kashmir govt formation
-
ఉగ్రవాదానికి కారణం నెహ్రూనే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం, రాజకీయ సమస్యలకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూయే కారణమని శుక్రవారం లోక్‌సభలో హోం మంత్రి అమిత్ షా నిందించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. హోం మంత్రి అయ్యాక తొలిసారిగా అమిత్ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రణాళిక ప్రకటిస్తే, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, పారదర్శక విధానాల్లో పోలింగ్ జరుగుతుందని అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) 2019 బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రపతి పాలన పొడిగింపుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, ఆ భావజాలాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదనీ, ఉగ్రవాదమే లేని, సరిహద్దుల్లో భద్రమైన దేశంగా భారత్‌ను మార్చడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. ‘కశ్మీర్లో మూడింట ఒక వంతు భాగం ఈ రోజు మన దగ్గర లేదు. స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్లోకి పాకిస్తాన్ చొరబడి, మూడింట ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత కాల్పుల విరమణను ప్రకటించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూయే ఆ ప్రకటన చేశారు. ఆక్రమించిన భాగం పాకిస్తాన్ వశమైంది. నాటి ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ మాటను కూడా అప్పుడు నెహ్రూ పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. అదే ఆనాడు పటేల్ చెప్పిన మాటను నెహ్రూ పరిశీలించి, ఆయన చెప్పినట్లు విని ఉంటే ఇప్పటి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన చేతుల్లోనే ఉండేదనీ, ఆ ప్రాంతంలో అసలు ఉగ్రవాదమే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో షా స్పందిస్తూ, తాను నెహ్రూ పేరును పలకననీ, అయితే కశ్మీర్ సమస్యకు కారణం తొలి ప్రధానేనని చెప్పడంలో మాత్రం తనకు ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు. -
‘ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’
శ్రీనగర్ : గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను శ్రీనగర్‌లో ఉన్నందున గవర్నర్‌ను ప్రత్యక్షంగా కలవలేకపోతున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోట ఫ్యాక్స్ పనిచేయనందున ఈ మెయిల్ ద్వారా లేఖను పంపిస్తానని తెలిపారు. కాగా పీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఫ్తీ ముందుకొచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. Have been trying to send this letter to Rajbhavan. Strangely the fax is not received. Tried to contact HE Governor on phone. Not available. Hope you see it @jandkgovernor pic.twitter.com/wpsMx6HTa8 — Mehbooba Mufti (@MehboobaMufti) November 21, 2018 -
'బంతి ఆమె కోర్టులోనే ఉంది'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందడగు పడింది. పీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన మెహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురవుతున్న అడ్డంకులపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. కాగా, సంకీర్ణ ఎజెండాకు అనుగుణంగా కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ గుర్తుంచుకోవాలని, బంతి ఆమె కోర్టులోనే ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు. అయితే పీడీపీ కొత్తగా పెట్టిన డిమాండ్లను అంగీకరించేది లేదని బీజేపీ గతవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పీడీపీ సీనియర్ నేతలతో కలిసి మెహబూబా సోమవారం ఢిల్లీకి వచ్చారు.