‘మా సినిమాలో ఆమె నటించలేదు’ | 'Shivaay' makers deny featuring Pakistani actress | Sakshi
Sakshi News home page

‘మా సినిమాలో ఆమె నటించలేదు’

Published Fri, Sep 30 2016 3:23 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

‘మా సినిమాలో ఆమె నటించలేదు’ - Sakshi

‘మా సినిమాలో ఆమె నటించలేదు’

ముంబై: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తాజా సినిమా ‘శివాయ్’లో పాకిస్థాన్ నటి సాబా ఖామర్ లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సాబా నటించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘శివాయ్’  తరపు అధికార ప్రతినిధి వివరణయిచ్చారు. సాబా ఖామర్, మరేతర పాకిస్థాన్ నటులు తమ సినిమాలో లేరని ఒక ప్రకటనలో తెలిపారు.

పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మన్నెస్) హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ నటులు భారత సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలని ఇండియన్ మోషన్ పిక్చర్స్  ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు.

అజయ్ దేవగన్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘శివాయ్’  అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ అజయ్ దేవగన్ సరసన నటించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం అతడు చాలా సాహసాలు చేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement