అంత ప్రేముంటే సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి | salman khan should migrate to pakistan, says shivsena leader | Sakshi
Sakshi News home page

అంత ప్రేముంటే సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి

Published Sat, Oct 1 2016 10:38 AM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

అంత ప్రేముంటే సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి - Sakshi

అంత ప్రేముంటే సల్మాన్ పాకిస్థాన్ వెళ్లిపోవాలి

పాకిస్థాన్ నటీనటులకు మద్దతు పలుకుతూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శివసేన, ఎంఎన్ఎస్ నాయకులు సల్మాన్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలన్నారు. ఆయనకు పాకిస్థానీ నటులంటే అంత ప్రేమ ఉంటే.. ఆయన పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా విమర్శించారు.

పాక్ నటీనటులు ఉగ్రవాదులు కారని, వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు వర్క్ పర్మిట్ వీసా తీసుకుని మరీ వచ్చారని, వాళ్లకు వీసాలు మంజూరు చేసింది కూడా ప్రభుత్వమేనని సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంతకుముందు ఎంఎన్ఎస్ అగ్రనేత అమే ఖోప్కర్ కూడా స్పందించారు. చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని, ఇది చట్టవ్యతిరేకమని ఆయన అన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని,  ఇప్పకైతే పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని.. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాని కూడా అమే ఖోప్కర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement