
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు గడిచినా మోదీ ఇంకా రియలైజ్ కాలేదని, ఆయన కళ్లుతెరవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన ఎంపీ మనీషా కాయండే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగానే ప్రజలు మోదీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ‘మీ నుంచి ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కాద’ని ఆమె అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘మోదీ మంచి మాటకారి. కానీ పార్లమెంట్‌లో ఆయన ఈరోజు చేసిన ప్రసంగం అర్ధసత్యాలు, వక్రీకరణలతో సాగింద’ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు.