Uddhav thackeray
-
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్‌ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్‌లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा. ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT बाला साहेब की भाषा में कहें तो 'लालू के… pic.twitter.com/a85OzVCi70 — Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
‘ఇదే అసలైన పార్టీ.. ఈయనే అసలైన నాయకుడు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన(UBT) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితమే శిశిర్ షిండే ఉద్ధవ్ థాక్రే పార్టీని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతలోనే మనీషా కయాండే పార్టీని వీడటంతో శివసేన(UBT) ఆత్మరక్షణలో పడింది. శివసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ మనీషా ఉద్ధవ్ థాక్రేపైనా ఆ పార్టీ నేతలు సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీనే అసలైనదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని అభినందించారు. గత ఏడాది కాలంగా నాయకులంతా ఒక్కొక్కరుగా ఉద్ధవ్ పార్టీని విడిచిపోతుంటే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారన్న ఆత్మపరిశీలన చేసుకుంటారని ఎదురు చూశానన్నారు. వారలా చేయకపోగా కాంగ్రెస్-ఎన్సీపీ ఎజెండాను ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రౌత్, సుష్మాపై అంధారేలైతే హిందూ దేవతలను కించపరుస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ గొంతును వినిపిస్తున్నారు. ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ తాను పార్టీ వ్యతిరేక కార్కకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, తానెన్నడూ అలా ప్రవర్తించలేదని, వారే మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని వీడిపోతున్న సందర్బంగా చెత్త నుంచే విద్యుత్తు పుడుతుందన్న విషయాన్ని ఉద్ధవ్ థాక్రే మరచిపోకూడదని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఆమె బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుని మనీషా కయాండే మా పార్టీలోకి వచ్చారు. ఒక ఏడాదిలో ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. తిరిగి నామినేట్ అయ్యే అవకాశం లేకే రంగు మార్చారని అన్నారు శివసేన(UBT) నేత వినాయక్ రౌత్. ఇది కూడా చదవండి: కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్ -
'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్..
ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'డైలాగ్ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్‌లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్‌లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ -
మహారాష్ట్ర ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్!
న్యూఢిల్లీ: 2016 నబం రెబియా తీర్పును పునఃపరిశీలన కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి పంపాలన్న శివసేన థాక్రే వర్గం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరిస్కరించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నిజానిజాల గురించి తెలుసుకోకుండా పున:పరీశలనకు పంపలేమని చెప్పింది. శివసేన థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విభేదాల గురించి ఫిబ్రవరి 21న విచారణ చేపడతామని శుక్రవారం పేర్కొంది. 2016 తీర్పు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్‌లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. దీని ఆధారంగా తమపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లదని ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వర్గం ఎమ్మెల్యేలు వాదించారు. దీంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే దీన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. రెబియా కేసులో తీర్పును పునఃసమీక్షించాలని, విసృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది. కేసు యోగ్యతలు తెలుసుకోకుండా అలాంటి సూచన చేయలేమని స్పష్టం చేసింది. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
ఉద్ధవ్ మాస్టర్ ప్లాన్.. తేజస్వీ యాదవ్‌తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా?
మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీతో కలిసి షిండే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, శివసేన వర్గంలో కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో రానున్న బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలపై ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో అక్కడ నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే శివసేన నేత ఆదిత్య థాక్రే.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను పాట్నాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున తేజస్వీని ప్రచారం కోసం ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, శివసేన కోరిక మేరకు తేజస్వీ యాదవ్.. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రాంతంలో యూపీ, బీహార్ వలసవాసులు దాదాపు 50 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వీరి ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ క్రమంలో శివసేనుకు చెందిన ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇక, ఉద్ధవ్ థాక్రే సైతం.. 2024 రాబోయే లోక్‌సభ ఎన్నికల కన్నా బీఎంసీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం విజయం సాధిస్తే రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికల కోసం బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. After meeting with #AadityaThackeray, Bihar Deputy CM #TejashwiYadav is likely to campaign for the Uddhav Sena faction for the upcoming Brihanmumbai Municipal Corporation elections.@rohit_manas https://t.co/jExTeMlEAy — IndiaToday (@IndiaToday) November 24, 2022 -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
నేను నోరువిప్పితే భూకంపమే.. ఉద్ధవ్ థాక్రేకు సీఎం షిండే వార్నింగ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు పరోక్ష హెచ్చరికలు చేశారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. అంతేకాదు తన గురువు, శివసేన ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిఘే విషయంలో ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2002లో రోడ్డు ప్రమాదానికి గురై ఆనంద్ దిఘే మరణించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు శివసేన రెబల్ ఎమ్మెల్యేలను థాక్రే ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు. మరి సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ సిద్ధాంతాలను పక్కనపెట్టిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. 288 సీట్లకు గాను 200కుపైగా స్థానాలు కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే -
మరాఠీ బిడ్డలను అవమానించారు.. గవర్నర్ వ్యాఖ్యలపై థాక్రే ఫైర్
ముంబై: మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. భగత్ సింగ్ కోశ్యారి గౌరవ పదవిని చూసి ఇంకా ఎంతకాలం సైలెంట్‌గా ఉండాలో తనకు అర్థం కావడం లేదని థాక్రే అన్నారు. గవర్నర్ పదవిని చేపట్టేవారు కనీసం వారు కూర్చునే కుర్చీనైనా గౌరవించాలన్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆలయాలను త్వరగా తెరవాలని గవర్నర్ తొందరపెట్టారని థాక్రే ఆరోపించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను కూడా అవమానించారని పేర్కొన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపించి వేస్తే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో డబ్బు ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. వాళ్ల వల్లే ముంబైకి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్! -
త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శివసేనకు చెందిన వ్యక్తే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రయోగాన్ని ఆయన వెనకేసుకొచ్చారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పడం వల్లే ఎంవీఏ ఆవిర్భవించిందని, మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ కూటమిని స్వాగతించారని పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు సొంతంగా సీఎం అయ్యే అవకాశం మరోసారి వస్తుందని, అయితే అందుకు పార్టీకి క్షేత్రస్థాయిలో పునరజ్జీవం పోయాల్సిన అవసరం ఉందని థాక్రే అభిప్రాయపడ్డారు. తాను రాష్ట్రమంతా పర్యటించి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని శివసేనలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది శివసేన. ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏక్నాథ్ షిండే.. థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 40మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని చీల్చి బీజేపీతో జట్టుకట్టారు. ఇటీవలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శివసేన పార్టీ తమదే అని థాక్రే, షిండే వర్గాలు న్యాయపోరాటానికి దిగాయి. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: పొలిటికల్ హీట్ పెంచిన షిండే ట్వీట్.. ఉద్ధవ్ థాక్రేతో స్నేహం! -
'షిండే సర్కార్ కూలిపోతుంది.. మధ్యంతర ఎన్నికలు ఖాయం'
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే సర్కార్ త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు ఆదిత్య థాక్రే. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం అన్నారు. శివ్ సంవాద్ యాత్రలో భాగంగా పైఠణ్లో శివసేన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఉద్ధవ్ థాక్రేను శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు ఆదిత్య థాక్రే. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు అదను చూసి ద్రోహం చేశారని విమర్శించారు. పైఠణ్ ఎమ్మెల్యే, షిండే వర్గంలో ఒకరైన సందీపన్ భుమ్రేపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ హయాంలో నిధులు మంజూరు చేయలేదని ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు తాము చేసిందంతా తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని, కానీ ఇది ఏడవాల్సిన సమయం కాదు పోరాడాల్సిన సమయం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొందరు బలవంతం చేయడం వల్లే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తన తండ్రిపై తిరుగుబాటు చేశారని ఆదిత్య థాక్రే ఆరోపించారు. వారంతా తిరిగి తమతో కలవాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి ఊహించని షాక్ ఇచ్చారు ఏక్నాథ్ షిండే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేజిక్కుంచుకున్నారు. శివసేన తమదే అని ఇప్పుడు థాక్రే, షిండే వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ బలం నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన విషయం తెలిసిందే. చదవండి: ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్ -
పాములంటే భయం! ఏక్నాథ్ షిండే పై విమర్శల దాడి
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత విభేదాలతో రెండుగా విడిపోయి అనుహ్య రాజకీయ అనిశ్చితికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఏకనాథ షిండే 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసి బీజేపీ మద్దతుతో అనుహ్యంగా మహారాష్ట్ర సీఎంగా భాద్యతలు చేపట్టారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే వర్గాన్ని పాములుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఏక్‌నాధ్ షిండ్ వర్గాన్ని ఉద్దేశించి...సరదాలను కూడా చితకబాదే నైపుణ్యం నేర్చుకోండి. పాముల భయంతో అడవిని వదలకండి. జై మహారాష్ట్ర అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాకక్రే నేతృత్వంలో శివసేన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్‌లో ఉండటంతో మరోసారి శివసేన వర్గానికి పెద్ద షాక్ తగలిన నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేశారు. షిండే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక షిండే సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో 18 మంది శివసేన లోక్‌సభ ఎంపీలు బుధవారం తనను కలుస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది. (చదవండి: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!.. ఎమ్మెల్యే ముఖం చింపాంజీ కటౌట్‌తో నిరసన) -
సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్.. సీఎం షిండేకు ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై విచారణ జరిగేవరకు షిండే వర్గంలోని 16 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎటూ తేలకముందే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ షిండేను ఆహ్వానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని థాక్రే వర్గం గతవారం సుప్రీంను ఆశ్రయించింది. ఈ 16 మంది బలపరీక్షతో పాటు స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ పాల్గొన్నారని పేర్కొంది. వారి అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ జరుగుతుందని థాక్రే వర్గం భావించింది. కానీ లిస్టింగ్‌లో ఇది కన్పించలేదు. దీంతో పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని థాక్రే వర్గం కోరింది. అయితే దీన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం పడుతుందని కోర్టు తెలిపింది. ఆ తర్వాతే విచారణ చేపడతామని చెప్పింది. మంగళవారం కూడా థాక్రే పిటిషన్‌పై విచారణ జరిగే సూచనలు కన్పించడం లేదు. చదవండి: O. Panneerselvam: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
దాదాపు అన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం: కేసీఆర్
కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త ఎజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి. ఆ దిశగానే చర్చించడానికి మహారాష్ట్రకు వచ్చా. ఉద్ధవ్‌ఠాక్రేతో దాదాపు అన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం. దేశంలో భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతో మాట్లాడుతున్నాం. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లోగానీ, మరోచోటగానీ అందరం భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తాం. మహారాష్ట్ర నుంచి ఏ కూటమి వచ్చినా విజయవంతం అవుతుంది. ఈ రోజు ఒక ప్రారంభం జరిగింది. తొలి అడుగు పడింది. – సీఎం కేసీఆర్ దేశంలో ప్రజాపాలన మంటగలిసి పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? దీనిపై ఎవరో ఒకరు ఆలోచించాలి, ఈ అంశాన్ని లేవనెత్తాలి. అది ఈ రోజు మాతోనే ప్రారంభమవుతోంది. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చాం. ఆ ప్రకారం ఒక్కొ అడుగు ముందుకు వేస్తూ వెళతాం. – మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే దేశంలో నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు భావ సారూప్యత ఉన్న శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలి. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మా వంతు పూర్తి సహకారం ఉంటుంది. – ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సాక్షి, హైదరాబాద్, ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే దేశ రాజకీయాలు, దేశ వికాసం, పరిస్థితులను చర్చించడానికి మహారాష్ట్రకు వచ్చానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో చాలా అంశాలపై విస్తృతంగా చర్చించామని.. దాదాపు అన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. దేశంలో భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతోనూ మాట్లాడుతున్నామని.. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లోగానీ, మరోచోటగానీ అందరం భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం ముంబై వెళ్లారు. అక్కడి సీఎం అధికారిక నివాసం ‘వర్ష’వద్ద సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్ర నేతలకు ఉద్ధవ్‌ఠాక్రే సాదరంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజన విందు ఇచ్చారు. తర్వాత ఇరువురు సీఎంలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, ఉద్ధవ్‌ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తొలుత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తమ చర్చల్లో దాదాపు అన్ని విషయాల్లో ఏకభిప్రాయానికి వచ్చామని, భవిష్యత్తులో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఏ కూటమి వచ్చినా విజయవంతం అవుతుందని చెప్పారు. ‘‘దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించాం. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం ఏమేర అభివృద్ధి సాధించాలో అంత సాధించలేదు. దేశంలో పెద్ద మార్పు అవసరముంది. దేశంలో ప్రస్తుతమున్న వాతావరణం పాడు కాకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే, మరాఠా యోధులు అందించిన ప్రేరణతో ముందుకు సాగుతాం. కేంద్ర జులుంకు, అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ చర్చల సత్ఫలితాలను చూస్తాం. ఈ రోజు ఒక ప్రారంభం జరిగింది. ఇందులో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. దేశంలోని మిగతా నేతలతో మాట్లాడుతాం. చర్చల తర్వాతే ఎజెండా ఖరారు చేస్తాం..’’అని కేసీఆర్ చెప్పారు. ఎంతో ప్రేమ చూపారు.. తిరిగి ఇస్తాం.. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, రెండు రాష్ట్రాలు సోదరుల వంటివని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాలు చాలా విషయాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, వాటిపైనా చర్చించి ఏకభిప్రాయానికి వచ్చామన్నారు. ‘‘ఉద్ధవ్ ఠాక్రే నాకు ప్రేమతో భోజనం పెట్టారు. మహారాష్ట్ర నుంచి ప్రేమను మూటగట్టుకుని వెళ్తున్నాం. అదే ప్రేమను మేం కూడా తిరిగిస్తాం. వీలు చూసుకుని ఉద్ధవ్ ఠాక్రే హైదరాబాద్‌కు రావాలి’’అని ఆహ్వానించారు. చకచకా పర్యటన.. ఆదివారం ఉదయం 11.40 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్, ఇతర నేతలు ముంబైకి బయలుదేరారు. మధ్యాహ్నం 12.50కు ముంబైలో దిగి.. గ్రాండ్ హయత్ హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అక్కడి నుంచి కేసీఆర్ బృందం ఎన్సీపీ అధినేత, మాజీ సీఎం శరద్ పవార్ నివాసానికి చేరుకుంది. వారిని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే సాదరంగా ఆహ్వానించారు. పవార్‌తో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యాక.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాత్రి 7.20 గంటల సమయంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి బయల్దేరి.. రాత్రి 8.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొత్త ఎజెండాతో వస్తాం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. దేశం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని సీఎం కేసీఆర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు. ముంబై పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. శరద్‌పవార్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. వారు పలు అంశాలపై చర్చించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశం సరైన మార్గంలో నడవడం లేదని.. దీనికి కారణాలు వెతికి కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త ఎజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలుకుని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సఫలమయ్యేంత వరకు శరద్ పవార్ మాకు మద్దతుగా నిలిచారు. దేశంలో ఎంతో రాజకీయ అనుభవమున్న పవార్ ముందు నా ఆలోచనలు పెట్టాను. ఆయన ఆశీర్వదించారు. దేశ ప్రయోజనాల కోసం కలసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అంశంపై మా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వీలైనంత త్వరలో దేశంలోని ఇతర పార్టీలతో మాట్లాడేందుకు సమావేశం నిర్వహిస్తాం. దేశ ప్రజల ముందు ఒక ఎజెండా, టైమ్ టేబుల్, కార్యాచరణ పెడతాం’’అని కేసీఆర్ తెలిపారు. భావ సారూప్య శక్తులు ఏకం కావాలి: శరద్‌పవార్ దేశంలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడుతోందని, సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించారు. ‘‘దేశంలో నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు భావ సార్యూపత ఉన్న శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’’అని ప్రకటించారు. ఇక గంటన్నర పాటు జరిగిన సమావేశంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై కేసీఆర్, పవార్ నడుమ చర్చ జరిగిందని ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తెలిపారు. వివిధ రాజకీయపక్షాలకు చెందినవారు కలిసి భావసారూప్యతలను పంచుకుంటూ కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమైందని వెల్లడించారు. అందరూ కలిసికట్టుగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనే అంశంపై పవార్, కేసీఆర్ నడుమ ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. శరద్‌పవార్‌తో జరిగిన భేటీలో ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు ఉన్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకో న్యాయం, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలకో న్యాయం అనుసరిస్తోందని మండిపడ్డారు. -
మీది గొప్ప పోరాటం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ గళం విప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు క్రమంగా వివిధ రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్‌కు అండగా నిలవగా తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం కేసీఆర్‌కు మద్దతు పలికారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవ డానికి సరైన సమయంలో గళం విప్పారంటూ కేసీఆర్‌ను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఠాక్రే బుధవారం సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేశారు. ఈ నెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. ‘‘కేసీఆర్‌జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొన సాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం’’ అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఠాక్రే ఆహ్వానం మేరకు 20న ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. ఈ భేటీలో కేంద్రంపై ఏ విధమైన పోరాట పంథాను అనుసరించాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ సమావేశంలో ఏదైనా కార్యాచరణ రూపొందుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
-
వచ్చే 15 రోజుల్లో యాక్టివ్ కేసులు రెట్టింపు
ముంబై: వచ్చే పక్షం రోజుల్లో తమ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు రెట్టింపయ్యే ప్రమాదముందంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈనెల 30వ తేదీ నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతమున్న 5.64 లక్షల నుంచి 11.9 లక్షలకు చేరుకుంటాయని అందులో తెలిపారు. రోజుకు ప్రస్తుతమున్న 1,200 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ వాడకం అప్పటికి 2వేల టన్నులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పెరిగిన అవసరాలు తీర్చేలా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతివ్వాలని కోరారు. కరోనా కేసుల దృష్ట్యా పొరుగు రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ సరఫరాకు అశక్తత వ్యక్తం చేశాయన్నారు. అలాగే, రెమిడెసివిర్ ఔషధాన్ని డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి బాధితులకు సాయం అందించేందుకు వీలవుతుందన్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఈనెల 14 నుంచి మే 1వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్డౌన్ -
ఐపీఎల్ మ్యాచులు ఇక్కడ వద్దంటు సీఎంకు లేఖ
ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ ముంబైలో విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడేలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా లేదా అన్న సందేహం మొదలైంది. ఇటీవల బీసీసీఐ మెంబర్ మ్యాచులకు సంబంధించి వేదికలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత వచ్చింది. కానీ ప్రస్తుతం వాంఖడే సమీపంలోని స్థానికులు కేసులు కారణంగా ముంబై వేదికను మార్చాలంటూ సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు లేఖ రాశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తన ప్రణాళికను రూపొందించినప్పుడు దేశంలో కోవిడ్ -19 కేసుల పరిస్థితి సాధారణంగానే నమోదు అయ్యేవి. అయితే, గత రెండు వారాలు, దేశంలోని అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసలు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. వీటి నివారణకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో మాత్రం అనుకున్నట్లుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వేదికను మార్చాలని కోరుతూ వాంఖడే స్టేడియం సమీపంలోని నివాసితులు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు లేఖ రాశారు. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా , ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలన్న కోరికతో అభిమానులు గూమికూడే అవకాశం ఉంది. తద్వారా కరోనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికను మార్చవలసిందిగా అక్కడి స్థానికులు సీఎంకు లేఖ రాశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎలా అనుమతినిస్తుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ( చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి ) -
‘ఆయన ఓ హిట్లర్’
సాక్షి, ముంబై : వలస కూలీల వ్యవహారంలో బీజేపీ తీరును శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్ దుయ్యబట్టింది. వలస కూలీల దురవస్ధను 1990 ప్రాంతంలో జమ్ము కశ్మీర్‌లోని పండిట్ల దుస్ధితితో సేన ఎంపీ సంజయ్ రౌత్ పోల్చారు. యూపీలో వలస కూలీలను సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రౌత్ ఆరోపించారు. దేశీయ విమాన సర్వీసులు అప్పుడే వద్దు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో మే 31 తర్వాత లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశీయ విమాన సర్వీసులను అప్పుడే ప్రారంభించడం సరైంది కాదని, దీనికి సిద్ధమయ్యేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఠాక్రే కేంద్రాన్ని కోరారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో తాను ఈ విషయమై మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే 15 రోజులు మహమ్మారి కట్టడిలో కీలకమైనవని ఇప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తివేయరాదని అన్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో మహారాష్ట్ర ఏకీభించని క్రమంలో అనిశ్చితి నెలకొంది. చదవండి : న్యాప్కిన్స్పై ఠాక్రే ఫోటో : సేనపై ఎంఎన్ఎస్ ఫైర్ -
ఆయన యూటర్న్ సీఎం..
పూణే : వ్యవసాయ రుణాల మాఫీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ దుయ్యబట్టారు. సంపూర్ణ రుణ మాఫీని వాగ్ధానం చేసిన ఠాక్రే ఇప్పుడు కేవలం రూ 2 లక్షల వరకే మాఫీని ప్రకటించారని విమర్శించారు. ఏ విషయానికైనా కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసని, ప్రకటన చేయడం అమలుపరచడానికి వ్యత్యాసం ఏంటో ఇప్పుడు ఠాక్రేకు అవగతమైందని పాటిల్ ఎద్దేవా చేశారు. ఇక నుంచి యూటర్న్ అంటే ఉద్ధవ్ ఠాక్రే అని ఆయన అభివర్ణించారు. -
బీజేపీకి మరో ఝలక్ ఇచ్చిన ఉద్ధవ్ థాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. నెరుల్ ప్రాంతంలో అక్రమ వలసదారుల కోసం నిర్భంద కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న గత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే మంగళవారం రద్దు చేశారు. మహారాష్ట్రలో నిర్భంద కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో జనవరి 22న ఎన్నార్సీపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఎన్నార్సీ అమలుపై తమ వైఖరి వెల్లడిస్తామని ఉద్ధవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నార్సీ అమల్లోకి వస్తే భారతదేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులను గుర్తించేందుకు వీలుంటుంది. అలాంటి వారిని వారి స్వదేశానికి పంపిస్తారు. ఒకవేళ ఏదేశమైనా వాళ్లను తమ పౌరులు కాదని తిరస్కరిస్తే, అలాంటి వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. కాగా, ఇప్పటికే సీఏఏపై దేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 22న ఎన్నార్సీపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి : రాహుల్ గాంధీని కొట్టండి -
మహారాష్ట్రలో 50:50 ఫార్ములానే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు 50:50 ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితోపాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి. సరైన దిశలో చర్చలు సాగుతున్నాయి: ఉద్ధవ్ ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్, మాణిక్ రావు సమావేశమయ్యారు. చర్చలు సరైన దిశలో కొనసాగుతున్నాయని మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ‘గడువు తిరస్కరణ’ను ప్రస్తావించని శివసేన న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతులేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా.. ‘మూడ్రోజుల సమయం ఇచ్చేందుకు గవర్నర్ ఒప్పుకోని’ అంశాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని శివసేన లాయర్లు బుధవారం మీడియాకు చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, వెంటనే దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించాలని శివసేన మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టడం, దీనిపై రిట్ పిటిషన్ దాఖలుచేయాలని శివసేనను కోర్టు ఆదేశించడం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ చేసిన సిఫార్సును తప్పుబడుతూ తాము మరో పిటిషన్‌ను సిద్ధంచేశామని శివసేన లాయర్లు వెల్లడించారు. అయితే, ఇప్పటికే రాష్ట్రపతిపాలన అమల్లోకి వచ్చినందున, నెమ్మదిగా పిటిషన్ వేస్తామని, ఈ పిటిషన్ దాఖలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని లాయర్లు చెప్పారు. -
మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!?
ముంబై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన శివసేన ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఠాక్రే డిప్యూటీ అయ్యేందుకు ఇష్టపడరు. ఆ కుటుంబానికి చెందిన వారెవరైనా అధినేతగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఠాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో నిలవాలా లేదా అన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేదే తుది నిర్ణయం. అయితే డిప్యూటీగా కాకుండా చీఫ్‌గా ఉండేందుకే తను ఇష్టపడతాడు’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, శివసేన యూత్ వింగ్ చీఫ్ ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన యువసేన విభాగం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందన్న నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వారసుడు క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ ఫలితాల అనంతరం శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ శివసేన.. అనేక మార్లు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించింది. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటన్నింటినీ మరచి మరోసారి ఎన్డీయే కూటమిలో చేరింది. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై శివసేన కన్ను వేయడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
న్యూక్లియర్ ప్రాజెక్టుపై మా వైఖరి సుస్పష్టం
సాక్షి, ముంబై: వివాదాస్పద జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఆయన శనివారం కొంకణ్ పర్యటనకు బయలుదేరారు. గణపతి పులే దేవాలయంలో పూజలు నిర్వహించిన ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంకణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ముఖ్యంగా జైతాపూర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై ప్రజలకు మద్దతుగా నిలుస్తామని మరోసారి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దుచేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులకు, ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రాజెక్టు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల న్యూక్లియర్ ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించింది. అందుకు స్థలసేకరణ, ఇతర అధ్యయనం పనులు పూర్తిచేసింది. కాని ఈ ప్రాజెక్టు వల్ల తాము చాలా నష్టపోతామని అప్పట్లో అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది. వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని శివసేన నాయకులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లోనేకాక లోకసభ, శాసన సభ ఎన్నికల్లో కూడా శివసేనకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో కొంకణ్ ప్రజలకు ఇచ్చిన మాటపై శివసేన కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.