ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు.
ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा.
— Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023
ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT
बाला साहेब की भाषा में कहें तो
'लालू के… pic.twitter.com/a85OzVCi70
ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..
Comments
Please login to add a commentAdd a comment