ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన(UBT) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితమే శిశిర్ షిండే ఉద్ధవ్ థాక్రే పార్టీని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతలోనే మనీషా కయాండే పార్టీని వీడటంతో శివసేన(UBT) ఆత్మరక్షణలో పడింది.
శివసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ మనీషా ఉద్ధవ్ థాక్రేపైనా ఆ పార్టీ నేతలు సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీనే అసలైనదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని అభినందించారు.
గత ఏడాది కాలంగా నాయకులంతా ఒక్కొక్కరుగా ఉద్ధవ్ పార్టీని విడిచిపోతుంటే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారన్న ఆత్మపరిశీలన చేసుకుంటారని ఎదురు చూశానన్నారు. వారలా చేయకపోగా కాంగ్రెస్-ఎన్సీపీ ఎజెండాను ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రౌత్, సుష్మాపై అంధారేలైతే హిందూ దేవతలను కించపరుస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ గొంతును వినిపిస్తున్నారు.
ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ తాను పార్టీ వ్యతిరేక కార్కకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, తానెన్నడూ అలా ప్రవర్తించలేదని, వారే మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని వీడిపోతున్న సందర్బంగా చెత్త నుంచే విద్యుత్తు పుడుతుందన్న విషయాన్ని ఉద్ధవ్ థాక్రే మరచిపోకూడదని ఆమె గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా ఆమె బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుని మనీషా కయాండే మా పార్టీలోకి వచ్చారు. ఒక ఏడాదిలో ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. తిరిగి నామినేట్ అయ్యే అవకాశం లేకే రంగు మార్చారని అన్నారు శివసేన(UBT) నేత వినాయక్ రౌత్.
ఇది కూడా చదవండి: కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
Comments
Please login to add a commentAdd a comment