింద ఫరూక్ అబ్దుల్లాను సుమారు ఏడాది వరకు గృహ నిర్బంధంలో ఉంచి రెండు నెలల కిందట విడుదల చేసింది. ఆయనకు ముందు ఒమర్ అబ్దుల్లా కూడా విడుదల అయ్యారు. అయితే ప్రజా రక్షణ చట్టం కింద మెహబూబా నిర్బంధాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో తన తల్లిని ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మెహబూబా ముఫ్తీ (కశ్మీర్ నేత) రాయని డైరీ
ఏడాదిగా నేను వెలుగునే చూడలేదు! శ్రీనగర్‌లో నేను బందీగా ఉన్న ఈ ఫెయిర్ వ్యూ గృహంలో నిరంతరం విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఎన్ని దీపాలు వెలుగుతుంటే ఏంటి? బయటి వెలుగే సోకకుండా! నా తోటి వారందరినీ విడుదల చేసి మోదీజీ నన్ను మాత్రం నిర్బంధంలోనే ఉంచేశారు! సజ్జద్ గనీని ఆగస్టు ఐదుకు నాలుగు రోజుల ముందే వదిలిపెట్టారు. ఫరూక్ అబ్దుల్లాను, ఒమర్ అబ్దుల్లాను ఆగస్టు ఐదుకు ఐదు నెలల ముందే వదిలిపెట్టారు. నన్ను కూడా సజ్జద్ తర్వాత ఆగస్టు ఐదు లోపే వదిలి పెడతారనే ఆశించాను. అయితే ఆగస్టు ఐదు తర్వాత కూడా ఇంకో మూడు నెలలు నేను ఈ నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు వరండాలో నా నుంచి కశ్మీర్‌కు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి ఎవరితోనో అంటుంటే ఆ మాటలు వినిపించాయి. ‘‘ఏంటి! ఇంకో మూడు నెలలు నేను బందీగానే ఉండిపోవాలా!’’ అని అతడిని పిలిచి అడిగాను. ‘‘మేడమ్‌జీ.. మీరిలా ప్రతిసారీ నన్ను పిలిచి ఏదో ఒకటి అడగడం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద శిక్షార్హమైన నేరం. ఆ నేరానికి శిక్ష మీకు పడుతుందా, నాకు శిక్ష పడుతుందా అనేది చెప్పలేను కానీ నేరం నేరమే’’ అన్నాడు! ‘‘ప్రతిసారీ నిన్నెప్పుడు పిలిచాను?!’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. ‘‘ఫరూక్ సార్ విడుదలైనప్పుడు పిలిచారు. ఒమర్ సార్ విడుదలైనప్పుడు పిలిచారు. ఇప్పుడు సజ్జద్ సార్ విడుదలైనప్పుడూ పిలుస్తున్నారు’’ అన్నాడు. ‘‘నేనేమీ కొత్తగా ప్రశ్నలు అడగడానికి పిలవడం లేదు. నేను ఇంకో మూడు నెలలు నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు నువ్వు ఎవరితోనో అంటుంటే వినిపించి పిలిచాను’’ అన్నాను. ‘‘అది నా వ్యక్తిగతమైన విషయం అవుతుంది మేడమ్‌జీ. నేను మాట్లాడుతున్నది మీ గురించే అయినప్పటికీ, మాట్లాడుతున్నది మీతో కాదు కనుక అది నా వ్యక్తిగతమైన విషయమే. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నా వ్యక్తిగత విషయాలను నిర్బంధంలో ఉన్న వారితో పంచుకోవడం కూడా నేరమే కావచ్చని నా భయం. మీరు అడిగారు కాబట్టి మీకు అవసరంలేని ఒక విషయం చెప్పగలను. ఎవరితోనూ పంచుకునే వీలులేకనే నేను ఎవరో ఒకరితో పంచుకుంటున్నాను. అది మీరు విన్నారు’’ అన్నాడు. నవ్వాను. ‘‘నేను నా వ్యక్తిగత విషయాలను నీతో పంచుకుంటే అది కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నేరం అవుతుందన్న భయం కనుక నీకు లేకపోతే మోదీజీ గురించి నీతో నేను కొద్దిసేపు మాటల్ని పంచుకుంటాను..’’ అన్నాను. ‘‘మోదీజీ గురించి నాతో మాట్లాడాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మేడమ్‌జీ? మీరు అనుకోవలసింది నేరుగా మోదీజీతోనే మాట్లాడాలని కదా!’’ అన్నాడు. ‘‘నిన్నూ, మోదీజీని నేను వేర్వేరుగా చూడటం లేదు. కశ్మీర్ నుంచి ఆయన భారత ప్రజల్ని కాపాడుతున్నారు. నా నుంచి నువ్వు కశ్మీర్ ప్రజల్ని కాపాడుతున్నావు. ఇద్దరూ ఒకటే..’’ అన్నాను. అతడి ముఖం వెలిగిపోయింది. ఆగస్టు ఐదున కశ్మీర్లో త్రీసెవెంటీని రద్దు చేశాక ఈ ఏడాదిలో నేను చూసిన తొలి వెలుగు అది! ‘‘అందర్నీ వదిలిపెట్టి, నన్నిలా వదిలేశారు. మోదీజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి?!’’ అని అడిగాను. గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ‘‘మేడమ్ జీ.. నేనొకటి చెబుతాను నిరుత్సాహపడకండి’’ అన్నాడు. చెప్పమన్నట్లు చూశాను. ‘‘మోదీజీని ఎవరి సమయాన్ని బట్టి వారు అర్థం చేసుకోవలసిందే. ఒకే సమయంలో ఇద్దరికి ఆయన ఎప్పుడూ అర్థం కారు..’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
‘పాకిస్తాన్‌కు తలొగ్గిన మాజీ సీఎంలు’
పనాజీ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌లపై గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో (2018) ఒమర్, ముఫ్తీలు కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పాకిస్తాన్ ఒత్తిడితో ఆ ఇద్దరు సీఎంలు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా పాక్ ప్రమేయంతో వారు కుట్రపన్నారని విమర్శించారు. అంతేకాకుండా కశ్మీరీ వ్యతిరేకులతో వారిద్దరూ చేతులు కలిపారని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని చెప్పుకొచ్చారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో స్థానిక ప్రజల అనేక సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. -
ప్రభుత్వానిది క్రూరమైన చర్య
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఆమె మరో మూడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఏమీ చేయకపోయినా, నోరు విప్పి ఎలాంటి సందేశాలివ్వకపోయినా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడమే కాక తన చర్యను సమర్థించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మడానికి కూడా వీలు లేనంత కౄరమైన చర్యగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని దశాబ్ధాల వెనక్కు నెట్టివేసిందనడానికి నిర్బంధం పొడిగింపే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. (ఒమర్ అబ్దుల్లా నిర్ణయం, ప్రధాని మోదీ ప్రశంసలు) జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రజా భద్రతా చట్టం కింద పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అందులో మెహబూబా ముఫ్తీతో పాటు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు. వీరందరికీ పలు దఫాలుగా నిర్బంధం నుంచి విముక్తినిచ్చిన ప్రభుత్వం మెహబూబా ముఫ్తీతోపాటు అలీ మహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధం గడువును మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఈ చట్టాన్ని ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందించారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. (‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’) -
ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్‌ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది. 83 ఏళ్ల ఫరూక్‌తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్‌లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’
న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మరోసారి నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన సోదరుడి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సరైన కారణాలు లేకుండా ఇప్పటికే ఓసారి డిటెన్షన్‌లో పెట్టారని, మళ్లీ నిర్బంధించి వారి హక్కులను కేంద్రం పెద్దలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల నోళ్లు నొక్కడానికి పక్కా ప్లాన్‌తో ఇదంతా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. (చదవండి : ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు) కాగా, జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు (ఈ నెల 6వ తేదీన) వీరిద్దరితో పాటు మరికొందరినీ ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు
శ్రీనగర్: ‘మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(49) ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉంది... మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ(60) నిషేధిత ఉగ్రసంస్థకు మద్దతు ప్రకటించారు’ ఈనెల 6వ తేదీన ఒమర్, మెహబూబాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. అందుకు కారణాలను తెలుపుతూ రూపొందించిన నివేదికలోని అంశాలివి. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరినీ పోలీసులు పీఎస్ఏ కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద వీరిని మూడు నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. ఇప్పటికే ఒమర్ తండ్రి, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌కు ప్రజల్లో పలుకుబడి ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్న సమయంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు పిలుపు నిచ్చినప్పటికీ ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రభావితం చేయగలిగారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నించారు’ అని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒమర్ చేసిన కామెంట్లను మాత్రం అందులో ప్రస్తావించలేదు. ‘పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ‘ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. నిషేధిత జమాతే ఇస్లామియా సంస్థకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు’ అని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్పై తాత్కాలిక నిషేధం కశ్మీర్లో ఆదివారం ఉదయం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన యంత్రాంగం సాయంత్రానికి ఆంక్షలు సడలించింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో దోషి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలై ఏడేళ్లవుతున్న సందర్భంగా వేర్పాటువాద సంస్థ జేకేఎల్ఎఫ్ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ను బంద్ చేశారు. -
ఆ రోజు అస్సలు మర్చిపోను.. చపాతీలో..
