పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే | Changing govt doesn't change ground reality in J&K: Masarat Alam | Sakshi
Sakshi News home page

పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే

Published Sun, Mar 8 2015 3:39 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే

పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే

శ్రీనగర్: జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే హుర్రియత్ కాన్ఫరెన్స్ నేత, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ అలం జమ్మూకశ్మీర్లో ఏర్పడిన పీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఆ మార్పు తామన్న తీసుకురావాలి లేదంటే ప్రజలన్న తీసుకురావాలి అని చెప్పారు.

 

తాను జైలు నుంచి విడుదల కావడం పెద్ద విషయమేమి కాదని గతంలో కూడా పలుమార్లు జైలుకు వెళ్లానని,  చిన్నతనంనుంచి తాను జైలులోనే ఎక్కువగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు మూడుసార్లు బెయిల్ లభించిందని అన్నారు. మేం చేయదలుచుకున్న అంశాలపై చట్టం ద్వారా ముందుకు వెళతామని, ప్రస్తుతం తాను తన కుటుంబంతో గడపాలనుకుంటున్నానని వివరించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బారాముల్లా జైలులో 2010లో వేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement