Sakshi News home page

అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్

Published Fri, Feb 17 2023 8:42 AM

Form JAC on Adani Issue No Use WIth Other Committees Congress - Sakshi

న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్‌ రమేష్‌ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు.
చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్..

Advertisement

తప్పక చదవండి

Advertisement