లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామంటూ బీజేపీ చెప్పడం ఒక జోక్ అని అన్నారు. కాషాయ పార్టీకి 300 సీట్లు రావడం ఆసాధ్యమని, కనీసం 200 స్థానాల్లో గెలవడం కూడా సవాలేనని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికే తన ఓటమిని అంగీకరించిందన్నారు.
ఈ మేరకు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని చెప్పారు. మొత్తంగా దక్షిణ భారత్‌లో 2019 ఫలితాల కంటే దారుణంగా ఫెయిల్ అవుతుందని చెప్పారు.
కాగా గత నెల 26న పోలింగ్ జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో శశిథరూర్ తిరువనంతపురం స్థానం నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ నుంచి పీ రవీంద్రన్ పోటీ పడుతున్నారు. తిరువనంతపరంలో తన గెలుపు చాలా సులువగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఇక గత మూడుసార్లు ఆయన తిరువనంతపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిస్తే నాలుగో సారి వరుసగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పటి వరకు 190 స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయని, వాటిల్లో ఎక్కువ శాతం తమకే అనుకూల ఫలితాలు వెలుబడే ఛాన్సు ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment