సాక్షి, ముంబై : వలస కూలీల వ్యవహారంలో బీజేపీ తీరును శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్ దుయ్యబట్టింది. వలస కూలీల దురవస్ధను 1990 ప్రాంతంలో జమ్ము కశ్మీర్‌లోని పండిట్‌ల దుస్ధితితో సేన ఎంపీ సంజయ్ రౌత్ పోల్చారు. యూపీలో వలస కూలీలను సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రౌత్ ఆరోపించారు.
దేశీయ విమాన సర్వీసులు అప్పుడే వద్దు
కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో మే 31 తర్వాత లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశీయ విమాన సర్వీసులను అప్పుడే ప్రారంభించడం సరైంది కాదని, దీనికి సిద్ధమయ్యేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఠాక్రే కేంద్రాన్ని కోరారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో తాను ఈ విషయమై మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు.
రాబోయే 15 రోజులు మహమ్మారి కట్టడిలో కీలకమైనవని ఇప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తివేయరాదని అన్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో మహారాష్ట్ర ఏకీభించని క్రమంలో అనిశ్చితి నెలకొంది.
చదవండి : న్యాప్కిన్స్‌పై ఠాక్రే ఫోటో : సేనపై ఎంఎన్‌ఎస్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment