ఐ లవ్‌ సల్మాన్‌ఖాన్ అని క్లారిటీ ఇచ్చిన నటి | I love Salman': Pak actress Saba | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ సల్మాన్‌ఖాన్ అని క్లారిటీ ఇచ్చిన నటి

Published Sun, Feb 19 2017 9:32 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

ఐ లవ్‌ సల్మాన్‌ఖాన్ అని క్లారిటీ ఇచ్చిన నటి - Sakshi

ఐ లవ్‌ సల్మాన్‌ఖాన్ అని క్లారిటీ ఇచ్చిన నటి

ముంబయి: తాను బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను ఎంతో ప్రేమిస్తానని పాకిస్థాన్‌ ప్రముఖ నటి సబా ఖమర్‌ చెప్పింది. ఆయనంటే తనకు చాలా గౌరవం అని కూడా తెలిపింది. ప్రముఖ బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ హష్మీ, హృతిక్‌ రోషన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌లాంటివారిని కించపరుస్తూ తొలుత ఓ వీడియోలో కనిపించిన ఈ అమ్మడిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది. దీంతో వెంటనే ఆమె దిద్దుబాటుచర్యలకు దిగింది.

‘గుడ్‌ మార్నింగ్‌ జిందగీ అనేది ఒక ఫన్నీ కార్యక్రమం. అందులో బాలీవుడ్‌ స్టార్ల గురించి అడిగేవన్నీ కూడా చాలా ఫన్నీ ప్రశ్నలే. ఒక్కో నటుడి గురించి నేను చెప్పినవన్నీ కూడా చాలా సరదాగా చెప్పిన సమాధానాలు.. ఆ సందర్భానికి తగినవి. నేను భారతీయ సినిమా పరిశ్రమలో ఎక్కువగా సల్మాన్‌ ఖాన్‌ ఎక్కువగా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఆయన చాలా పెద్ద నటుడు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, అంతకుముందు ఓ కార్యక్రమంలోని వీడియోలో మాట్లాడిన ఆమె సల్మాన్‌ ఒక చిచ్చోరా(చీప్‌ పర్సన్‌) అనడమే కాకుండా ఆయన డ్యాన్సింగ్‌ స్టైల్‌పై కూడా కామెంట్లు చేసింది. ఇలాగే, మిగితా బాలీవుడ్‌ నటులను కూడా కించపరిచేలా మాట్లాడి తన అసలు ఉద్దేశం వేరని జవాబిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement