manisha kayande
-
‘ఇదే అసలైన పార్టీ.. ఈయనే అసలైన నాయకుడు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన(UBT) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితమే శిశిర్ షిండే ఉద్ధవ్ థాక్రే పార్టీని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతలోనే మనీషా కయాండే పార్టీని వీడటంతో శివసేన(UBT) ఆత్మరక్షణలో పడింది. శివసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ మనీషా ఉద్ధవ్ థాక్రేపైనా ఆ పార్టీ నేతలు సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీనే అసలైనదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని అభినందించారు. గత ఏడాది కాలంగా నాయకులంతా ఒక్కొక్కరుగా ఉద్ధవ్ పార్టీని విడిచిపోతుంటే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారన్న ఆత్మపరిశీలన చేసుకుంటారని ఎదురు చూశానన్నారు. వారలా చేయకపోగా కాంగ్రెస్-ఎన్సీపీ ఎజెండాను ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రౌత్, సుష్మాపై అంధారేలైతే హిందూ దేవతలను కించపరుస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ గొంతును వినిపిస్తున్నారు. ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ తాను పార్టీ వ్యతిరేక కార్కకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, తానెన్నడూ అలా ప్రవర్తించలేదని, వారే మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని వీడిపోతున్న సందర్బంగా చెత్త నుంచే విద్యుత్తు పుడుతుందన్న విషయాన్ని ఉద్ధవ్ థాక్రే మరచిపోకూడదని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఆమె బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుని మనీషా కయాండే మా పార్టీలోకి వచ్చారు. ఒక ఏడాదిలో ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. తిరిగి నామినేట్ అయ్యే అవకాశం లేకే రంగు మార్చారని అన్నారు శివసేన(UBT) నేత వినాయక్ రౌత్. ఇది కూడా చదవండి: కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్ -
జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం
ముంబై: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు అని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ‘మోదీ, అమిత్‌షాల గర్వాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచిపెట్టేశారు. ప్రజాస్వామ్యం గెలిచింద’ని ఆయన ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్, మనీష కయాండే (ఫైల్ ఫొటోలు) మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన బీజేపీపై ప్రజలకు విశ్వాసం సడలుతోందని శివసేన అధికార ప్రతినిధి మనీష కయాండే అభిప్రాయపడ్డారు. ‘వారు (బీజేపీ) అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తామని ప్రజలతో చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నార్సీ వంటి అంశాలను అందుకే తెర ముందుకు తీసుకొచ్చార’ని మనీష పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా బాగానే కష్టపడినప్పటికీ.. జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోయిందని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తాజా ట్రెండ్స్ ప్రకారం జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 24 స్థానాలతో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఏజేఎస్‌యూ 4, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 4 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది. (చదవండి: జార్ఖండ్ పీఠం మాదే..) -
మోదీ ప్రసంగంపై శివసేన ఆసక్తికర కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు గడిచినా మోదీ ఇంకా రియలైజ్ కాలేదని, ఆయన కళ్లుతెరవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన ఎంపీ మనీషా కాయండే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగానే ప్రజలు మోదీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ‘మీ నుంచి ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కాద’ని ఆమె అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘మోదీ మంచి మాటకారి. కానీ పార్లమెంట్లో ఆయన ఈరోజు చేసిన ప్రసంగం అర్ధసత్యాలు, వక్రీకరణలతో సాగింద’ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. -
'సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి'
-
అంత ప్రేముంటే సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి
పాకిస్థాన్ నటీనటులకు మద్దతు పలుకుతూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శివసేన, ఎంఎన్ఎస్ నాయకులు సల్మాన్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలన్నారు. ఆయనకు పాకిస్థానీ నటులంటే అంత ప్రేమ ఉంటే.. ఆయన పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా విమర్శించారు. పాక్ నటీనటులు ఉగ్రవాదులు కారని, వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు వర్క్ పర్మిట్ వీసా తీసుకుని మరీ వచ్చారని, వాళ్లకు వీసాలు మంజూరు చేసింది కూడా ప్రభుత్వమేనని సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంతకుముందు ఎంఎన్ఎస్ అగ్రనేత అమే ఖోప్కర్ కూడా స్పందించారు. చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని, ఇది చట్టవ్యతిరేకమని ఆయన అన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పకైతే పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని.. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాని కూడా అమే ఖోప్కర్ చెప్పారు.