పూణే : వ్యవసాయ రుణాల మాఫీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ దుయ్యబట్టారు. సంపూర్ణ రుణ మాఫీని వాగ్ధానం చేసిన ఠాక్రే ఇప్పుడు కేవలం రూ 2 లక్షల వరకే మాఫీని ప్రకటించారని విమర్శించారు. ఏ విషయానికైనా కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసని, ప్రకటన చేయడం అమలుపరచడానికి వ్యత్యాసం ఏంటో ఇప్పుడు ఠాక్రేకు అవగతమైందని పాటిల్ ఎద్దేవా చేశారు. ఇక నుంచి యూటర్న్ అంటే ఉద్ధవ్ ఠాక్రే అని ఆయన అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment