Masarat Alam
-
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(ఎంఏ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్‌కు మసరత్ చైర్మన్‌గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్‌ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్‌చేసి జైలులో పడేశారు. -
మళ్లీ జైలుకు మసరత్ ఆలం
శ్రీనగర్: వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్‌ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఆలంపై గురువారం కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వెంటనే, కశ్మీర్‌లోయ నుంచి తరలించి జమ్మూ జైలుకు పంపించారు. ఆలం అరెస్ట్‌కు నిరసనగా హురియత్ కాన్ఫెరెన్స్ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. -
మసరత్ ఆలం అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు
-
మసరత్ ఆలమ్ అరెస్టు
-
వేర్పాటువాద నేత మస్రత్ ఆలం అరెస్టు
శ్రీనగర్: వేర్పాటువాద నేత మస్రత్ అలంను కశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం మరోసారి అరెస్టు చేసింది. శ్రీనగర్‌లో ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్రత్ అలం పాక్ జెండాను ఊపుతూ, ఆ దేశానికి అనుకూలంగా నినాదాలుచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆలం అరెస్టుకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం అలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు ఇలాంటి వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసనీ, ఉపేక్షించే ప్రశ్నే లేదని, పరిస్థితిని కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. కాగా సైన్యం అదుపులో ఉన్న యువకుని మరణానికి నిరసనగా శుక్రవారం ర్యాలీకి సన్నద్దమవుతున్నారనే వార్తలతో గురువారం అలం, సయ్యద్ అలీషా గిలానీలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవల వేర్పాటువాద నేత మస్రత్ జైలు నుంచి విడుదలైనపుడు భారీ ర్యాలీతో స్వాగతం చెప్పారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో వివాదం రగిలిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మస్రత్ అలీ విడుదలపై గుర్రుగా ఉన్నబీజేపీ ఈర్యాలీ ఉదంతంపై మరింత మండిపడింది. -
పోలీసుల అదుపులో వేర్పాటువాదులు
శ్రీనగర్: ఇద్దరు కాశ్మీర్ వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్-లో అనుమానిత ఉగ్రవాదుల అలికిడి సమాచారం తెలుసుకున్న సైన్యం, మరికొందరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిద్దరు కూడా పుల్వామా జిల్లాలోని ట్రాల్ అనే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించింది. వీరిని సైన్యం హత మార్చిన అనంతరం ట్రాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బారీగా బలగాలు మోహరించాయి. అదే సమయంలో అటువైపు వచ్చిన కాశ్మీర్ వేర్పాటు వాదులైన మహ్మద్ యాసిన్ మాలిక్, మస్రత్ అలాం భట్ పుల్వామా జిల్లా వైపే వెళుతుండగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారిని అవంతిపురా వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరు కరడుగట్టిన కాశ్మీర్ వేర్పాటు వాదులు. ఇదిలా ఉండగా, సైన్యం అమాయకులను పొట్టన పెట్టుకుందని ఆందోళన వ్యక్తం ట్రాల్ ప్రాంతంలో పలువురు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైనికుడి చేతిలోని ఏకే 47 తుపాకీని దొంగిలించినట్లు అధికారులు చెప్తున్నారు. -
'వారి భాగస్వామ్యం పెళ్లిలాంటిదేమీ కాదు'
జమ్మూ: జమ్మూ-కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ-పీడీపీల మధ్య ఏదొక వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా ఆ పార్టీల భాగస్వామ్యంపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-పీడీపీల సంకీర్ణం పెళ్లిలాంటిదేమీ కాదంటూ ఆ పార్టీల భాగస్వామ్యంపై పెదవి విరిచారు. కోట్ల మంది నరేంద్ర మోదీని ఎన్నుకున్నా.. మోదీని బీజేపీ కురు వృద్ధుడు వాజ్ పేయితో పోల్చలేమన్నారు. వేర్పాటువాది అలంను కోర్టు ఉత్తర్వులు ప్రకారమే విడిచిపెట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో ఎటువంటి పొరపాటు ఏముందని ప్రశ్నించారు. జమ్మూ-కశ్మీర్ లను ఒక్క తాటిపైకి తేవడమే తమ సంకల్పమని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఇస్లాం పేరుతో అహింసకు పాల్పడేవారికి తాము వ్యతిరేకమని.. తుపాకీ ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. -
ఆ భాగస్వామ్యం మాకు ముఖ్యం కాదు!
ఘజియాబాద్:కశ్మీర్ వేర్పాటువాద నేత, ముస్లింలీగ్ నాయకుడు మసరత్ అలంను ప్రభుత్వం విడుదల చేయడంపై జమ్మూ కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరి పాకాన పడుతున్నాయి. కశ్మీర్ ప్రభుత్వ చర్య తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు అక్కడి ప్రభుత్వంతో భాగస్వామ్యం కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ సామాజిక భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పానని, మరోసారి దానికే కట్టుబడి ఉన్నానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-పీడీపీల మధ్య భిన్నమైన వాతావరణం నెలకొనడంతో వారి భాగస్వామ్యం కడవరకూ కొనసాగుతుందా?అనేది పలు సందేహాలకు తావిస్తోంది. -
మసరత్ అలాం తీవ్రవాది.. రాజకీయ ఖైదీ కాదు
కాన్పూర్: ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నేత మసరత్ అలాం ఒక తీవ్రవాది అని, అతడు రాజకీయ ఖైదీ అనిపించుకోడని బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి అన్నారు. అతడిని పట్టించినవారికి పదిలక్షలు ఇస్తామని అవార్డు కూడా గతంలో ప్రకటించినట్లు తెలిపారు. అలాం ఒక నేరస్తుడని, ప్రత్యేకవాదని, తీవ్రవాదని ఆయన మండిపడ్డారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగానే అలాంను విడుదల చేసినట్లు పీడీపీ ప్రకటించడంతో ఆయన ఈ మేరకు స్పందించారు. విశ్వహిందు పరిషత్ కాన్పూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అలాం ఎప్పటికీ రాజకీయ ఖైదీ అనిపించుకోడని తమను సంప్రదించకుండానే జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. -
ఆలం విడుదలపై మాకు సమాచారం లేదు: మోదీ
-
ఆలం విడుదలపై మాకు సమాచారం లేదు: మోదీ
న్యూఢిల్లీ : వేర్పాటువాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆలం విడుదలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ప్రధాని సభలో వివరణ ఇచ్చారు. ఆలం విడుదలపై సభ్యుల ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆలం విడుదలపై కేంద్రానికి సమాచారం లేదన్నారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులకు కూడా సమాచారం లేదన్నారు. ఈ ఘటనపై వివరణలు వచ్చిన తర్వాత సభకు తెలియచేస్తామన్నారు. -
పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే
శ్రీనగర్: జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే హుర్రియత్ కాన్ఫరెన్స్ నేత, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ అలం జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఆ మార్పు తామన్న తీసుకురావాలి లేదంటే ప్రజలన్న తీసుకురావాలి అని చెప్పారు. తాను జైలు నుంచి విడుదల కావడం పెద్ద విషయమేమి కాదని గతంలో కూడా పలుమార్లు జైలుకు వెళ్లానని, చిన్నతనంనుంచి తాను జైలులోనే ఎక్కువగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు మూడుసార్లు బెయిల్ లభించిందని అన్నారు. మేం చేయదలుచుకున్న అంశాలపై చట్టం ద్వారా ముందుకు వెళతామని, ప్రస్తుతం తాను తన కుటుంబంతో గడపాలనుకుంటున్నానని వివరించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బారాముల్లా జైలులో 2010లో వేశారు.