
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పాకిస్తాన్ నటి సబా కమర్ తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంటర్‌ప్రెన్యూర్, బ్లాగర్ అజీమ్ ఖాన్‌తో తన జీవితాన్ని పంచుకోవడం లేదని వెల్లడించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను షేర్ చేసింది.
"అనేక వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్‌తో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నాను. మేము పెళ్లి చేసుకోవడం లేదు. నా నిర్ణయానికి మీరందరూ మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నా. ఇది నాకు చాలా క్లిష్టమైన సమయం.. కానీ, ఇలాంటి రోజులు కూడా కాలక్రమంలో త్వరగానే కనుమరుగైపోతాయి. ఏదేమైనా కొన్ని చేదు నిజాలను నేను త్వరగానే తెలుసుకున్నానుకుంటున్నాను. మరో ముఖ్య విషయమేంటంటే.. నా లైఫ్‌లో ఇప్పటివరకు అజీమ్ ఖాన్‌ను నేరుగా ఒక్కసారి కూడా కలవలేదు. కేవలం ఫోన్ ద్వారానే మాట్లాడుకునేవాళ్లం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ లేఖపై స్పందించిన అజీమ్ ఇలా అర్ధాంతరంగా విడిపోవడానికి తనే కారణమని పేర్కొన్నాడు. ఎంతో మంచి మనసు ఉన్న సబా మున్ముందు కూడా సంతోషంగా ఉండాలని, ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.
కాగా సబా, అజీమ్‌లు వారి నిశ్చితార్థాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే అజీమ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో తానే తప్పు చేయలేదంటూ అతడు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. 'నీ మీద నాకు నమ్మకం ఉంది' అంటూ సబా దానికి రిప్లై కూడా ఇచ్చింది. కానీ కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం. సబా కమర్ బాలీవుడ్‌లో 'హిందీ మీడియం' సినిమాలో నటించింది.
చదవండి: ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు+ ప్రైమ్ వోచర్+ కొత్త సినిమా టికెట్ డబ్బులు
Comments
Please login to add a commentAdd a comment