ఇంత అవమానమా.. వెక్కివెక్కి ఏడ్చిన నటి! | Actress Saba Qamar Breaks Down On TV | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 9:31 AM | Last Updated on Thu, Jan 18 2018 12:21 PM

Actress Saba Qamar Breaks Down On TV - Sakshi

ఇటీవల ఇర్ఫాన్‌ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌ సినిమా ’హిందీ మీడియం’లో నటించిన సబా కమర్‌ తాజాగా వెక్కివెక్కి ఏడ్చారు. ఒక పాకిస్థానీ అయినందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలో తాను ఏ రకంగా అవమానాలు ఎదుర్కొన్నది వెల్లడించారు. కేవలం పాకిస్థానీ కావడం వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎదుర్కొంటున్న కఠినమైన తనిఖీలు, ప్రశ్నల గురించి ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. సబా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమె ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.

‘హిందీ మీడియం’ సినిమాలో ఇర్ఫాన్‌ ఖాన్‌, సబా కమర్‌ జోడీతో పాట షూట్‌ చేసేందుకు జార్జియాలోని తబ్లిసికి వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ‘పాకిస్థాన్‌లో ఉండి మనం పాకిస్థాన్‌ జిందాబాద్‌. పాకిస్థాన్‌ జై అంటూ ఎన్నో నినాదాలు చేస్తాం. కానీ మనం బయటకు వెళ్లినప్పుడు మన పట్ల జరిగే తనిఖీలు ఎంత దారుణంగా ఉంటాయో నేను చెప్పలేను. ఎంతో అవమానకరంగా ఈ తనిఖీలు జరుపుతారు. భారతీయ చిత్రయూనిట్‌తో షూటింగ్‌ కోసం మేం తబ్లిసీ వెళ్లినప్పుడు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తుంది.

భారతీయ చిత్రయూనిట్‌ మొత్తం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయింది. కానీ, నన్ను మాత్రం అదుపులోకి తీసుకొని ప్రశ్నించి.. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత అధికారులు పంపించారు. నేను పాకిస్థానీని అనే ఒకే ఒక్క కారణంతో ఇంతగా అవమానించారు. బయట మనకు ఈ పరిస్థితి ఉందా? అన్న విషయం ఆ రోజు నాకు తెలిసింది’అంటూ ఎంతో భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటా సబా అన్నారు. 49 సెకన్లు ఉన్న ఆమె ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

‘హిందీ మీడియం’లో ఇర్ఫాన్‌ ఖాన్‌, సబా కమర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement