'పిల్లల్ని ఎందుకు తీసుకెళుతున్నారు?' | If you want to protest why children are taken: Mehbooba Mufti | Sakshi
Sakshi News home page

'పిల్లల్ని ఎందుకు తీసుకెళుతున్నారు?'

Published Mon, Aug 22 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

'పిల్లల్ని ఎందుకు తీసుకెళుతున్నారు?'

'పిల్లల్ని ఎందుకు తీసుకెళుతున్నారు?'

జమ్మూకశ్మీర్ లో హింసకు పాల్పడుతున్నవారు కశ్మీరీలు కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో హింసకు పాల్పడుతున్నవారు కశ్మీరీలు కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరిస్తున్న జమ్మూ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఆందోళనలకు దిగినప్పుడు పెద్దవాళ్లు తమ వెంట ఎందుకు పిల్లల్ని తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారు. పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్లపై ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి వారు అల్లరిమూకల మధ్య భావోద్వేగాలు సృష్టించి తర్వాత పారిపోతున్నారని ఆరోపించారు.

కశ్మీర్ ప్రతిపక్ష నాయకుల బృందం ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ భేటీల వల్ల సమస్య పరిష్కారమైతే మంచిదేనని ముఫ్తీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement