
'వారి భాగస్వామ్యం పెళ్లిలాంటిదేమీ కాదు'
జమ్మూ: జమ్మూ-కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ-పీడీపీల మధ్య ఏదొక వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా ఆ పార్టీల భాగస్వామ్యంపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-పీడీపీల సంకీర్ణం పెళ్లిలాంటిదేమీ కాదంటూ ఆ పార్టీల భాగస్వామ్యంపై పెదవి విరిచారు. కోట్ల మంది నరేంద్ర మోదీని ఎన్నుకున్నా.. మోదీని బీజేపీ కురు వృద్ధుడు వాజ్ పేయితో పోల్చలేమన్నారు. వేర్పాటువాది అలంను కోర్టు ఉత్తర్వులు ప్రకారమే విడిచిపెట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో ఎటువంటి పొరపాటు ఏముందని ప్రశ్నించారు.
జమ్మూ-కశ్మీర్ లను ఒక్క తాటిపైకి తేవడమే తమ సంకల్పమని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఇస్లాం పేరుతో అహింసకు పాల్పడేవారికి తాము వ్యతిరేకమని.. తుపాకీ ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు.