( ఫైల్ ఫోటో )
న్యూఢిల్లీ: 2016 నబం రెబియా తీర్పును పునఃపరిశీలన కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి పంపాలన్న శివసేన థాక్రే వర్గం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరిస్కరించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నిజానిజాల గురించి తెలుసుకోకుండా పున:పరీశలనకు పంపలేమని చెప్పింది. శివసేన థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గం మధ్య విభేదాల గురించి ఫిబ్రవరి 21న విచారణ చేపడతామని శుక్రవారం పేర్కొంది.
2016 తీర్పు..
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్‌లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు.
దీని ఆధారంగా తమపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లదని ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వర్గం ఎమ్మెల్యేలు వాదించారు. దీంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే దీన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. రెబియా కేసులో తీర్పును పునఃసమీక్షించాలని, విసృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది. కేసు యోగ్యతలు తెలుసుకోకుండా అలాంటి సూచన చేయలేమని స్పష్టం చేసింది.
చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment