saba qamar
-
'చేదు నిజాలు తెలిశాయి, అతడితో నా పెళ్లి జరగదు'
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పాకిస్తాన్ నటి సబా కమర్ తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంటర్ప్రెన్యూర్, బ్లాగర్ అజీమ్ ఖాన్‌తో తన జీవితాన్ని పంచుకోవడం లేదని వెల్లడించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను షేర్ చేసింది. "అనేక వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్‌తో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నాను. మేము పెళ్లి చేసుకోవడం లేదు. నా నిర్ణయానికి మీరందరూ మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నా. ఇది నాకు చాలా క్లిష్టమైన సమయం.. కానీ, ఇలాంటి రోజులు కూడా కాలక్రమంలో త్వరగానే కనుమరుగైపోతాయి. ఏదేమైనా కొన్ని చేదు నిజాలను నేను త్వరగానే తెలుసుకున్నానుకుంటున్నాను. మరో ముఖ్య విషయమేంటంటే.. నా లైఫ్‌లో ఇప్పటివరకు అజీమ్ ఖాన్‌ను నేరుగా ఒక్కసారి కూడా కలవలేదు. కేవలం ఫోన్ ద్వారానే మాట్లాడుకునేవాళ్లం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ లేఖపై స్పందించిన అజీమ్ ఇలా అర్ధాంతరంగా విడిపోవడానికి తనే కారణమని పేర్కొన్నాడు. ఎంతో మంచి మనసు ఉన్న సబా మున్ముందు కూడా సంతోషంగా ఉండాలని, ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. కాగా సబా, అజీమ్‌లు వారి నిశ్చితార్థాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే అజీమ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో తానే తప్పు చేయలేదంటూ అతడు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. 'నీ మీద నాకు నమ్మకం ఉంది' అంటూ సబా దానికి రిప్లై కూడా ఇచ్చింది. కానీ కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం. సబా కమర్ బాలీవుడ్లో 'హిందీ మీడియం' సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by 𝐒𝐚𝐛𝐚 𝐐𝐚𝐦𝐚𝐫 (@sabaqamarzaman) View this post on Instagram A post shared by Azeem Khan (@axeemkhan) చదవండి: ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు+ ప్రైమ్ వోచర్+ కొత్త సినిమా టికెట్ డబ్బులు భర్తతో విడిపోతున్నా, కష్టంగా ఉంది!: నటి ఎమోషనల్ -
నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
‘హిందీ మీడియం’ ఫేమ్ పాకిస్తాన్ నటి సబా కమర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘అసలు నువ్వు ముస్లింవేనా..?’ ‘నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా..?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సబాను ఇంతలా ట్రోల్ చేయడానికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆమె ఫోటోలు. ఈ ఫోటోల్లో సబా పొగతాగుతున్నట్లు ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాస్తా ‘సిగరెట్ తాగడమే కాక, ఆ ఫోటోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తావా’ అంటూ సబాపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సబాను ‘అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్‌లా తయారవుతున్నావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. Today I feel sad that a colleague and one of the finest actor of Pakistan is being exploited by someone for a cheap publicity stunt ... it was just a simple BTS ( behind the scene) vdo during a photo shoot from which the screen shots were taken and made viral on social media ... its disgusting that people can go upto any extent for cheap publicity... saba you are a superstar and don’t let these haters demotivate you .. #wesupport #sabaqamar #pakistanidrama #pakistanimovie #pakistanifilm #repost #instapakistan #instalike #movieshoovy #divamagazinepakistan #showbizpakistan A post shared by Aijaz aslam (@aijazzaslamofficial) on Jul 19, 2018 at 12:33pm PDT అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలు యాడ్ చిత్రకరణ విరామ సమయంలో తీసినవి. అంతేకాక ఈ ఫోటోలను సబా షేర్ చేయలేదంటా. పొరపాటున లీకైన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సబా సహనటులు ఒస్మాన్ ఖాలిద్ బిట్, అద్నాన్ సిద్దికి, ఎద్జాజ్ అస్లాం మాత్రం ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం గురించి వారు సోషల్ మీడియాలో ‘ఒక యాడ్‌లో భాగంగా నువ్వు సిగరెట్‌ను పట్టుకోవాల్సి వచ్చింది. విరామ సమయంలో తీసిన ఫోటోలు ఇవి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం కొందరికి అలవాటు. అటువంటి వారి వ్యాఖ్యలను నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంటో మాకు తెలుసు’ అంటూ మద్దతు తెలుపుతున్నారు. గతంలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్, రణబీర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫోటలపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ సమయంలో కూడా మహీరాను ఇలానే విమర్శించారు. -
ఆరు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు
సాక్షి, ముంబై : సరిహద్దు గొడవలైనా.. ఇరుదేశాల మధ్య సఖ్యత లేదని నాయకులు వాదిస్తున్నా.. ఎల్లలు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపి ఉంచే మాధ్యమం సినిమా అని మరోసారి నిరూపించారు చైనా ప్రేక్షకులు. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో భారతీయ సినిమాలపై మొదలైన చైనీయుల ప్రేమ బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురుపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జంటగా తెరకెక్కిన హిందీ మీడియం సినిమా చైనాలో విడుదలైన ఆరు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తర్వాత చైనాలో విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష అవసరమని చెబుతూనే.. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై విమర్శనాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తమ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో చైనా ప్రజలు ఆదరించారని స్థానిక మీడియా పేర్కొంది. ఈనెల 4న కిపోజియాన్(స్టార్టింగ్ లైన్) పేరుతో చైనాలో విడుదలైంది హిందీ మీడియం. పిల్లల విద్య కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా చైనీయులను అమితంగా ఆకర్షించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సామాజిక సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తెరకెక్కిన ఇలాంటి భారతీయ సినిమాలను చైనీయుల తప్పక ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించిందని పేర్కొంది. -
ఇంత అవమానమా.. వెక్కివెక్కి ఏడ్చిన నటి!
ఇటీవల ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ సినిమా ’హిందీ మీడియం’లో నటించిన సబా కమర్ తాజాగా వెక్కివెక్కి ఏడ్చారు. ఒక పాకిస్థానీ అయినందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలో తాను ఏ రకంగా అవమానాలు ఎదుర్కొన్నది వెల్లడించారు. కేవలం పాకిస్థానీ కావడం వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎదుర్కొంటున్న కఠినమైన తనిఖీలు, ప్రశ్నల గురించి ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. సబా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమె ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘హిందీ మీడియం’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జోడీతో పాట షూట్ చేసేందుకు జార్జియాలోని తబ్లిసికి వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ‘పాకిస్థాన్‌లో ఉండి మనం పాకిస్థాన్ జిందాబాద్. పాకిస్థాన్ జై అంటూ ఎన్నో నినాదాలు చేస్తాం. కానీ మనం బయటకు వెళ్లినప్పుడు మన పట్ల జరిగే తనిఖీలు ఎంత దారుణంగా ఉంటాయో నేను చెప్పలేను. ఎంతో అవమానకరంగా ఈ తనిఖీలు జరుపుతారు. భారతీయ చిత్రయూనిట్‌తో షూటింగ్ కోసం మేం తబ్లిసీ వెళ్లినప్పుడు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తుంది. భారతీయ చిత్రయూనిట్ మొత్తం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయింది. కానీ, నన్ను మాత్రం అదుపులోకి తీసుకొని ప్రశ్నించి.. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత అధికారులు పంపించారు. నేను పాకిస్థానీని అనే ఒకే ఒక్క కారణంతో ఇంతగా అవమానించారు. బయట మనకు ఈ పరిస్థితి ఉందా? అన్న విషయం ఆ రోజు నాకు తెలిసింది’అంటూ ఎంతో భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటా సబా అన్నారు. 49 సెకన్లు ఉన్న ఆమె ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. It's not just #SabaQamar who feels humiliated. All #Pakistanis feel humiliated when we are considered a terrorist state, when our children are killed like flies & we can't get justice for them, when terrorist like #HafizSaeed roam around freely & we watch them helplessly. pic.twitter.com/pHalKqo7cq — Sabah Alam (@AlamSabah) 16 January 2018 -
ఏబీసీడీల సూప్ హిందీ మీడియం
‘‘ఇస్ దేశ్ మే అంగ్రేజ్ జుబాన్ నహీ.. క్లాస్ హై (ఇంగ్లిష్ అనేది ఈ దేశంలో భాష మాత్రమే కాదు.. ఉన్నతవర్గాన్ని సూచించే మాధ్యమం)... ‘‘హిందీ మీడియం’’ సినిమాలోని డైలాగ్ ఇది! నిజ జీవితంలోని ప్రాక్టికాలిటీ కూడా! కులం, మతం, డబ్బే కాదు ఇంగ్లిష్ భాష కూడా సమాజాన్ని ఎలా వర్గీకరించిందో చెప్పే చిత్రం. హిందీ చోట దేశంలోని ఆయా భాషలను చేర్చుకుంటే అన్ని మెట్రోల పరిస్థితే హిందీ మీడియం. మన భాషను మనం గౌరవించుకుంటే ఆ మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా స్కూళ్లు బాగుంటాయని హెచ్చరించే సినిమా! అసలు కథ... : రాజ్భత్రా (ఇర్ఫాన్ ఖాన్), మీతా (సబా ఖమర్) భార్యాభర్తలు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో రాజ్ ఒక ష్యాషన్ స్టూడియో (బట్టల దుకాణం)నడుపుతుంటాడు. అతని మాట చాతుర్యం, మెళకువలతో వ్యాపారం చక్కగా సాగుతుంటుంది. తనని తాను లోకల్ టైకూన్‌గా అభివర్ణించుకుంటుంటాడు. పెద్దల ద్వారా సంక్రమించిన ఇల్లూ ఉంటుంది. వీళ్లకు ఒక పాప. పేరు పియ. ప్రేమానురాగాల కుటుంబం. చాలామంది లాగే ఈ ఇల్లాలికీ ఇంగ్లిష్ అంటే మహా మోజు. ఒక్కగానొక్క బిడ్డను ఢిల్లీలోని హైఫై ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించాలనే ఆరాటం. అక్కడి నుంచే కథ మొదలు. పేరున్న ప్రైవేట్ స్కూల్లో సీట్ రావాలంటే ముందు తాముంటున్న చాందినీ చౌక్ నుంచి మకాం మారాలని చెప్తుంది భర్తతో. తాతలనాటి ఇల్లు.. వదిలేదెలా?’’ అంటాడు భర్త. ‘‘బిడ్డ భవిష్యత్ కోసం’’ సెంట్మెంట్ బాణం వదులుతుంది భార్య. వెంటనే సౌత్ ఢిల్లీలోని వసంత్ విహార్‌కు మారుతుంది వాళ్ల నివాసం. పరోటా పోయి పాస్తా: రాజ్ తన భార్యను ‘‘మీతూ’’ అని పిల్చుకుంటుంటాడు ముద్దుగా. పాష్ లొకాలిటీలోకి వచ్చాక కూడా ఇంకా ఆ పాచి పేరెందుకు ‘‘హనీ’’ అని పిలవండి అంటుంది గారాలు పోతూ. మాటామంతి, కట్టూబొట్టు,తిండీతీరూ అంతా ఆ స్థాయిలోనే ఉండాలి అంటూ ఆర్డర్ వేస్తుంది భార్య. అయోమయంగా తలాడిస్తాడు రాజ్. పరోటా స్థానంలో పాస్తా వస్తుంది... భాంగ్రాకి బదులు వెస్ట్రన్ డాన్స్ స్టెప్స్ పడ్తుంటాయి. సల్వార్ కమీజ్ పోయి మోడర్న్ అవుట్‌ఫిట్స్ కనపడుతుంటాయి. నమస్తేని మరిచిపోయి ‘‘హలో.. హాయ్.. హౌ ఆర్ యూ’’ ప్రాక్టిస్ మొదలవుతుంది. ఆ కాంప్లెక్స్‌లో ఇరుగుపొరుగు వాళ్లకు తామూ సోషల్లీ హైక్లాస్ విత్ హై ఇంగ్లిష్ హాబిట్స్ అని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది మీతా. పేరెంట్స్‌కి మ్యానర్స్ ఉంటేనే వాళ్ల పిల్లలను తమ బిడ్డతో ఫ్రెండ్షిప్ చేయనిస్తారు.. ఆడుకోనిస్తారు అన్నమాట ఆ సొసైటీలో. అడ్మిషన్ ప్రహసనం: అదంతా ఒకెత్తయితే అమ్మాయి కోసం మంచి స్కూల్‌ను వెదకడం, అందులో అడ్మిషన్ కోసం పాటుపడడం ఒకెత్తు. ఒక్కో స్కూల్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తుంటుంది. ఆశ్చర్యపోతుంటాడు రాజ్. తప్పదు అని తరుముతుంటుంది భార్య. అడ్మిషన్ ఫారాల కోసం క్యూలో నిలబడ్డం.. మంచి ఇంగ్లిష్ కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లడం.. అనే పరీక్షలను ఎదుర్కొ్కంటారు ఆ దంపతులు. అయినా తమ గారాల పట్టికి టాప్ స్కూల్లో సీట్ దొరకదు. నిరాశ చెందుతున్న సమయంలో సోకాల్డ్ ఓ మంచి స్కూల్లో గరీబ్కోటాలో సీట్లు ఉంటాయని తెలుస్తుంది. కొంతమంది ధనవంతులు ఆ గరీబ్కోటాలో తమ బిడ్డను చేర్పించడం కోసం పేదవాళ్లుగా నటించి గరీబు పిల్లల సీట్‌ను కాజేస్తున్నారని యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తుందీ విషయంలో. గరీబ్ బస్తీలకు వెళ్లి ఎంక్వయిరీ చేసి మరీ గీరబ్ కోటా సీట్‌ను కేటాయిస్తుందనే సమాచారం అందుతుంది రాజ్ కపుల్‌కి. తక్షణమే వసంత్ విహార్ నుంచి స్లమ్‌కి వచ్చేస్తారు. జీవితం అర్థమవుతుంది..: దోమలు, ఎలుకలతో కుస్తీ పట్టలేక.. దోస్తీ కూడా చేయలేక నిద్రలేని రాత్రులను గడుపుతుంటుంది ఆ కుటుంబం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా.. కనీస అవసరాలైన నీళ్లు, కరెంట్, బాత్రూమ్ వంటి వాటికి ఆ జనం ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్లారా చూస్తారు. డబ్బులు ఉండీ ఖర్చుపెట్టలేని కర్మను కలిగించిన గరీబ్ కోటాను మనసులో తిట్టుకుంటూ.. వెంటనే సీట్ అనే వరాన్నిచ్చే అదే కోటాను ప్రార్థించుకుంటూ గడుపుతుంటారు. అంతలోకే ఎంక్వయిరీకి వస్తారు స్కూల్ సిబ్బంది. రాజ్ అండ్ ఫ్యామిలీని చూస్తే సిబ్బందికి అనుమానం వస్తుంది వాళ్లు పేదవాళ్లు కాదేమోనని. ఆ ఇంటి పక్కనే శ్యామ్ ప్రకాష్ (దీపక్ దోబ్రియాల్) అనే కూలీ కుటుంబమూ ఉంటుంది. ‘‘వాళ్లు నిజంగానే గరీబులు’’ అని స్కూల్ వాళ్లను నమ్మిస్తాడు శ్యామ్. సీట్ వచ్చాక స్కూల్ ఫీ కోసం రాజ్ ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తుంటే చూసి ‘‘అయ్యో డబ్బుల్లేక దొంగతనం చేస్తున్నావా.. తప్పు’’ అని అతనిని ఆపి, ఓ కార్ కిందకు వెళ్లి గాయాలు చేసుకుంటాడు. ఆ గాయం కింద కారు ఓనర్ దగ్గర పాతికవేలు డిమాండ్ చేసి మరీ రాజ్‌కి ఇస్తాడు శ్యామ్ ప్రకాష్. అయితే ఆ స్కూల్లో తన కొడుక్కోసమూ దరఖాస్తు చేస్తాడు శ్యామ్ గరీబ్ కోటాలో. చివరకు అతని కొడుకు స్థానంలోనే తన రాజ్ కూతురికి సీట్ ఖాయం అవుతుంది.ఇది రాజ్, అతని భార్యకు మాత్రమే తెలుసు. తెలియని శ్యామ్ తమను మంచివాళ్లుగా నమ్ముతూ సహాయంగా ఉండడం రాజ్‌కు గిల్ట్‌గా అనిపిస్తుంటుంది. కార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్‌తో చాలా బాధపడ్తాడు. మోసం చేస్తున్నానే భావన అతనిని నిలవనివ్వదు. సీట్ ఖాయం కావడంతో మళ్లీ తమ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకోవైపు శ్యామ్ ప్రకాష్ తన కొడుకును గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాడు. శ్యామ్ ప్రకాష్ కొడుకు చదువుతున్న ఆ స్కూల్ ఏదో తెల్సుకొని దానికి ఆర్థిక సహాయం చేస్తాడు రాజ్. ఆ స్కూల్ బాగవుతుంది. పేద పిల్లలకు విద్యాభిక్ష పెట్టిన ఆ వ్యక్తిని కలుసుకోవాలని అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళ్తాడు శ్యామ్. చూస్తే రాజ్. అవాక్కవుతాడు శ్యామ్. అప్పుడు తెలుస్తుంది తన కొడుకు సీట్ లాక్కుంది అతనే అని. మోసం చేశావని తిడ్తాడు శ్యామ్. కోపంగా వెళ్లిపోతాడు. ఆఖరికి ఓ డ్రమటిక్ సన్నివేశంతో తన కూతురినీ అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాడు రాజ్. అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది ఆ జంట. ఆద్యంతం హాస్యంతో మన విద్యావ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ల మీద విసిరిన వ్యంగ్యాస్త్రం ఈ చిత్రం. ముగింపు: భాష.. భావప్రకటనా సాధనం. మాతృభాష.. ఆ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. నచ్చినట్టు బతికే అవకాశాన్ని కల్పిస్తుంది. కుల,మత, కలిమి,లేముల వర్గ సమాజాన్ని సమసమాజంగా మారుస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పరభాషా పరిజ్ఞానం అవసరమే. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష మరీ అవసరం అని చూపించే సినిమా! ఏబీసీడీల సూప్ కన్నా అఆఇఈల గంజే అమృతం అని చెప్తుంది హిందీ మీడియం. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ అమేజాన్ ప్రైమ్‌లో దొరుకుతుంది. -
ఐ లవ్ సల్మాన్‌ఖాన్ అని క్లారిటీ ఇచ్చిన నటి
ముంబయి: తాను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఎంతో ప్రేమిస్తానని పాకిస్థాన్ ప్రముఖ నటి సబా ఖమర్ చెప్పింది. ఆయనంటే తనకు చాలా గౌరవం అని కూడా తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, హృతిక్ రోషన్, రితేశ్ దేశ్ముఖ్లాంటివారిని కించపరుస్తూ తొలుత ఓ వీడియోలో కనిపించిన ఈ అమ్మడిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది. దీంతో వెంటనే ఆమె దిద్దుబాటుచర్యలకు దిగింది. ‘గుడ్ మార్నింగ్ జిందగీ అనేది ఒక ఫన్నీ కార్యక్రమం. అందులో బాలీవుడ్ స్టార్ల గురించి అడిగేవన్నీ కూడా చాలా ఫన్నీ ప్రశ్నలే. ఒక్కో నటుడి గురించి నేను చెప్పినవన్నీ కూడా చాలా సరదాగా చెప్పిన సమాధానాలు.. ఆ సందర్భానికి తగినవి. నేను భారతీయ సినిమా పరిశ్రమలో ఎక్కువగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఆయన చాలా పెద్ద నటుడు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, అంతకుముందు ఓ కార్యక్రమంలోని వీడియోలో మాట్లాడిన ఆమె సల్మాన్ ఒక చిచ్చోరా(చీప్ పర్సన్) అనడమే కాకుండా ఆయన డ్యాన్సింగ్ స్టైల్‌పై కూడా కామెంట్లు చేసింది. ఇలాగే, మిగితా బాలీవుడ్ నటులను కూడా కించపరిచేలా మాట్లాడి తన అసలు ఉద్దేశం వేరని జవాబిచ్చింది. -
‘మా సినిమాలో ఆమె నటించలేదు’
ముంబై: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తాజా సినిమా ‘శివాయ్’లో పాకిస్థాన్ నటి సాబా ఖామర్ లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సాబా నటించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘శివాయ్’ తరపు అధికార ప్రతినిధి వివరణయిచ్చారు. సాబా ఖామర్, మరేతర పాకిస్థాన్ నటులు తమ సినిమాలో లేరని ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మన్నెస్) హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ నటులు భారత సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. అజయ్ దేవగన్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘శివాయ్’ అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ అజయ్ దేవగన్ సరసన నటించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం అతడు చాలా సాహసాలు చేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి
న్యూఢిల్లీ: బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి రానుంది. ఇమ్రాన్ ఖాన్ హీరోగా దినేష్ విజన్, భూషణ్ కుమార్ నిర్మించే సినిమాకి పాక్ నటి సబా కమర్ ని ఎంపిక చేశారు. ఆగస్టులో ప్రారంభంకానున్న ఈ సినిమాకు సాకేత్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. సాకేత్ 'ప్యార్ కీ సైడ్ ఎఫెక్ట్', 'షాదీకీ సైడ్ ఎఫెక్ట్' సినిమాలకి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ లో వీణా మాలిక్, మహిరా ఖాన్ లతో సహా 20 మందికి పైగా పాకిస్తాన్ కు చెందిన నటీనటులు ఉన్నారు. 'మాంటో' నిసిమాలో 'నూర్' పాత్రలో సబా కమర్ నటనకి విశేష ఆదరణ లభించింది.