శ్రీనగర్: కశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులు నేటికీ ఉల్లంఘనకు గురవుతున్నాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల ఆర్థిక, మానసిక కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నాటి (2019, ఆగస్ట్ 5) నుంచి మెహబూబా ముఫ్తి సహా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని సొంత నివాసాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే వారిద్దరిపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్-పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తి కుమార్తె తాజా పరిణామాలపై ముఫ్తి ట్విటర్ అకౌంట్లో ఓ లేఖ పోస్టు చేశారు.(కశ్మీర్ నేతలకు మరోషాక్!) ‘‘ఆర్టికల్ 370 రద్దు జరిగిన నాటి నుంచి గత ఆరు నెలలుగా మా అమ్మ గృహ నిర్బంధంలో ఉన్నారు. అమ్మను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లిన రోజును నేను ఎన్నటికీ మర్చిపోలేను. గృహ నిర్బంధంలోకి వెళ్లిన నాటి నుంచి ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. ఓ రోజు టిఫిన్ బాక్సులో ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోయాను. తన కోసం పంపిన బాక్సులో... ‘‘నా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సందేశాలు పోస్టు చేసిన వారిని కూడా వాళ్లు అరెస్టు చేస్తారు. లవ్ యూ మిస్ యూ’’ అనే ఉత్తరం కనిపించింది. అయితే అమ్మకు ఎలా బదులివ్వాలో అర్థం కాలేదు. అప్పుడే గ్రానీ ఒక ఐడియా ఇచ్చారు. అప్పుడు లెటర్ రాసి.. దానిని చిన్నగా మలిచి.. చపాతీలో చుట్టిపెట్టాను. (‘ఏం చేశాను.. నన్ను కూడా బంధించారు’) ఇలా నేను ఒక్కదాన్నే కాదు ఎంతో మంది తమ ప్రియమైన వారితో మాట్లాడే అవకాశం కోల్పోయారు. అంతేకాదు ఆర్థికంగా కూడా జమ్మూ కశ్మీర్ ఎంతో నష్టపోయింది. కేవలం ఇవే కాదు.. పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య తీర్పు వంటివి ఇలాంటి కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వీటిని చూసి ఎంజాయ్ చేస్తోంది. ఒక కూతురిగా మా అమ్మను భద్రతా బలగాలు బంధించడం నేను చూశాను. ఆమెను విముక్తురాలు చేసేందుకు చిన్నపాటి యుద్ధం చేశాను. ఇక బతుకు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని ఇల్తిజా తన లేఖలో రాసుకొచ్చారు. కాగా తాజాగా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాపై నమోదైన (పీఎస్ఏ) ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. pic.twitter.com/whizycBCP9 — Mehbooba Mufti (@MehboobaMufti) February 6, 2020 -
కశ్మీర్ నేతలకు మరోషాక్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ)లపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్–పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వారిద్దరి ఆరు నెలల ముందస్తు నిర్బంధం ముగియడానికి కొన్ని గంటల ముందు వారిపై ఈ కేసు పెట్టడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019, ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆ ఇద్దరు నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులతో పాటు వచ్చిన మెజిస్ట్రేట్ సంబంధిత నోటీసులను వారి నివాసాల్లో ఆ ఇద్దరు నేతలకు అందించారు. ఆ ఇద్దరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
‘ఏం చేశాను.. నన్ను కూడా బంధించారు’
శ్రీనగర్: తనను కూడా పోలీసులు నిర్బంధించారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంటి నుంచి బయటకు రాకుండా శ్రీనగర్ పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన నాటి నుంచి మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తల్లి ముఫ్తి తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఇల్తిజా.. గురువారం తనను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాతయ్య సమాధి చూసేందుకు వెళ్తానంటే అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు.(చదవండి: మీ అమ్మను కలవొచ్చు..కానీ) అదేమైనా నేరమా? ‘నన్ను ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు. ఇంట్లోనే బంధించారు. మా తాతయ్య నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాలనుకున్నాను. ఇందుకోసం నా వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్‌ను పంపించి అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను కోరాను. కానీ వారు అందుకు నిరాకరించారు. ఒక మనవరాలు.. తన తాతయ్య సమాధి వద్దకు వెళ్లడం నేరమా? లేదంటే నేను అక్కడికి వెళ్లి రాళ్లు రువ్వే నిరసన కార్యక్రమాలు చేపడతానని పోలీసులు భయపడుతున్నారా’ అని ఇల్తిజా ప్రశ్నించారు. లోయలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.(‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’) కాగా మెహబూబా ముఫ్తి తండ్రి ముఫ్తి మహ్మద్ సయీద్ సమాధి అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇది ఇల్తిజా నివాసానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే భద్రతా కారణాల వల్లే ఇల్తిజాను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. ఇల్తిజా ఎస్ఎస్జీ ప్రొటెక్షన్‌లో ఉన్నారని.. కాబట్టి తాను ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అనంతనాగ్ జిల్లా పాలనా విభాగం తనకు అనుమతి తిరస్కరించిన విషయం తమకు తెలియదన్నారు. -
మెహబూబాతో పార్టీ నేతల మీటింగ్‌కు గవర్నర్ ఓకే
శ్రీనగర్: గృహనిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని ఆ పార్టీ నేతలు సోమవారం కలవనున్నారు. 10 మంది నాయకులతో కూడిన పీడీపీ బృందం ముఫ్తీతో భేటీ అయ్యేందుకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4 నుంచి మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉన్నారు. అబ్దుల్లాను కలిసిన ఎన్సీ నేతలు రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్సీ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా నేతృత్వంలో 15మంది సీనియర్ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. -
మీ అమ్మను కలవొచ్చు..కానీ
న్యూఢిల్లీ : గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లిని కలిసేందుకు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావేద్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే శ్రీనగర్‌లో స్వేచ్ఛగా పర్యటించే విషయమై స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో నిబంధనలకు లోబడి ముఫ్తిని చూడవచ్చని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మా అమ్మను నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు’ అంటూ ఇల్తిజా జావేద్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కశ్మీర్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో తన తల్లిని కలిసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చెన్నైకి వెళ్లేందుకు మాత్రం అనుమతించారు గానీ శ్రీనగర్‌లో స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా తన తల్లితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలన్న ఇల్తిజా అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. నేడు ఆమె పిటిషన్‌ను విచారించింది. ఇందులో భాగంగా ఇల్తిజా శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదని సీజేఐ రంజన్ గొగోయ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితో ఇల్తిజా ముఫ్తిని కలవచ్చని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల అనంతరం ఇల్తిజా తన తల్లిని కలిసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. -
‘నన్ను నిర్భందించారు.. చంపేస్తారేమో’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాని అరెస్ట్ చేసి ఇప్పటికి పది రోజులకు పైనే అయ్యింది. జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్ ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓ వాయిస్ మెసేజ్‌ని విడుదల చేశారు. మీడియాతో మాట్లాడితే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై అమిత్ షా వివరణ ఏంటని ఇల్తిజా ప్రశ్నించారు. ‘ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. కశ్మీర్ ప్రజలని మాత్రం జంతువుల మాదిరి ఓ బోనులో బంధించారు. వారు మానవ హక్కులను కూడా కోల్పోయారు. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన వ్యక్తం చేయకుండా ఉండటం కోసం మా రాష్ట్రంలో సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బయటి ప్రపంచంతో మా సంబంధాలను నిలిపివేసి మా గొంతు నొక్కేశారు’ అన్నారు. ‘అంతేకాక నన్ను కూడా నిర్భందించారు. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీడియాకు తెలియజేశాను. అందుకే నన్ను కూడా నిర్భందించారు. ఈ విషయాల గురించి మరోసారి మీడియాతో మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నన్ను నిఘా పర్యవేక్షణలో ఉంచి నేరస్తురాలిగా చూస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను కూడా చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా మాటలపై అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి’ అంటూ ఇల్తిజా వాయిస్ మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, మానవహక్కుల ఉల్లంఘన జరగుతుందంటూ.. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇల్తిజా సందేశం సంచలనం సృష్టిస్తోంది. -
‘టార్చర్ సెంటర్’లో మెహబూబా ముఫ్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ వల్ల రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుంది. మీ కార్యకలాపాలు శాంతికి విఘాతం కల్పించవచ్చు. అందుకే మిమ్మల్ని నిర్బంధించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం’ అంటూ ఆగస్టు 5వ తేదీ సాయంత్రం శ్రీనగర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. ముద్రణలో ఉన్న ఈ ఆదేశాల కింద ‘చష్‌మషాహి సూట్, గ్రౌండ్ ఫ్లోర్, హరి నివాస్ గెస్ట్ హౌజ్‌లో ముఫ్తీని ఉంచండి. దీన్ని ఎస్ఆర్వో-498 కింది తాత్కాలిక జైలుగా మారుస్తున్నాం’ అని చేతి రాతలో ఉంది. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఇంతకుముందు ఇదొక ‘పెద్ద టార్చర్ సెంటర్’గా పేరు పొందింది. 1990వ దశకంలో కశ్మీర్ మిలిటెన్సీ అణచివేతలో భాగంగా వేలాది మంది యువకులను ఈ గెస్ట్‌హౌజ్‌లోనే నిర్బంధించి హింసించారు. వారిలోని ఒక్కొక్క అవయవాన్ని ఒక్కోరీతిగా తొలగించి ప్రత్యక్షంగా నరకం చూపించే వారన్న ప్రతీతి దీనికుంది. అంతకుముందు ఇది జమ్మూ కశ్మీర్ డోగ్రా రాజు మహారాజా హరిసింగ్ ప్యాలెస్. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ను తమ దేశంలో కలిపి వేయాలంటూ మహారాజా హరిసింగ్‌పై ఇటు భారత్ నుంచి అటు పాకిస్థాన్ నుంచి ఒత్తిళ్లు వచ్చిన విషయం తెల్సిందే. కశ్మీర్ ముస్లిం రాజ్యం కనుక తమ దేశంలో విలీనం చేయాలంటూ పాకిస్థాన్ ఒత్తిడి చేయగా, భారత్‌లో విలీనం చేసినట్లయితే పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని పంపిస్తామంటూ భారత్ ఒత్తిడి తెచ్చింది. హిందూ రాజైన హరిసింగ్ భారత్‌లోనే తన రాజ్యాన్ని కలిపేందుకు మొగ్గుచూపి, భారత్‌లో విలీనం చేస్తున్నట్లు 1947, అక్టోబర్ 26వ తేదీతో సంతకం చేసి కశ్మీర్ నుంచి అదృశ్యమయ్యారు. ఆయన మళ్లీ ఎప్పుడు కశ్మీర్ తిరిగి రాలేదు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో చర్చలు జరిపి కశ్మీర్ ప్రజా నాయకుడు, లౌకికవాది షేక్ అబ్దుల్లా కశ్మీర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 370 ఆర్టికల్ కింద రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని సాధించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో షేక్ అబ్బుల్లా జైలుకు వెళ్లడం, పదవీ వ్యామోహంతో కశ్మీర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలయ్యారనే ఆరోపణలతో 1989లో కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగింది. 1985లోనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న ఒకనాటి ప్యాలెస్, నేటి హరి నివాస్ గెస్ట్‌హౌజ్‌లో మిలిటెంట్లను నిర్బంధించి టార్చర్ చేసేవారు. ప్రస్తుతం ఈ భవనంలోనే నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ, ఇతర కశ్మీర్ నాయకులకు నాటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతుండవచ్చు. ముఫ్తీ సొంతింటికి కొన్ని నిమిషాల్లో వెళ్లే దూరంలోనే ఈ టార్చర్ సెంటర్ ఉంది. ముఫ్తీ సొంతిల్లు కూడా ఒకప్పుడు టార్చర్ సెంటరే. 1990లో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ‘టార్చర్ సెంటర్’గా ఉపయోగించిన ఆమె ఇంటిని నాడు ‘పాప-2’ అని పిలిచే వారు. ముఫ్తీకి అక్కడ లేని పాప భీతి ఇక్కడ ఎందుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
నా తల్లిని కూడా కలవనివ్వరా?
శ్రీనగర్ : తనని గృహనిర్భందం చేయడం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు సనా ఇల్తిజా జావెద్ వ్యాఖ్యానించారు. తనకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోయినా అక్రమంగా నిర్భందించారని వాపోయారు. ‘నన్ను మా అమ్మ నుంచి దూరం చేశారు. ఆమె దగ్గరకు వెళ్లనివ్వండని నేను చాలా సార్లు పోలీసులను అభ్యర్థించాను. మా అమ్మను కలవాలనుకున్నా.. వారు అభద్రతకు గురువుతున్నారాంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒక తల్లిని కూతురు కలుసుకునే హక్కు కూడా లేదా? వీరు ఇంతలా భయపడుతున్నారంటే దానర్థం ఆర్టికల్ 370ని తొలగించడం రాజ్యాంగ విరుద్దమని భావించారు కనుకనే ఇలా చేస్తున్నారు’ అని వెల్లడించారు. ‘నన్ను కలవడానికి కూడా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. నేను ఒక కశ్మీరీని, భారతీయ పౌరురాలుని, అసలు రాజకీయాలే తెలియని ఒక సాధారణ మహిళని, అయినా నన్ను చూసి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు. ఏం స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే హక్కులు మాకు లేవా’ అని ప్రశ్నించారు. కశ్మీరీల హక్కులను, గౌరవాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని దేశం లేదా అంతర్జాతీయ సమాజం చూడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నా తల్లి స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తోంది. తను వారి మాయలో పడదని, తను చాలా బలమైన మహిళని పేర్కొన్నారు. కాగా ఆగస్టు 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలని గృహ నిర్భందంలో ఉంచిన సంగతి తెలిసిందే. -
‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’
శ్రీనగర్ : ‘మా అమ్మను నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయాల నేపథ్యంలో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దు నేపథ్యంలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇక రాష్ట్ర పునర్విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టే సమయానికి వారిద్దరిని అదుపులోకి తీసుకుని శ్రీనగర్‌లో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. ఈ క్రమంలో..‘ కశ్మీరీల పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి గళం విప్పేందుకు మా అమ్మకు ఉన్న అన్ని దారులు మూసివేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేశారు. మా అమ్మతో మాట్లాడేందుకు, కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. హరినివాస్‌లో ఆమెను బంధించారు. వారు చేసే పని సరైందే అయినపుడు నిర్బంధించడం ఎందుకు. ఈ విషయం కేవలం మా అమ్మ లేదా ఒమర్ అబ్దుల్లాకు మాత్రమే సంబంధించినది కాదు. సాధారణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ప్రజాప్రతినిధులను బందిపోట్లలా, నేరస్తుల్లా చూడటం వారికే చెల్లింది. వారు తీసుకుంటున్నవి చట్ట వ్యతిరేక నిర్ణయాలు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఇల్తిజా ఎన్డీటీవీకి ఇచ్చిన ఆడియో మెసేజ్‌లో మోదీ సర్కారు తీరును విమర్శించారు. కాగా జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 సభ్యులు ఓటు వేశారు. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు సభకు గైర్హాజరు కాగా.. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. -
వీరి భవితవ్యం ఏంటి?
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అన్న సంఘ్‌పరివార్ కల నెరవేరి జమ్ము కశ్మీర్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 370 ఆర్టికల్ రద్దవడంతో పాటు మంచుఖండాన్ని రెండుభాగాలుగా విభజించే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇక జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండడంతో అక్కడ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అన్న చర్చ మొదలైంది. ప్రధానంగా ఇన్నాళ్లూ కశ్మీర్ లోయను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన అబ్దుల్లా, ముఫ్తీ వంశాల భవిష్యత్ ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీలు ‘ప్రజాస్వామ్యానికే ఇది చీకటి రోజని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు’ అని ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా భవిష్యత్‌లో రాజకీయంగా వారికి ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీపైనే పీడీపీ ఆధారపడాల్సి వచ్చింది. జమ్ము, లదాఖ్‌లో ప్రజలు దశాబ్దాల తరబడి హింసాకాండతో విసిగివేసారిపోయారు. శాంతి స్థాపన, అభివృద్ధిని వారు ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఎన్సీ, పీడీపీలు రాజకీయాలు కేవలం కశ్మీర్ లోయకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో సీట్లు పెరిగితే.. కశ్మీర్ లోయతో పోల్చి చూస్తే జమ్మూ అతి పెద్ద ప్రాంతం. జనాభా పరంగా కూడా పెద్దది. కేంద్రం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. జమ్మూ ప్రాంతంలోనే 10–15 సీట్లు పెరిగితే రాజకీయా లు బీజేపీకి అనుకూలంగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్ము ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు పన్నుతున్న కమలనాథులు కశ్మీరీయేతర హిందూ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యోచిస్తున్నారు. పీడీపీ, ఎన్సీ చేతులు కలిపితే... అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోయలో వేర్పాటు వాదులతో చేతులు కలిపి విధ్వంసం సృష్టించడం, బీజేపీని ఎదుర్కోవడానికి కలసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ రెండు పార్టీల పాత్ర నామమాత్రంగానే ఉంటుందనే భావన ఉంది. ఎందుకంటే కేంద్రపాలితం కావడంవల్ల శాంతి భద్రతలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి. పాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం ఉంటుంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో పోరాటం చేయడం మినహా వారికి వేరే మార్గం ఉండదు. -
కశ్మీర్ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ గురించే చర్చ నడుస్తోంది. భారీగా కేంద్ర బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్ర నిలిపివేత ద్వారా కశ్మీర్ అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కేంద్రం సంకేతాలు పంపింది. ఈ క్రమంలో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగిస్తున్నట్లు ప్రకటించి యావత్ దేశ ప్రజల ఉత్కంఠకు అమిత్ షా తెరదించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు సంచలన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడిన విషయం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలో...‘నా నిర్ణయం కారణంగా నేడు నాపై విమర్శలు వెల్లువెత్తవచ్చు. కానీ ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. జమ్ము కశ్మీర్ సమస్యను పరిష్కరించగల ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే’ అన్న ముఫ్తి మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అయితే అవి ఆమె ఇప్పుడు అంటున్న మాటలు కావు. బీజేపీతో కలిసి కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమై ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటివి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోదీ సర్కారును విమర్శిస్తూ ముఫ్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆమె మోదీని కొనియాడిన మాటలను ఉటంకిస్తూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘అధికారం కోసం నాడు బీజేపీతో చేతులు కలిపి.. ఇప్పుడు ఇలా మాట్లాడతారా. నిజానికి కశ్మీర్‌కు మీలాంటి వల్లే అన్యాయం జరిగిందని’ కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొంత మంది మాత్రం...‘మోదీ సమస్యను పరిష్కరిస్తారు అని ముఫ్తి అన్నారు గానీ... ఇలా సమస్యను మరింత జఠిలం చేస్తారని ఊహించి ఉండరు అందుకే అలా మాట్లాడారు’ అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. కాగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ-పీడీపీ కలిసి 2015లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. అయితే భేదాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో 2018లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో అక్కడ గవర్నర్ పాలన విధించింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పేర్కొన్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. -
ట్రిపుల్ తలాక్ బిల్లు; కశ్మీర్లో పంచాయతీ..!
శ్రీనగర్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా మధ్య ట్విటర్లో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వైఖరిని ముఫ్తీ తప్పుబట్టారు. ఆగమేఘాల మీద ట్రిపుల్ తలాక్ బిల్లును తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈ బిల్లును చట్ట విరుద్దమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. కేవలం ముస్లింలపై కక్ష సాధించడానికే ట్రిపుల్ తలాక్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెహబూబా ముఫ్తీ జీ.. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలు ఎక్కడున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి మీ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోవడానికి, బిల్లు గట్టెక్కడానికి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మీ ఆంతర్యం ఏమిటీ అని’ ప్రశ్నించారు. ముఫ్తీ స్పందిస్తూ.. ‘ఓటింగ్ సమయంలో ప్రభుత్వ తీసుకొచ్చే బిల్లులకు నిరసనగా సంయమనం పాటించడం కూడా వ్యతిరేకించినట్టే. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచింది. 1999లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ పార్టీ సభ్యుడు సోజ్ సాహెబ్‌ను బహిష్కరించారు. అక్కడే మీ నైతికత ఏంటో తెలిసిపోతోంది’ అన్నారు. దీనిపై ‘మీ పార్టీ వంచనను కప్పిపచ్చుకోడానికి ఇరవై ఏళ్ల సంఘటనను గుర్తుచేశారు. మీ ఎంపీలను రాజ్య సభకు గైర్హాజరు కావాలని ఆదేశించినట్టు అంగీకరిస్తున్నారు. సంయమనం పాటించటం ఓటు కాదు. బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది’ అని ఒమర్ విమర్శించారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంగళవారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో గట్టెక్కింది. -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను పంపనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్లు సమాచారం. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల జమ్మూ కశ్మీర్లో పర్యటించి అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆయన కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 40 వేల అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌కు పంపింది. అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి తరలివెళ్లాయి. లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే అదనపు బలగాలను పంపుతున్నట్టు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. భయబ్రాంతులకు గురిచేస్తున్నారు జమ్మూకశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను తరలించడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసేందుకే అదనపు బలగాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్లో శాంతి భద్రతలకు లోటు లేదని, అయినప్పటికీ బలగాలను తరలించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, వాటిని బలగాలతో పరిష్కరించలేరన్నారు. అదనపు బలగాల తరలింపుపై కేంద్రం మరోసారి పురరాలోచించాల్సిన అవరసరం ఉందన్నారు. కాగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. Centre’s decision to deploy additional 10,000 troops to the valley has created fear psychosis amongst people. There is no dearth of security forces in Kashmir. J&K is a political problem which won’t be solved by military means. GOI needs to rethink & overhaul its policy. — Mehbooba Mufti (@MehboobaMufti) July 27, 2019 -
‘టీమిండియా ఓటమికి కారణం అదే’
శ్రీనగర్ : జెర్సీ కారణంగానే ప్రపంచకప్‌లో టీమిండియా పరాజయం పాలైందన్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తిపై, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మండిపడ్డారు. పాకిస్తాన్ గెలుపు కోసం ముఫ్తి మనసు పరితపిస్తోందని.. అందుకే ఆమె భారత జట్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో కోహ్లి సేన 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో భారత్ తొలి ఓటమికి జెర్సీ రంగే కారణం అంటూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో మెహబూబా ముఫ్తి కూడా టీమిండియా ఓటమిపై స్పందించారు. ‘ నన్ను మూఢనమ్మకస్తురాలు అనుకున్నా సరే. ఏదైమైనా ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి జెర్సీనే కారణం’ అని ట్వీట్ చేశారు. అదేవిధంగా అంతకుముందు..‘ ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాలని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కనీసం క్రికెట్ కారణంగానైనా రెండు దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి’ అని ముఫ్తి ట్విటర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ‘మీ మనసులో ఏముందో తెలిసిపోయింది. పాకిస్తాన్ కోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అవును.. ఎన్నికల్లో మీరు ఏ రంగు జెర్సీ ధరించారు’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఈ మ్యాచ్‌లో గనుక భారత్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయి ఉంటే సెమీస్ రేసు నుంచి నిష్ర్రమించేది. తద్వారా వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే.. ఇంగ్లండ్‌పై భారత్ గెలవాలని పాక్ అభిమానులు కోరుకున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా ఆరెంజ్ జెర్సీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆరెంజ్ జెర్సీ కారణంగానే భారత్ ఓడిపోయిందని అంటున్నారు. పాకిస్తాన్ ఎల్లప్పుడు ఆకుపచ్చ జెర్సీనే ధరిస్తుంది కదా. మరి వాళ్లెందుకు ఓడిపోతున్నారు. బహుశా మత గురువుల్లా పొడవాటి గడ్డాలు పెంచుతున్నందుకే వారు ఓడిపోతున్నారామో. భారత్ పేరును నాశనం చేసేందుకే ఇలాంటి కొంత మంది వ్యక్తులు కంకణం కట్టుకున్నారు’ అని మండిపడ్డారు. Call me superstitious but I’d say it’s the jersey that ended India’s winning streak in the #ICCWorldCup2019. — Mehbooba Mufti (@MehboobaMufti) June 30, 2019 -
ఉపశమనం లభించింది; ఇది సరిపోదు!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్‌బ్రాంచ్ టీమ్‌ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్తాబా, ఎస్ఎస్పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్ష సరిపోదు.. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు కాగా కశ్మీర్‌లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. -
ముఫ్తి ట్వీట్.. గంభీర్ కౌంటర్
న్యూఢిల్లీ : కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర హోం మంత్రి చొరవ తీసుకుంటారని భావించడం మూర్ఖత్వమే అవుతుందని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కశ్మీర్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయినపుడే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు..‘ 1947 నుంచి ఏర్పడిన ప్రభుత్వాలన్నీ కశ్మీర్‌ను ఒక భద్రతా సమస్యగానే చూస్తున్నారు. రాజకీయంగా నెలకొన్న సమస్యలు ముగిసిపోవాలంటే పాకిస్తాన్ సహా అన్ని రాజకీయ పార్టీలన్నీ ఇందులో భాగమైనపుడే ఒక ముగింపు వస్తుంది. అయితే ఇప్పుడున్న హోం మంత్రి ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది’ అని అమిత్ షాను ఉద్దేశించి ముఫ్తి ట్వీట్ చేశారు. కాగా ముఫ్తి ట్వీట్‌పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. ‘ చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని నాలాంటి వాళ్లు భావిస్తుంటే మెహబూబా ముఫ్తి మాత్రం అమిత్ షా అనుసరించే విధానాలను ఎద్దేవా చేస్తున్నారు. సహనం వహించినందు వల్ల ఏం జరిగిందనే విషయానికి చరిత్రే సాక్ష్యం. ఒకవేళ అణచివేతకు గురైన వారు నా ప్రజల భద్రతకు హామీ ఇవ్వగలిగితే వాళ్లు చెప్పినట్టే చేస్తాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఎత్తివేస్తామని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మీరు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయండి. మేం ఆర్టికల్ 370ని ఎత్తివేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తి ఆయనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. Since 1947, Kashmir’s been looked through the prism of security by successive governments. It’s a political problem that needs a political redressal by involving all stakeholders inc Pak.Expecting a quick fix through brute force by newly appointed HM is ridiculously naive — Mehbooba Mufti (@MehboobaMufti) June 3, 2019 -
మోదీ.. కశ్మీర్‌ను వదిలేయ్!
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్‌కు తీవ్ర నష్టం చేకూర్చిందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టికల్ 370 అంత చెడ్డదైతే.. రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘మన అనుబంధానికి ఆర్టికల్ 370 పునాది కాదని ప్రధాని మోదీ భావిస్తే.. అప్పుడు కశ్మీర్‌ను వదిలేయండి. కశ్మీర్ దివాలా తీయబోతోందని ఆయన భావిస్తే.. కశ్మీర్‌ను వదిలేయమనండి. ఆ దివాలా భారాన్ని ఆయన ఎందుకు మోయాలి’ అని ముఫ్తి ప్రశ్నించారు. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రాతిపత్తి వల్ల అక్కడ ఐఐఎంలు, ఐఐటీలు స్థాపించినా.. అక్కడికి వెళ్లేందుకు ప్రొఫెసర్లు సిద్ధపడటం లేదని, సొంతంగా భూమి కొనే వెసులుబాటు లేకపోవడం, అద్దెలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని, ఈ నిబంధనల వల్ల పెట్టుబడులు కూడా అక్కడికి రావడం లేదని, ఉగ్రవాదులు పర్యాటక రంగాన్ని నాశనం చేశారని, జమ్మూకశ్మీర్ దివాలా దిశగా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. -
శవాలను గుర్తించకుండా కెమికల్స్ ప్రయోగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చిన తరువాత వారి శవాలను గుర్తించడానికి వీల్లేకుండా కెమికల్స్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాది అయినా.. ఇంకెవరైనా.. మనిషిగా పుట్టిన ప్రతీ వ్యక్తికి చావు తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని గుర్తుచేశారు. సాయుధ దళాలు ఎన్కౌంటర్స్ తర్వాత మృతదేహాలపై కెమికల్స్ ప్రయోగించి.. శవాలను గుర్తుపట్టకుండా చేయడం అమానవీయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని శాంగస్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బుధవారం మీడియాతో మాట్లాడారు. నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. వార్తల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ముఫ్తీ హయాంలోనే కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఎక్కువగా జరిగిందన్నారు. సైన్యం కెమికల్స్ ఉపయోగించిందా? లేదా? అన్నది ఆమెకే తెలియాలని అన్నారు. ముఫ్తీ కామెంట్స్‌ను ఎలక్షన్ జిమ్మిక్‌గా వర్ణించారు. కాగా, కశ్మీర్‌లోని సాయుధ దళాలు కెమికల్ ప్రయోగిస్తున్నాయన్న ఆరోపణలు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. సైన్యం మాత్రం ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. జెనీవా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులపై సాయుధ దళాలు కెమికల్స్ ఉపయోగించడం నిషిద్ధం. -
‘భారత్‌లో ఉండాలా.. లేదా అనేది నిర్ణయించుకుంటాం’
కశ్మీర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌ని భారత్‌తో కలిపి ఉంచుతున్న వంతెనని, దానిని తొలగిస్తే భారత్‌లో అంతర్భాగంగా ఉండాలా, వద్దా అనే అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఇటీవల అరుణ్ జైట్లీ ఆర్టికల్ 35ఏ కొనసాగింపుపై పునరాలోచించాలంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉన్న కశ్మీర్ భారత్‌తో కలిసి ఉందంటే.. దానికి కేవలం ఆర్టికల్ 370నే కారణమని తెలిపారు. దాన్ని తొలగిస్తే.. భారత్‌తో కశ్మీర్ కలిసి ఉండే విషయంలో పునరాలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోంది. కాగా గతంలో కూడా మెహబూబా ముఫ్తీ ఆర్టికల్ 35ఏ, అలాగే ఆర్టికల్ 370 తొలగింపు అంశంపై సీరియస్‌గానే స్పందించారు. గత సంవత్సరం కూడా ఆర్టికల్ 35ఏను తొలగిస్తే కశ్మీర్లో జాతీయ జెండా పట్టుకునేవారు కూడా ఉండరని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 35 ఏ జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నివసించే శాశ్వత నివాసితులకు సంబంధించిన విశేష అధికారాలు కల్పించింది. -
ఇమ్రాన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి : మెహబూబా
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ అవకాశం ఇవ్వండని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పుల్వామా దాడికి సంబంధించిన సాక్ష్యాలుంటే ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఇమ్రాన్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మెహబూబా మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్, ముంబై దాడులకు సంబంధించి పాక్‌కి ఆధారాలు సమర్పించినా అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పదవిలో లేరని, ఆయనకో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్నది సరికొత్త పాకిస్తాన్ అని ఇమ్రాన్‌ఖాన్ చెబుతున్నారని కాబట్టి.. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఫ్తీ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 మంది భారత సైనికులను బలిగొన్న దేశానికి మద్దతు తెలుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఎన్‌యూ ఫ్రొఫెసర్ అమితా సింగ్ అయితే ఏకంగా ఈ ఉగ్రదాడికి మెహబూబానే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వాహనాలను నిలువరించే విషయంలో ముఫ్తీ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ ఉగ్ర దాడి జరిగిందని ట్వీట్ చేశారు. ‘‘ఆర్డీఎక్స్ నింపిన వాహనాన్ని అధికారులు పరీక్షించే అవకాశం లేకుండా మెహబూబా ముఫ్తీ ఆ మార్గంలోని మూడు చెక్ బ్యారియర్లను తొలగించారు. గవర్నర్ గారూ.. దయచేసి ఆమె తొలగించిన అన్నిటినీ మళ్లీ పునరుద్ధరించండి. 40 మంది సైనికులు చనిపోయారన్న బాధ నిజంగా మెహబూబా ముఫ్తీకి ఉంటే.. తన పొరపాటుకు పరిహారంగా 40 మంది తన మద్దతుదారులను బహిరంగంగా ఉరితీసేందుకు అప్పగించాలి...’’ అని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై మెహబూబా కూడా ఘాటుగానే స్పందించారు. ‘ఉన్నత చదువులు చదివిన ఓ వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? ఆమె నిజంగా చదువుకున్నారా? కశ్మీరీలను వేధించాలన్న ఉద్దేశ్యంతో ఆమె కావాలనే ఈ కట్టుకథలు అల్లుతున్నట్టు కనిపిస్తోంది..’’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్లకు ప్రవేశం లేదని ఓ హోటల్ యజమాని పెట్టిన బోర్డుపై కూడా మెహబూబా ఘాటుగా స్పందించారు. కశ్మీర్‌పై విద్వేశం పెంచుకొని ఏం సాధిస్తారని ప్రశ్నించారు. How can someone who imparts education be so diabolical & ignorant by choice? Is she educated in the real sense? She seems to possess an unfettered imagination with an aim to persecute Kashmiris. Ironical that she teaches ethics and law! https://t.co/v6euDLezdg — Mehbooba Mufti (@MehboobaMufti) 19 February 2019 -
‘అందుకోసం ఏ పార్టీతో అయినా చేతులు కలుపుతాం’
శ్రీనగర్ : పాకిస్తాన్‌తో మాట్లాడానికి ఇదే సరైన సమయం అంటున్నారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ‘ప్రస్తుతం పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ తనను తాను తన దేశ ఆర్మి ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు. చర్యలకు సిద్ధం అంటున్నారు. కాబట్టి పాక్‌తో చర్చలు జరపడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు చర్చలు జరిపితే మంచి ఫలితం ఉంటుంద’ని చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశం గురించి మాట్లాడటానికి కూడా ఇదే మంచి సమయం అన్నారు. అంతేకాక కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా చేతులు కలపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు ముఫ్తీ. అది బీజేపీ పార్టీ అయినా సరే.. కశ్మీర్ సమస్య పరిష్కారం కావడమే ముఖ్యం అన్నారు. అందుకోసమే గతంలో పీడీపీ, బీజేపీతో చేతులు కలిపిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రయోగం సక్సెస్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. కశ్మీర్ ప్రజలు కూడా దీన్ని ఆమోదించలేదన్నారు. అంతేకాక మాజీ భారత ప్రధాని వాజ్‌పేయికి.. నేటి ప్రధాని నరేంద్రమోదీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. అటల్జీ ఒక రాజనీతిజ్ఞుడు.. చాలా గొప్పవారు.. వెనకడుగు వేయని ధీశాలి. కానీ నేటీ ఎన్డీఏ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించడం గురించి తప్ప మరో ఆలోచన లేదంటూ విమర్శించారు. ఆవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న మూక దాడులను ఉద్దేశిస్తూ.. ఇంకా నయం ఆవులకు ఓటు హక్కు ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు. -
బీజేపీతో పొత్తు.. విషం తాగినట్లే
శ్రీనగర్ : బీజేపీతో పొత్తు అంటే విషం తాగినట్లే అని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మహ్మద్ సయ్యద్ మరణాంతరం మెహబూబా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పీడీపీతో విభేదించిన బీజేపీ రెండేళ్ల కూటమి అనంతరం పీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ముఫ్తీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీతో కూటమి అంటే విషయం తాగినట్లే. రెండేళ్లు వారితో కలిసి ప్రభుత్వాన్ని నడిపాను. ఆ బాధ ఏలా ఉంటుందో నాకు తెలుసు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అందుకే రెండోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కానీ అప్పుడున్న నాయకత్వానికి.. ఇప్పటికి చాలా తేడా ఉంది. రెండోసారి పోత్తు పెట్టుకోవడం చాలా కఠినమైన నిర్ణయమే’ అని వ్యాఖ్యానించారు. పీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ముఫ్తీపై తిరుగుబాటుకు ప్రయత్నించిన ఘటన కశ్మీర్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం రాజీనామా చేయగా.. ప్రస్తుతం కశ్మీర్లో గవర్నర్ పాలన అమలులో ఉంది. -
బీజేపీపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం
-
బీజేపీపై నిప్పులు చెరిగిన మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనే వార్తలపై ఆమె స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతుతోనే తమ పార్టీలో చీలిక వచ్చిందని విమర్శించారు. గతంలో ముస్లిం యూనైటెడ్ ఫ్రంట్‌పై అనుసరించిన వైఖరిని పీడీపీపై ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీని హెచ్చరించారు. కేంద్రం 1987లో మాదిరి కశ్మీర్ ప్రజల ఓటు హక్కును కాలరాయాలని చూస్తే సలావుద్దీన్, యాసిన్ మాలిక్ వంటి వారు పుట్టుకోస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్లో గవర్నర్ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ జూన్ 19న పీడీపీకి మద్దతు ఉపసంహరించడంతో సీఎం పదవికి ముఫ్తీ రాజీనామా చేశారు. ఇటీవల పీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమె ఈ రకంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ముఫ్తీ వ్యాఖ్యాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పీడీపీని చీల్చితే ఒక మిలిటెంట్ కూడా పుట్టుకురాడన్నారు. కశ్మీర్లో కేవలం ఓట్లను చీల్చడానికి పుట్టిన పార్టీకి అన్యాయం జరిగితే ప్రజలు స్పందిచరని తెలిపారు. -
కశ్మీర్లో తొలి బీజేపీ సర్కారు?
న్యూఢిల్లీ/శ్రీనగర్: మెహబూబా ముఫ్తీ రాజీనామా తర్వాత కశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. నిర్మల్ సింగ్‌తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్తోనూ మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీ, శ్రీనగర్‌లోని బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. రామ్‌మాధవ్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనీతో సమావేశమవడం, తర్వాత లోనే ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ కావడం తెల్సిందే. -
మెహబూబా ముఫ్తీకి భారీ షాక్
-
కశ్మీర్ రాజకీయాల్లో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి భారీ షాక్ తగిలింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీతో బ్రేకప్ను జీర్ణించుకోలేని ముగ్గురు పీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ, మహ్మద్ అబ్బాస్ వానీ, వీరిద్దరితోపాటు మరో సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మరికొందరిని కూడగలుపుకుని ఈ రెబల్స్ కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. మెహబూబాపై వ్యతిరేకగళం... సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబా ముఫ్తీ నాయకత్వంపై తొలి నుంచే వ్యతిరేకిస్తున్నారు. దీనికితోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయన స్వరాన్ని పెంచేశాయి. మరోవైపు మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ కూడా సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పీడీపీని సమర్థవంతంగా నడపటంలో మెహబూబా దారుణంగా విఫలం అయ్యారు. అంతేకాదు తండ్రి ముఫ్తీ మెహబూబా కలలను కూడా ఆమె నాశనం చేశారు. పైగా ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీని కాస్త ఫ్యామిలీ డెమొక్రటిక్ పార్టీగా మార్చేశారు’ అని మాజీ మంత్రి ఇమ్రాన్ పేర్కొన్నారు. కాసేపటికే మరో ఎమ్మెల్యే మహ్మద్ అబ్బాస్ వానీ కూడా ఇమ్రాన్‌కు మద్ధతు ప్రకటించారు. బీజేపీతో విడిపోవటం.. ప్రభుత్వం కుప్పకూలిపోయి ముఫ్తీ రాజీనామా... మెహబూబా వైఫల్యాలని వారిద్దరూ బహిరంగంగా ప్రకటించారు. మరికొందరు అసంతృప్త నేతలతో కలిసి పీడీపీ, ఎన్సీ(నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమిని వీరు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. (ఆ అలవాటును మానుకోండి: బీజేపీ ఘాటు కౌంటర్) బీజేపీతో టచ్‌లో?... అయితే మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ మాత్రం బీజేపీ అధినాయకత్వానికి టచ్‌లో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ‘ఇమ్రాన్ బీజేపీ చీఫ్ అమిత్ షాతో టచ్‌లో ఉన్నారు. మరికొందరు అసంతృప్త నేతలతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మరోవైపు ఎన్సీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది’ అని ఆ కథనం సారాంశం. అయితే ఇమ్రాన్ మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చారు. కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలటంతో.. ప్రభుత్వం కుప్పకూలి ముఫ్తీ మెహబూబా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. -
కశ్మీర్లో గవర్నర్ పాలన
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఎనిమిదోసారి గవర్నర్ పాలన మొదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయమే జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా విధుల్లోకి దిగారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు గతంలో మాదిరిగానే కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. అలాగే కశ్మీర్లో ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మరోవైపు ఇటీవలే ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన జవాను ఔరంగజేబు కుటుంబాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఔరంగజేబు లాంటి వాళ్లు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తారని ఆమె శ్లాఘించారు. మూడేళ్లకుపైగా కొనసాగిన పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మంగళవారం అనూహ్యంగా బీజేపీ బయటకు రావడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో గవర్నర్ పాలనకు సిఫారసు చేస్తూ జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా మంగళవారమే రాష్ట్రపతి భవన్‌కు నివేదిక పంపారు. అయితే ఆ సమయంలో కోవింద్ విమాన ప్రయాణంలో ఉండటంతో తెల్లవారు జామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆయన సూరినామ్‌లో విమానం దిగగానే అధికారులు గవర్నర్ నివేదికను పరిశీలనకు పంపారు. జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రపతి నుంచి హోం మంత్రిత్వ శాఖకు సమాచారం వచ్చింది. ఆ వెంటనే ఆదేశాలను శ్రీనగర్‌కు పంపగా, రాష్ట్రంలో గవర్నర్ పాలన విధిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంటుందని గవర్నర్ ప్రకటించారు. ‘రాష్ట్రపతి ఆమోదం వచ్చిన వెనువెంటనే.. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ఎన్ఎన్ వోహ్రా ప్రకటించారు’ అని రాజ్‌భవన్ ప్రతినిధి తెలిపారు. ప్రధాన కార్యదర్శితో గవర్నర్ చర్చలు అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) బీబీ వ్యాస్‌తో గవర్నర్ వోహ్రా చర్చలు జరిపారు. ఆ తర్వాత పౌర, పోలీసు, అటవీ తదితర విభాగాల అధికారులతోనూ వోహ్రా భేటీ అయ్యారు. ‘రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం వేగంతో, సమర్థంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చూసేందుకు గవర్నర్ అధికారులతో మాట్లాడారు’ అని రాజ్‌భవన్ ప్రతినిధి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడం గత నాలుగు దశాబ్దాల్లో మొత్తంగా ఇది ఎనిమిదోసారి కాగా, వోహ్రా హయాంలోనే నాలుగోసారి. బేరసారాలకు అవకాశం: ఒమర్ సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. లేకపోతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందనీ, సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కవీందర్ గుప్తా స్వయంగా ఈ విధమైన సంకేతాలిచ్చారని ఒమర్ ఆరోపించారు. గవర్నర్ పాలనపై మిశ్రమ స్పందన కాగా పీడీపీ–బీజేపీ ప్రభుత్వం కూలిపోయినందుకు కశ్మీర్‌లోని శ్రీనగర్, కుప్వారా, పహల్గామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పీడీపీ–బీజేపీల కూటమి అపవిత్రమైనదనీ, బీజేపీతో పీడీపీ కలవకుండా ఉండాల్సిందని పలువురు పేర్కొన్నారు. అయితే గవర్నర్ పాలనలో పారదర్శకత కొరవడుతుందనీ, రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్ పాలన కన్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఎప్పటికైనా మెరుగైన పాలన అందిస్తుందన్నారు. అమర్నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లు అమర్నాథ్ యాత్ర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ జమ్వాల్ నేతృత్వంలో పోలీసులు, పారామిలిటరీ దళాలు, కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి భేటీ జరిగింది. అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండి, అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలనీ, సంఘవిద్రోహ శక్తుల కుట్రలను నీరుగార్చాలని ఈ సమావేశంలో ఐజీ ఆదేశించారు. సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలు, చెక్పాయింట్లలోని సిబ్బంది జాగ్రత్తగా పనిచేస్తూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే వెంటనే వారిని అంతమొందించాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. షాక్‌లో మెహబూబా సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయం.. ఆ నిర్ణయాన్ని తనకు తెలియజేసిన తీరుతో మంగళవారం మాజీ సీఎం (బీజేపీ నిర్ణయంతో మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు) మెహబూబా ముఫ్తీ షాక్‌కు గురయ్యారని పీపుల్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వర్గాలు తెలిపాయి. పలు అంశాల్లో బీజేపీ– పీడీపీల మధ్య విభేదాలున్నా, ఇంత అకస్మాత్తుగా ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం బీజేపీ తీసుకుంటుందని ఆమె ఊహించలేదన్నాయి. ‘ఆమె బీజేపీ మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు’ అని పీడీపీ నేత ఒకరు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలోనూ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంలోనూ కీలకపాత్ర పోషించిన ఆమె అప్పుడు బీజేపీ వ్యతిరేక వైఖరిని బాహాటంగానే చూపేవారు. పీడీపీకి గట్టి పట్టున్న దక్షిణ కశ్మీర్ ప్రాంతం.. బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు పట్టుకోల్పోయిందన్నారు. కశ్మీర్ కొత్త సీఎస్‌గా సుబ్రమణ్యం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. అలాగే ప్రస్తుత సీఎస్ బీబీ వ్యాస్‌తోపాటు ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను గవర్నర్ వోహ్రాకు సలహాదారులుగా కేంద్రం నియమించింది. 1987 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సుబ్రమణ్యంను ఛత్తీస్‌గఢ్‌లో అదనపు ప్రధాన కార్యదర్శి (హోం శాఖ)గా పనిచేస్తుండగా.. ఆయనను జమ్మూ కశ్మీర్‌కు పంపేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ మంగళవారం రాత్రే ఆమోదం తెలిపింది. అంతర్గత భద్రతా విషయాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా సుబ్రమణ్యంకు పేరుంది. 2004–08లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008 జూన్ నుంచి 2011 సెప్టెంబరు వరకు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనంతరం మార్చి 2012లో ప్రధాని కార్యాలయంలో విధుల్లో చేరి 2015 మార్చి వరకు ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్లారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రస్తుత సీఎస్ బీబీ వ్యాస్‌కు గతేడాది నవంబర్లోనే 60 ఏళ్లు నిండాయి. అప్పుడే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా ముఫ్తీ విజ్ఞప్తి మేరకే ఇప్పటికే రెండుసార్లు వ్యాస్‌కు పొడిగింపునిచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్రమణ్యం నియమితులవ్వగా వ్యాస్ గవర్నర్‌కు సలహాదారునిగా ఉంటారు. నక్సల్ వ్యతిరేక నిపుణుడు విజయ్‌కుమార్ జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక వ్యక్తిని గవర్నర్ వోహ్రాకు సలహాదారుగా నియమించింది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పేరుగాంచిన, స్మగ్లర్ వీరప్పన్‌ను అంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన అధికారి కె.విజయ్ కుమార్ వోహ్రాకు సలహాదారుగా నియమితులయ్యారు. 1975 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ (65).. పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ను 2004లో మట్టుబెట్టిన ప్రత్యేక కార్యదళానికి నేతృత్వం వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 2010లో నక్సల్స్ 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన అనంతరం ఆ దళానికి డీజీగా కూడా విజయ్‌కుమార్ పనిచేశారు. మోదీ కశ్మీర్ విధానం సరైనదే: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: ‘మోదీజీ కశ్మీర్ విధానం సరైనదే. దానిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కశ్మీర్ సమస్య ఇప్పటిది కాదు. అనేక ప్రభుత్వాలకు ప్రధాన సవాలుగా నిలిచిన దీన్ని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. అలాగే పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన సీనియర్. పరిపక్వత ఉన్న రాజకీయవేత్త. కానీ మనం తండ్రీ, కుమార్తె(మెహబూబా)ల మధ్య పోలిక తీసుకురాకూడదు. మెహబూబా చేతనైనంత వరకూ చేశారు’ అని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేయడాన్ని పొరపాటుగా తాను భావించడం లేదన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ నిలివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు. రంజాన్లోనూ ఉగ్ర కార్యకలాపాలు: రావత్ రంజాన్ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించారని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. గవర్నర్ పాలన ఉగ్రవాదుల ఏరివేతపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. -
సంకీర్ణానికి బీజేపీ రాం..రాం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ కూటమి పాలన ముగిసింది. ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నామని బీజేపీ ప్రకటించడంతో.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. రంజాన్ సందర్భంగా కశ్మీర్లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణ.. తదనంతర పరిణామాలు మూడేళ్ల పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికే ఎసరుపెట్టాయి. కశ్మీర్లో కాల్పుల విరమణ ఆదివారంతో ముగిసిందని కేంద్ర హోం మంత్రి ప్రకటించగా.. దానిని పొడిగించాలని పీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ, శ్రీనగర్‌లో పరిణామాలు చకచకా మారిపోయాయి. కశ్మీర్ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రుల్ని అత్యవసరంగా ఢిల్లీ రప్పించిన అధిష్టానం.. వారితో చర్చలు కొనసాగించింది. అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ప్రకటన చేస్తూ.. పీడీపీతో పొత్తు నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది గంటలకు జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసిన సీఎం మెహబూబా రాజీనామాను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన తప్పనిసరని పేర్కొంటూ రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక పంపారు. నేడో రేపో గవర్నర్ పాలనపై రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు వెలువరించే అవకాశముంది. రాష్ట్రంలో సంకీర్ణ కూటమిలో కొనసాగడం ఇక సాధ్యం కాదని, గవర్నర్ పాలన తప్పనిసరని రాం మాధవ్ చెప్పగా.. బీజేపీ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పీడీపీ పేర్కొంది. పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వైదొలిగిన నేపథ్యంలో.. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ పాలనే ఉత్తమమని ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గవర్నర్‌కు సూచించారు. ఒకవేళ జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధిస్తే.. 1977 నుంచి ఇది ఎనిమిదోసారి అవుతుంది. 2008 నుంచి నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగింది. 89(ఇద్దరు నామినేటెడ్‌తో కలిపి) సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 స్థానాలు, పీడీపీకి 28, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు ఏడు స్థానాలున్నాయి. డిసెంబర్ 2014లో ఎన్నికలు జరగగా.. మార్చి, 2015లో పీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిజానికి ఆ ఎన్నికల్లో పీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ.. రాష్ట్రంలో హింసకు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఒక్కటయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వ పాలన ప్రారంభం నుంచి ఇరు పార్టీలు అనేక అంశాలపై విభేదించాయి. శాంతి భద్రతల్లో పీడీపీ విఫలం: బీజేపీ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించిన అనంతరం కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నామని రాం మాధవ్ వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో పీడీపీ విఫలమైంది. రాష్ట్రీయ రైఫిల్స్ జవాను ఔరంగజేబు, రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీల హత్య ఘటనలే అందుకు ఉదాహరణ. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. అక్కడి హింసాత్మక పరిస్థితుల్ని అదుపు చేయడమే లక్ష్యంగా అధికారాల్ని గవర్నర్‌కు అప్పగించాలని మేం నిర్ణయించాం’ అని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు పెరిగిపోయాయని, జీవించే హక్కు, వాక్స్వాతంత్య్రం మొదలైన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ లోయలో ప్రశాంతత, అభివృద్ధి కోసం కేంద్రం సాధ్యమైనదంతా చేసింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు ప్రయత్నించాం. అయితే పీడీపీ తన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమైంది. జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల విషయంలో బీజేపీ నేతలు పీడీపీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీడీపీ ఉద్దేశాల్ని మేం ప్రశ్నించడం లేదు. అయితే కశ్మీర్లో పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో వారు విఫలమయ్యారు’ అని రాం మాధవ్ పేర్కొన్నారు. సంకీర్ణ సర్కారులోని బీజేపీ మంత్రులు గవర్నర్‌తో పాటు, సీఎంకు తమ రాజీనామాల్ని సమర్పించారని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కవిందర్ గుప్తా వెల్లడించారు. చర్చలతోనే పరిష్కారం: మెహబూబా బలప్రయోగంతో కూడిన భద్రత రాష్ట్రంలో ఫలితం ఇవ్వదని, చర్చలే పరిష్కారమని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. రాజీనామా సమర్పించాక తన నివాసంలో పార్టీ మంత్రులు, కార్యకర్తలతో ఆమె చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం బీజేపీతో జట్టుకట్టలేదు. ప్రజల కోసమే పనిచేశాం. ఇక ఏ పార్టీతోను పీడీపీ పొత్తు పెట్టుకోదని గవర్నర్‌కు స్పష్టం చేశాను’ అని చెప్పారు. పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్ ప్రజలతో చర్చలు జరపాలన్న పీడీపీ ఎజెండాకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. చేసిందంతా చేసి...: కాంగ్రెస్ పీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రాన్ని పీడీపీ–బీజేపీ కూటమి నాశనం చేసిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ విమర్శించారు. ‘ఈ మూడేళ్లలో కశ్మీర్‌ను ఎంత వీలైతే అంత బీజేపీ నాశనం చేసి ఇప్పుడు పక్కకు తప్పుకుంది. గత మూడేళ్లలో 373 మంది జవాన్లు, 239 పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆయన చెప్పారు. పీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ భారీ తప్పిదానికి పాల్పడిందని నాడే రాజ్యసభలో ప్రధా ని మోదీని హెచ్చరించానని గుర్తు చేశారు. మరో ప్రత్యామ్నాయం లేదు: ఒమర్ ‘2014 ఎన్నికల్లో ఎన్సీకి మెజార్టీ దక్కలేదు. అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలం మాకు లేదని గవర్నర్‌కు చెప్పాను. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు చేయడం లేదనీ స్పష్టం చేశాను. ఏ పార్టీకి మెజార్టీ లేనందున గవర్నర్ పాలన విధించడం మినహా ప్రత్యామ్నాయం లేదని కూడా వివరించాను’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్రపతికి నివేదిక జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ నివేదిక పంపారు. రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ పాలనకు వోహ్రా సిఫారసు చేశారు. మెహబూబా ముఫ్తీతోపాటు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు జీఏ మిర్లతో వోహ్రా మాట్లాడారు. తగినంత సంఖ్యాబలం లేని కారణంగా ఎవ్వరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. అనూహ్యం.. ఆశ్చర్యకరం! శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రయాణం అర్ధాంతరంగా, ఆకస్మికంగా ముగిసింది. మంగళవారం ఉదయం కూడా ఆమె సాధారణంగా విధులకు హాజరై తన కార్యాలయంలో పనులు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం గవర్నర్ నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్ పరిస్థితిని తారుమారు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. ఆ వెంటనే బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా గవర్నర్ వోహ్రాకు లేఖ రాస్తూ తాము పీడీపీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ మంత్రుల రాజీనామా లేఖలను కూడా గవర్నర్‌కు పంపారు. ఆ తర్వాత గవర్నర్ జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీబీ వ్యాస్‌కు ఫోన్ చేసి, ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ తర్వాత బీజేపీ నిర్ణయాన్ని గవర్నర్ ముఫ్తీకి తెలియజేయడంతో తాను రాజీనామా చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయంపై బీజేపీ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ఆమె గవర్నర్‌తో అన్నారు. బీజేపీ–పీడీపీ కూటమి పాలన ♦ 2014 డిసెంబర్ 28: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్. మొత్తం 87 స్థానాలకు గాను పీడీపీకి 28, బీజేపీకి 25 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. ♦ డిసెంబర్ 28: రాష్ట్రంలో గవర్నర్ పాలన విధిస్తూ కేంద్రం ప్రకటన ♦ 2015 మార్చి 1: బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ♦ 2016 జనవరి 7: ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అనారోగ్యంతో మృతి. ♦ 2016 జనవరి 8: రాష్ట్రంలో మరోసారి గవర్నర్ పాలన విధింపు. ♦ 2016 ఏప్రిల్ 4: మొదటి మహిళా సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం. ♦ 2016 ఏప్రిల్ 5: భారత్– పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాష్ట్ర, రాష్ట్రేతర విద్యార్థుల మధ్య గొడవ. ♦ 2016 జూలై 8: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతి. ఈ ఘటనపై ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో పీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు ప్రారంభం. ♦ 2018 మే 9: ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రజాందోళనల సందర్భంగా పోలీసు కాల్పుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవటంపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన సీఎం మెహబూబా. సమావేశం అనంతరం రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం. వ్యతిరేకించిన డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా. ♦ మే 17: రంజాన్‌ను పురస్కరించుకుని నెల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం ♦ జూన్ 17: కాల్పుల విరమణను పొడిగించబోమని కేంద్రం ప్రకటన. ♦ జూన్ 18: రాష్ట్ర కేబినెట్లోని బీజేపీ మంత్రు లంతా ఢిల్లీకి రావాలన్న పార్టీ అధిష్టానం. ♦ జూన్19: సంకీర్ణం నుంచి వైదొలగిన బీజేపీ. -
కుప్పకూలిన సంకీర్ణం
జమ్మూ–కశ్మీర్లో ఆదినుంచీ ఒడిదుడుకులతో నెట్టుకొస్తున్న పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి మంగళవారం కుప్పకూలింది. కూటమినుంచి తప్పుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించ డంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా సమర్పించారు. ఇది హఠాత్ పరిణామమే కానీ...అనూహ్యమైనదేమీ కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలూ భిన్న ధ్రువాలు. 2014 నవంబర్–డిసెంబర్ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. 87 స్థానాలున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 44 స్థానాలు కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో పీడీపీ 28 స్థానాలు గెల్చుకోగా, హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. అంతవరకూ పాలకపక్షంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అనిశ్చితిలో పీడీపీ, బీజేపీలు సుదీర్ఘంగా మంతనాలు సాగించి ‘కనీస ఉమ్మడి అజెండా’ను రూపొందించుకుని ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దురదృష్టవశాత్తూ ముఫ్తీ ఏడాది గడవకుండానే కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ రెండున్నర నెలలపాటు అనిశ్చితే రాజ్యమేలింది. మళ్లీ చర్చోపచర్చలు జరిగాయి. చివరకు పాత అజెండాతోనే ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులున్న జమ్మూ–కశ్మీర్ దశాబ్దాలుగా మిలిటెన్సీతో అట్టుడుకు తోంది. కనుకనే అక్కడ అత్యంత మెలకువతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణం గానే కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడం రివాజు. పీడీపీ, బీజేపీలు భిన్న ధ్రువాలు గనుక అది సాధ్యపడదేమోనని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ ఆ పార్టీలు తలకిందులు చేసి సన్నిహితమయ్యాయి. జమ్మూ–కశ్మీర్ సమస్యకు జాతీయ పరిష్కారం కోరే దిశగా తమ అజెండాను రూపొందించుకున్నా మని రెండు పార్టీలూ చెప్పడం చాలామందికి నచ్చింది. కశ్మీర్ విషయంలో బీజేపీ అభిప్రాయాలు అందరికీ తెలుసు. అయితే 2014 ఎన్నికల్లో 370 అధికరణం అంశాన్ని ఆ పార్టీ పక్కన పెట్టింది. ఇతర అంశాల్లో సైతం తన వైఖరిని సడలించుకోబట్టే అది పీడీపీతో జత కట్టిందని అనేకులు భావిం చారు. అటు జమ్మూ, ఇటు కశ్మీర్ మత ప్రాతిపదికన చీలినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఇది శుభ పరిణామని వారు విశ్వసించారు. ఇరు పార్టీలూ ప్రత్యర్థులుగా ఉండటం మంచిదికాదని వారి భావన. కానీ పీడీపీ, బీజేపీలు తాము కూటమిగా ఉన్నామని,మంచి పాలన అందించాలని మరిచినట్టు గత రెండేళ్ల పరిణామాలు రుజువుచేశాయి. కశ్మీర్ సమస్యను ఆదినుంచీ బీజేపీ శాంతిభద్రతల సమస్యగానే చూస్తోంది. అక్కడ రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలం కావడం వల్లనే ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్న వాదననను ఆ పార్టీ అంగీకరించదు. ఆ సమస్య విషయంలో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం గత అక్టోబర్‌లో అందుకోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా పనిచేసి రిటైరైన దినేశ్వర్ శర్మను మధ్యవర్తిగా ప్రకటించడం ఈ అవగాహన పర్యవసానమే. అంతక్రితం పలుమార్లు మధ్యవర్తుల రాయబారాలు నడిచాయి. వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకసారి కేంద్ర మాజీ మంత్రి కేసీ పంత్‌నూ, మరోసారి ప్రస్తుత గవర్నర్ ఎన్. ఎన్. వోహ్రాను నియమించింది. యూపీఏ సర్కారు ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులతో మధ్యవర్తుల కమిటీ నియమించింది. ఆ ప్రభుత్వాలు మధ్యవర్తులిచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నాయన్న సంగతలా ఉంచితే కనీసం మాజీ పోలీస్ అధికారులను ఆ పని కోసం నియమించలేదు. దినేశ్వర్ శర్మ ఏం సాధించారో తెలియదుగానీ అప్పటికీ, ఇప్పటికీ కశ్మీర్ పరిస్థితి అయితే దారుణంగా క్షీణించింది. కనీస ఉమ్మడి అజెండాలోని 15 అంశాలనూ సమర్ధవంతంగా అమలు చేసి ఉంటే కశ్మీర్ పరిస్థితి ఇంత దిగజారేది కాదు. యువకుల్లో నైపుణ్యాభివృద్ధి, సిద్ధాంతాలు ఎలాంటివైనా అన్ని పక్షాలతో చర్చించడం, అకౌం టబిలిటీ కమిషన్ ఏర్పాటు, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వర్తింపుపై సమీక్ష, వాజపేయి నినాదమైన ఇన్సానియత్(మానవత్వం), జమ్రూహియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్(కశ్మీరీ సంస్కృతి, సంప్రదాయం)ల అమలు వగైరాలు ఆ అజెండాలోని ముఖ్యాంశాలు. కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు ప్రారంభించడం, హుర్రియత్ నేతలతోసహా కశ్మీర్‌లోని సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడటం వంటి అంశాల్లో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు న్నాయి. భద్రతా దళాలకూ, ఉద్యమకారులకూ మధ్య తరచుగా తలెత్తే ఘర్షణల్లో మెహబూబా వైఖరికీ, బీజేపీ వైఖరికీ పొంతనే లేదు. మొన్నటికి మొన్న కథువాలో ఎనిమిదేళ్ల పాప అసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య విషయంలోనూ ఇరు పార్టీలూ వేర్వేరు వాదనలు చేశాయి. ఎన్నో ఒత్తిళ్ల తర్వాతగానీ ఆ కేసు నిందితులకు వత్తాసు పలికిన బీజేపీ మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోలేదు. ఇక రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని మెహ బూబా ఒత్తిడి తెస్తే తొలుత కేంద్రం ససేమిరా అంది. చివరకు అయిష్టంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేయించింది. కానీ దానివల్ల ఆశించిన ఫలితం రాలేదు సరిగదా ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ప్రముఖ పాత్రి కేయుడు సుజాత్ బుఖారీని కాల్చిచంపారు. జవాన్ ఔరంగజేబును చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. కూటమిలో కొనసాగడం వల్ల ఇలాంటి చర్యలన్నిటికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితిలో పడ్డామని బీజేపీకి బెంగపట్టుకున్నట్టుంది. కానీ ఇకపై అన్నిటికీ తామే జవాబుదారీ అవుతామని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి. కశ్మీర్ విషయంలో మరింత జాగురూకతతో మెలగాలని, దాన్ని మరింత విషాదం చుట్టుముట్టకుండా చూడాలని అందరూ కోరుకుంటారు. -
విఫలమైన మోదీ కశ్మీర్ పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పాలసీ పూర్తిగా విఫలమైంది. పీడీపీతో పొత్తు పెట్టుకుని కశ్మీర్‌పై మరింత పట్టు సాధిద్దామనుకున్న మోదీ ప్రయత్నం విఫలమైంది. నేటితో గత మూడేళ్లుగా కశ్మీర్‌ని పరిపాలిస్తున్న పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. సయ్యద్ ముఫ్తీ మహ్మద్ మరణాంతరం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మెహబూబా ముఫ్తీ తన తండ్రి కంటే మరిన్ని విపత్కర పరిస్థితులను కశ్శీర్‌లో ఎదుర్కొన్నారు. హిస్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో కశ్మీర్లో మొదలైన హింస నేటికీ ఆగలేదు. బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేయడంతో లోయలో మిలిటెంట్స్ చర్యలు మరింత పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ దాడులు కశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి ఏమాత్రం పనిచేయలేదు. సర్జికల్ దాడులు సరిహద్దు వెంట మరిన్ని దాడులకు కారణమయ్యాయి. రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్లో మిలిటెంట్స్ మరింత రెచ్చిపోయారు. ముస్లింల పవిత్ర మాసంలో కశ్శీర్ యువకులను మిలిటెంట్ దళాల్లోకి తీసుకుని వారిని తీవ్రవాదులుగా తయారుచేశారు. వారి చర్యలకు అనేక మంది అమాయక కశ్మీర్ ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నా.. దాడులను నివారించడంతో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీనియర్ పాత్రికేయుడు సుజాత్ బుఖారిని తన కార్యాలయంలో దుండుగులు దారుణంగా హత్యచేయడంతో కశ్మీర్లో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో ఇట్టే అర్ధమవుతోంది. పాక్‌తో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారం అవుతాయని మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్‌తో ఎప్పుడు యుద్ధ వాతావరణమే కొనసాగించిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశాగా ఎప్పుడు అడుగులు వేయలేదు. లోయలో సమస్యకు పరిష్కారం చూపడం కష్టంగా భావించిన మోదీ-అమిత్ షా ద్వయం చివరికి పీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వంలో శాంతి నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. కె.రామచంద్ర మూర్తి -
బీజేపీకి మెహబూబా ముఫ్తీ ఘాటు కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగిన బీజేపీకి పీడీపీ చీఫ్, సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్‌ను శత్రుస్థావరంగా చూసే అలవాటును మానుకోవాలని హితవుపలికారు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున, వారి ద్వారానైనా కశ్మీర్‌కు న్యాయం దక్కుతుందన్న ఆశతోనే బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకుందే తప్ప అధికారం కోసం కానేకాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాకు కావలసింది సాధించుకున్నాం: బీజేపీతో మేమేమీ ఊరికే పొత్తు పెట్టుకోలేదు. 370వ అధికరణ కొనసాగింపు (జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి), ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు, యువకులపై కేసుల ఎత్తివేత, పాకిస్తాన్ సహా ఇక్కడి అన్ని వర్గాలతో చర్చలు జరపడం... అనే అంశాల ప్రాతిపదికన మేము వారితో(బీజేపీతో) కలిశాం. ఈ మూడేళ్లలో 370వ అధికరణకు సంబంధించి వివాదాలు రాలేదు... ప్రధాని మోదీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధానిని కలిసి వచ్చారు... 12వేల మంది యువకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాం... అన్ని వర్గాలతో చర్చలు కొనసాగుతాయని కేంద్రం ప్రకటించేలా చేయగలిగాం... ఇలా సంకీర్ణ ప్రభుత్వంలో మాకు కావలసినవి మేం సాధించుకున్నాం. రాజకీయంగా నష్టపోయినా భరించాం: బీజేపీతో పొత్తు వల్ల పీడీపీ నష్టపోయినమాట నిజం. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినాసరే, రాస్ట్ర సంక్షేమం కోసం మాత్రమే బీజేపీని భరించాం. ఇవాళ వారు పొత్తును తెంచుకోవడం మాకేమీ శరాఘాతం కాదు. మేం పొమ్మనలేదు. వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారు. మా వైపు నుంచి తప్పేమీ లేదు. కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలు జరిగేలా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలన్నది మా రెండో ప్రధాన డిమాండ్..’’ అని మెహబూబా ముఫ్తీ అన్నారు. సీఎం పదవికి రాజీనామా: సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలడంతో మెహబూబా ముఫ్తీ తన సీఎం పీఠానికి రాజీనామా ప్రకటించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపానని, కశ్మీర్లో శాంతి, సుస్థిరతల కోసం పీడీపీ ఎప్పటికీ పాటుపడుతుందని ఆమె చెప్పారు. -
కశ్మీర్ వినాశనంలో బీజేపీ పాత్ర లేదా!
సాక్షి, హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో జరుగుతోన్న వినాశనంలో తన పాత్రేమీ లేనట్లు బీజేపీ బొంకడం విడ్డూరంగా ఉందని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీమాంతర ఉగ్రవాదం పేట్రేగిపోవడం, ఆర్మీ క్యాంపులపై వరుసగా దాడులు, షుజీత్ బుఖారీ లాంటివాళ్ల హత్యలు, స్కూళ్లు, కాలేజీల మూసివేత... తదితర పరిణామాలకు సంబంధించి పీడీపీ కంటే బీజేపీనే ప్రధాన ముద్దాయి అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంపై మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: బీజేపీ బ్రేకప్.. సీఎం రాజీనామా!) ముఫ్తీని నిందిస్తే బీజేపీ తప్పులు మాసిపోతాయా?: ‘‘పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని వ్యవహారాలకు మంత్రివర్గానిదే బాధ్యత అన్న కనీస సూత్రాన్ని బీజేపీ మర్చిపోయినట్లుంది. మెహబూబా కేబినెట్లో బీజేపీ డిప్యూటీ సీఎం సహా, మంత్రులు కూడా ఉన్నారుగా! గత మూడేళ్లుగా కశ్మీర్లో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీ బాధ్యురాలే. ఇప్పుడు సడన్‌గా పీడీపీతో పొత్తుతెంచుకుని, ముఫ్తీని నిందించినంత మాత్రాన బీజేపీ గొప్పదైపోదు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం ప్రారంభమైంది కాబట్టే, కాషాయనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. (చూడండి: ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!) కశ్మీర్ నడిచేది కేంద్రం ఆదేశాలతో కాదా?: పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలిగినందుకు బీజేపీ చెబుతున్న కారణాలేవీ సహేతుకంగాలేవు. కాల్పుల విరమణ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం నియంత్రణ కేంద్రం చేతుల్లోనే కదా ఉన్నది! మరి వీళ్లు(బీజేపీ) ముఫ్తీని మాత్రమే నిందించడంలో అర్థం ఉందా? బీజేపీ ఘోర తప్పిదాలు చేసి, ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది. ముఫ్తీకి చెంపపెట్టు: బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగింది. ఇవాళ్టి పరిణామం ఖచ్చితంగా ఆమెకు చెంపపెట్టులాంటింది. ఇక కశ్మీర్ లోయలో పీడీపీకి భవిష్యత్తులేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే ఎవరికైనా ఇది గుణపాఠం అవుంది. కొద్ది మంది అనుకుంటున్నట్లు 2019 ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లైతే నాదొక సవాల్.. రాంమాధవ్‌కు దమ్ముంటే శ్రీనగర్ నుంచి పోటీకి దిగాలి. జమ్ముకశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్నవన్నీ తప్పుడు నిర్ణయాలే’’ అని అసదుద్దీన్ అన్నారు. -
ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అంతా నాశనం చేశాక జమ్మూ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందంటూ కేజ్రీవాల్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ బీజేపీని ప్రశ్నించారు. నోట్లరద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కశ్మీర్లో ఉగ్రవాదుల వెన్ను విరిచామని చెప్పారని.. కాగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమైందంటూ ట్విటర్లో ప్రశ్నించారు. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్.. బీజేపీ నిర్ణయాన్ని, వారి విధానాలను తప్పుపట్టారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. పీడీపీతో కటీఫ్ చెప్పాక.. బీజేపీ కశ్మీర్ ఇన్ఛార్జ్ రాం మాధవ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. గవర్నర్ పాలనతోనే యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కొనసాగుతాయని రాం మాదవ్ పేర్కొన్నారు. Didn’t BJP tell us that demonetisation had broken the back of terrorism in Kashmir? Then what happened? https://t.co/S9nyOMocKl — Arvind Kejriwal (@ArvindKejriwal) 19 June 2018 -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు. ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు. రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి. ఈ ఏడాదే విచ్చలవిడిగా.. సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు 2015 287 2016 271 2017 860 2018(మే చివరి నాటికి) 1252 -
చిన్నారుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక...
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అల్లరి మూకలు మానవత్వాన్ని మరిచి ఎంతగా రెచ్చిపోతున్నాయో బుధవారం చిన్నారుల స్కూలు వ్యాన్ మీద జరిపిన రాళ్లదాడి చూస్తేనే అర్థం అవుతుంది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే అల్లరిమూకలు దాడి చేసిన సమయంలో ఎటువంటి ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతో బస్సు డ్రైవరు తన ప్రాణాలొడ్డి తీవ్రంగా శ్రమించాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి బస్సు డ్రైవరు. ఈ సంఘటన గురించి అతడు చెబుతూ.. ‘అల్లరిమూక బస్సుపై రాళ్ల దాడి ప్రారంభించగానే నేను బస్సు వేగాన్ని పెంచాను. ఒక్క చిన్నారికి కూడా హాని కలగకూడదని నా శాయశక్తుల శ్రమించాను. కానీ ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి’ అని తెలిపాడు. బుధవారం షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై అల్లరి మూకలు దాడి చేసిన సంగతి విధితమే. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ‘పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని’ హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. -
జమ్మూకశ్మీర్ లో స్కూల్ బస్సుపై రాళ్ల దాడి..
శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రోజురోజూకి రెచ్చిపోతున్నారు. ఏదో ఒక నెపంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని స్కూలు చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. కాగా ఒక్కసారిగా రాళ్లదాడి జరగడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై దాడి జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని అన్నారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు. మరోవైపు ఈ ఘటనను ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ, ప్రతిపక్షనేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ హామీ ఇచ్చారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి -
కీలుబొమ్మగా మారిన మెహబూబా ముఫ్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందీ మాతో చేయి చేయి కలుపుతారని. కశ్మీర్లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఎక్కడో మిలిటెంట్లకు, ప్రభుత్వ సైనికులకు మధ్య కాల్పులు జరుగుతాయి. అంతే, టీవీ ఛానళ్లలో కశ్మీర్ మొత్తం తగులబడి పోతున్నట్లు చూపిస్తారు. మనమున్న పరిస్థితిని దాచేందుకు ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడండి! ప్రతి చోటా ఏదో సమస్య ఉంటోంది. ఇక్కడ మన సమస్య ఏమిటంటే మన దేశమే మనల్ని ఒంటరి వాళ్లను చేసింది. నేను పిలవగానే మీరు రావడం ముందుగానే వసంత గాలులు వీస్తున్నట్లు ఉంది. ఇది శుభసూచకం. ఇక్కడ మనం చేయాల్సిన పని క్లిష్టమైనదే. మా తండ్రి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. కశ్మీర్‌కు ఓ పర్యాటకుడు రావడం అంటే ఇక్కడ శాంతి కోసం పెట్టుబడి పెట్టడమేనని. భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నట్లే ఇక్కడ కూడా సైనికులు మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు మరోరకంగా మనమూ యుద్ధం చేయాల్సిందే. పర్యాటకరంగం పరిఢవిల్లేలా చేయడమే ఆ యుద్ధం. మనం దేశం నుంచి విడిపోయిన్లు భావించరాదు. అతి పెద్ద దేశంలో భాగంగానే బతుకుతున్నామన్న భావన కలగాలి’ అంటూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల శ్రీనగరంలో జరిగిన భారత పర్యాటక ఏజెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయడం ద్వారా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆమె అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఆమె తన ఉపన్యాసాన్ని కాస్త గంభీర్యంగానే ప్రారంభించినా ఆమె మాటల్లో ఆర్ద్రత, ఆవేదనతోపాటు అశక్తత కూడా కనిపించింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పర్యాటకులు రావడం అంటే రాష్ట్రంలో శాంతి స్థాపనకు అది పెట్టుబడే అని ఎప్పుడూ చెప్పేవారు. అయితే ఆయన శాంతికి భంగం కలిగిస్తున్న వారిని ఎప్పుడూ మిలిటెంట్లు అని అనలేదు. వారిని తిరుగుబాటుదారులుగానే వ్యవహరించారు. గతంలో మొహబూబా ముఫ్తీ కూడా తిరుగుబాటుదారుల సమస్య అనే మిలిటెన్సీని వ్యవహరించారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె భాష మారినట్లు ఉంది. ఆమె పర్యాటక ఏజెంట్ల సమ్మేళనాన్ని నిర్వహించి ‘ఇయర్ ఆఫ్ విజిటింగ్ కశ్మీర్’గా నిర్ణయించిన రెండు రోజులకే ఎదురు కాల్పుల్లో పౌరులు సహా 20 మంది మిలిటెంట్లు, సైనికులు మరణించారు. 2016, జూలైలో జరిగిన అల్లర్లలో దాదాపు వంద మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయి. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ హత్యతో ఆ అల్లర్లు చెలరేగాయి. అంతకుముందు మిలిటెంట్ కార్యకలాపాలకు అంతగా ప్రజల మద్దతు ఉండేది కాదని, 2016 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడంతోపాటు మిలిటెంట్ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కశ్మీర్ యూనివర్శిటీలో పనిచేస్తున్న పొలిటికల్స్ సైన్స్ ప్రొఫెసర్ తెలిపారు. రోజుకో ఏదోచోట కాల్పులు జరిగి పౌరులు కూడా మరణిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ‘మోదీ నుంచి మెహబూబా వరకు అందరూ బాధ్యులే’ అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం ఆరుశాతం ఓట్లు నమోదయ్యాయంటే ఎన్నికల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో తెలుస్తోంది. మెహబూబా తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటుకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం, గతేడాదే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి నేటికి నిర్వహించక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ప్రజలకు కనిపించేవి. ఇప్పుడు వాటి ఉనికిని కూడా ప్రజలు గుర్తించడం లేదు. అందుకని మిలెటెన్సీ పెరుగుతోంది. మెహబూబా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆమె పట్లప్రజలకు సగం నమ్మకం పోయింది. సరైన పాలన అందించడంలో విఫలమైనందున ఆమె పట్ల పూర్తి విశ్వాసం పోయింది. కతువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను సైనికులు దారణంగా రేప్‌చేసి హత్య చేసిన కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలో తన కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం పట్ల మెహబూబా మౌనం వహిచండం ఆమె మద్దతుదారులు కూడా సహించలేకపోతున్నారు. ఇక ఆఖరి కశ్మీర్ నిరంకుశ రాజు హరీ సింగ్ విగ్రహాన్ని ఆమె ఇటీవల ఆవిష్కరించడాన్ని వారు అంతకన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రోద్బలంతో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె నేడు సీఎం కుర్చీలో కూర్చున్న కీలుబొమ్మ మాత్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘మోదీకి భారీ మెజారిటీ వస్తే.. ఆర్టికల్ 370 రద్దు’
సాక్షి, శ్రీనగర్ : ఆర్టికల్ 370.. వివాదం మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక.. చాలా వివాదాస్పద అంశాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. తాజాగా ఆర్టికల్ 370పై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని కొనసాగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్ ప్రజలకు కల్పించిన ప్రత్యేక గౌరవమని.. దీనిని భారత ప్రభుత్వం కొనసాగించాలని ఆమె చెప్పారు. చర్చలు, పరస్పర విరుద్ధ భావాలే ప్రజాస్వామ్యానికి ఆయుపుపట్టు అని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2019 ఎన్నికల్లో అనూహ్యమైన, ఆశ్చర్యకర మెజారిటీ లభిస్తే.. జమ్మూకశ్మీర్ చరిత్రను, ఆర్టికల్ 370ని సమూలంగా మార్చే అవకాశముందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని జమ్మూ కశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గుప్త రెండు రోజుల కిందట డిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మొహబూబాబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. -
ఆ కుటుంబాలను లక్ష్యంగా చేసుకోకండి
సాక్షి, శ్రీనగర్ : ఉగ్రవాదుల ఇళ్లను, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవద్దని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భద్రతాదళాలను ఆదేశించారు. పీడీపీ మాజీ సర్పంచ్‌ను మిలిటెంట్లు మత్య చేయడంతో.. భద్రతా బలగాలు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సీఎం మెహబూబాబ ముఫ్తీ.. మానిగామ్ పోలిస్ ట్రైనింగ్ స్కూల్ పాసింగ్ పెరేడ్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఉగ్రవాదులు.. భద్రతా బలగాలను చంపి.. వారి ఇళ్లను తగలబెట్టిన ఘటనలు ఈ మధ్య అక్కడక్కడా జరిగాయి. ఇదే విధంగా భద్రతా బలగాలు సైతం.. వ్యవహరిస్తే.. మనకు వారికి తేడా ఏముంటుంది అని అన్నారు. గత వారం షోపియాన్ ప్రాంతంలోని ఉగ్రవాదుల ఇళ్లలో భద్రతా బలగాలు సోదాలు జరిపాయి. సోదాల అనంతరం కొందరు ఉగ్రవాదులు.. అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫెరెన్స్ నేతలను బెదిరించినట్లుతెలిసింది. ఇటువంటివ ఇమరోసారి జరిగితే.. మా టార్గెట్ మీరు అవుతారని ఉగ్రవాదులు.. నేతలను హెచ్చరించినట్లు తెలిసింది. -
కశ్మీర్‌ను పీడిస్తున్న భూతం ఏమిటో?
శ్రీనగర్: ఇంతకాలం మిలిటెన్సీతోని అతలాకుతలం అవుతూ వస్తున్న జమ్మూ కశ్మీర్‌ను ఇప్పుడు సరికొత్త భూతం వేధిస్తోంది. గుర్తుతెలియని శక్తులేవో అర్థరాత్రి ఆడ పిల్లల జుత్తును కత్తిరిస్తున్న సంఘటనలు రాష్ట్ర ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇది భూత, ప్రేత, పిశాచాల పనేమోనని కొంత మంది ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఇదంతా భద్రతా దళాల పన్నాగమని మిలిటెంట్లు, ప్రజల్లో అలజడి సష్టించేందుకు మిలిటెంట్లు చేస్తున్న తతంగమని భద్రతా దళాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒకవిధమైన మానసిక రుగ్మత కారణంగా ఆడ పిల్లలే తమ జుట్లను కత్తిరించుకుంటున్నారన్నది వైద్యుల భావన. ఏదేమైనా ఢిల్లీ పరిసర ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళన ఇప్పుడు కశ్మీర్ ప్రజలను పీడిస్తోంది. ఢిల్లీ, పరిసర యూపీ, హర్యానా రాష్ట్రాల్లో ఆడపిల్లల జుట్లను కత్తిరించే సంఘటనలు గత జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా జరగ్గా, గత సెప్టెంబర్ నెల నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతాలకు పాకాయి. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు కశ్మీర్లో 35, జమ్మూలో 192 నమోదయ్యాయి. అర్థరాత్రి ప్రజల ఆశ్రయం కోరే తమను ప్రజల వద్దకు రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో, తమ పట్ల భేద భావం కలిగించాలనే లక్ష్యంతో సైనిక దళాలే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నాయని హిజుబుల్ ముజాహిద్దీన్ ఫీల్డ్ ఆపరేషన్ కమాండర్ రియాజ్ నైకూ సోమవారం విడుదల చేసిన ఓ ఆడియో టేప్‌లో ఆరోపించారు. ఆడపిల్లలు ముస్లిం దుస్తులు ధరించి పడుకుంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉండదని ఆయన సూచించారు. అవసరమైతే ఆడపిల్లల రక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదంతా భద్రతా దళాలు, ఆరెస్సెస్ శక్తులు కలిసి చేసిన కుట్ర కారణంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ ఆరోపించారు. మొన్న కుల్గామ్‌లో జుత్తు కత్తిరించిన యువకుడిని ప్రజలు పట్టుకున్నప్పుడు అతను తప్పించుకునేందుకు వీలుగా భద్రతా దళాలు ఎందుకు కాల్పులు జరిపాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళలపై ఇలాంటి దాడులు జరిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. వదంతులు, కుహనాశక్తుల కుట్రలు, కుతంత్రాలను ఇట్టే నమ్మే కశ్మీర్ ప్రజలు అమాయకులైన అనుమానితులపై దాడులు జరుపుతున్నారు. ఇంటి పరిసరాల్లో, వీధుల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా ఆడ పిల్లల జుత్తు కత్తిరించడానికి వచ్చాడన్న అనుమానంతో నిర్బంధించి చితక బాదుతున్నారు. బారముల్లాలో మంగళవారం ఓ యువకుడిని ఇదే కారణంగా పట్టుకొని చితక్కొట్టారు. భద్రతా దళాలు జోక్యం చేసుకొని ఆ యువకుడిని విడిపించడం కోసం గాలిలోకి భాష్పవాయువు గోళాలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఆ యువకుడి విచారించగా తాను ప్రేమిస్తున్న ఓ యువతిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ఇంటివారే ఈ యువకుడంటే ఇష్టంలేక కొట్టించారా, లేదా అన్న అంశం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రజలు పట్టుకుని చితకబాదిన దాదాపు పది మంది యువకులు అమాయకులేనని తేలింది. ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి సంఘటలనలకు ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారవడం, ఆర్థికంగా వెనకబడి, అనారోగ్యంతో బాధ పడుతున్న కుటుంబాలకు చెందిన వారవడం ఇక్కడ గమనార్హమని వారంటున్నారు. మాస్ హిస్టీరియా లోనవడం వల్ల కూడా బాధితులు తమ జుట్టును తమకు తెలియకుండానే కత్తిరించుకుంటారని వారంటున్నారు. కుటుంబం, ఇరుగు పొరుగు కలహాల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రతి జిల్లాకు ఓ పత్యేక పోలీసు బందాన్ని ఏర్పాటు చేసి దోషులను పట్టుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదేశించారు. -
'మోదీ గొప్పే.. కానీ నాకు ఇందిరానే ఇండియా'
న్యూఢిల్లీ: ఒకపక్క ప్రధాని నరేంద్రమోదీని కొనియాడుతూనే జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అంతకుమించి ఇందిరాగాంధీని కొనియాడారు. తనకు సంబంధించి భారత్ అంటే ఇందిరా అని సంచలన వ్యాఖ్యాల చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కశ్మీర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఫ్తీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ను భారత్‌ను వేరు చేసి ఓ టెలివిజన్ చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 'టీవీ చానెల్లో భారతదేశ చిత్రపటంగా దేన్నయితే చూపించిందో అది నాకు తెలిసిన భారత్ కాదు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి. భారత్, కశ్మీర్ వేరు కాదు' అని ఆమె అన్నారు. భారత్‌లో ముస్లింలకు, హిందువులకు మధ్య ఎలాంటి భేదాలు ఉండవని, కలిసి ప్రార్థనలు చేసే సంప్రదాయం కూడా భారత్ సొంతం అన్నారు. 'నావరకు భారత్ అంటే ఇందిరాగాంధీ. నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు ఆమె ఆమె నాకు భారత్‌ను బహుకరించింది. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఆమె అంటే భారతదేశం. నేను మళ్లీ అలాంటి భారత్‌ను చూడాలని అనుకుంటున్నాను. కశ్మీర్ బాధను, కష్టాన్ని, ఏడ్పును తనదిగా భావించే భారత్ నేను మళ్లీ చూడాలని అనుకుంటున్నాను. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటం మూలం భారత్‌కు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మనది భిన్న సమాజం. ఇక్కడ భిన్న సంస్కృతులు ఉన్నాయి. కశ్మీర్ అంటే భారత్‌లోనే ఒక మినీ ఇండియా' అని ఆమె భావోద్వేగంతో చెప్పారు. -
విదేశీ జోక్యంతో కశ్మీర్లో కల్లోలమే: ముఫ్తీ
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి విదేశీ మధ్యవర్తిత్వం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, అమెరికా లాంటి విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటే కశ్మీర్ మరో సిరియా, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లా మారుతుందని హెచ్చరించారు. విదేశీ జోక్యం కోరుతున్న ఫరూక్‌కు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అని ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఇరాక్‌లోని పరిస్థితులను కశ్మీర్లో ఫరూక్ కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. అమెరికా, చైనాలు తమ అంతర్గత విషయాలపై దృష్టి సారిస్తే మంచిదని ముఫ్తీ అన్నారు.