'బంతి ఆమె కోర్టులోనే ఉంది'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందడగు పడింది. పీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన మెహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురవుతున్న అడ్డంకులపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
కాగా, సంకీర్ణ ఎజెండాకు అనుగుణంగా కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ గుర్తుంచుకోవాలని, బంతి ఆమె కోర్టులోనే ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు. అయితే పీడీపీ కొత్తగా పెట్టిన డిమాండ్లను అంగీకరించేది లేదని బీజేపీ గతవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పీడీపీ సీనియర్ నేతలతో కలిసి మెహబూబా సోమవారం ఢిల్లీకి వచ్చారు.