Jammu kasmir
-
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య
-
కశ్మీర్‌పై గవర్నర్ వివాదాస్పద ట్వీట్
సాక్షి, శ్రీనగర్ : రెండేళ్ల పాటు దేశ ప్రజలు ఎవరూ కశ్మీర్ వెళ్లొద్దని ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చేసిన ట్వీట్‌ను సమర్ధించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారి తన ట్వీట్లో ‘రెండేళ్ళ పాటు భారతీయులు ఎవరూ కశ్మీర్ వెళ్ళొద్దు.. అమర్నాథ్కు వెళ్ళొద్దు.. కశ్మీర్ ఎంపోరియం నుంచి కశ్మీరీ వర్తకుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయొద్దు’. అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ రిటైర్డ్ అధికారిని సమర్థిస్తూ తథాగత రాయ్ ట్వీట్ చేశారు. ఇక గవర్నర్ తీరుపై నెటిజన్లతో పాటూ కశ్మీరీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉండి ఇలాంటి ట్వీట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరుల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తథాగత రాయ్‌పై మండిపడ్డారు. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. తథాగత రాయ్ వంటి వ్యక్తులు కశ్మీరీలు లేని కశ్మీర్ కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. An appeal from a retired colonel of the Indian Army: Don’t visit Kashmir,don’t go to Amarnath for the next 2 years. Don’t buy articles from Kashmir emporia or Kashmiri tradesman who come every winter. Boycott everything Kashmiri. I am inclined to agree — Tathagata Roy (@tathagata2) February 19, 2019 Deplorable statement coming from the Governor of Meghalaya. GoI must sack him immediately . If they fail to do so, it means he has their tacit approval and are using it as an election ploy to polarise the situation. https://t.co/AQE0e1akUH — Mehbooba Mufti (@MehboobaMufti) February 19, 2019 People like Tathagata want Kashmir but without Kashmiris. They’d sooner see us driven in to the sea. He’ll be best placed to know he can’t have one without the other so what’s it to be? https://t.co/BS1zAG78Xx — Omar Abdullah (@OmarAbdullah) February 19, 2019 -
ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి
-
జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆందోళన కారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళన కారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
పీడీపీ-బీజేపీవల్ల కాదు.. మేం మార్చాల్సిందే
శ్రీనగర్: జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే హుర్రియత్ కాన్ఫరెన్స్ నేత, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ అలం జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఆ మార్పు తామన్న తీసుకురావాలి లేదంటే ప్రజలన్న తీసుకురావాలి అని చెప్పారు. తాను జైలు నుంచి విడుదల కావడం పెద్ద విషయమేమి కాదని గతంలో కూడా పలుమార్లు జైలుకు వెళ్లానని, చిన్నతనంనుంచి తాను జైలులోనే ఎక్కువగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు మూడుసార్లు బెయిల్ లభించిందని అన్నారు. మేం చేయదలుచుకున్న అంశాలపై చట్టం ద్వారా ముందుకు వెళతామని, ప్రస్తుతం తాను తన కుటుంబంతో గడపాలనుకుంటున్నానని వివరించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బారాముల్లా జైలులో 2010లో వేశారు. -
కాశ్మీర్లో చురుగ్గా సహాయ చర్యలు
* వరద తగ్గుముఖం, 1.30 లక్షల మందిని కాపాడిన సైన్యం * భారీగా ఆహార పదార్థాలు, సామగ్రి పంపిణీ * విరాళాలిచ్చి ఆదుకోవాలని దేశప్రజలకు ప్రధాని విజ్ఞప్తి శ్రీనగర్/న్యూఢిల్లీ: వరద విలయంలో చిక్కుకున్న జమ్మూకాశ్మీర్‌లో సహాయ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. 11 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం నాటికి 1.30 లక్షల మంది బాధితులను సైన్యం రక్షించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు(ఎన్డీఆర్ఎఫ్) కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. వైమానికదళానికి చెందిన 89 రవాణా విమానాలు, హెలికాప్టర్లను సైన్యం వినియోగిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దాదాపు 30 వేల మంది సైనికులు నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనగర్ ప్రాంతంలోనే 21 వేల మంది సేవలందిస్తున్నారు. కాగా, భారీ వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌ను ఆదుకునేందుకు దేశ ప్రజలంతా విరాళాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కాశ్మీర్లో ప్రస్తుతం వేర్పాటువాదులను పట్టించుకోవటం లేదని, సహాయ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి సారించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్లో 1200 గ్రామాలు, జమ్మూలో 1100 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని, దాదాపు 400 గ్రామాలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయన్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం వద్ద రూ. 1100 కోట్ల నిధులు ఉన్నాయని, ఇందులో 90 శాతం నిధులను కేంద్రమే అందించిందని తెలిపారు. బాధితులకు రూ. 200 కోట్ల సాయం జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 200 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తులో మృతుల కుటుంబ సభ్యులకు కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. సహాయ కార్యక్రమాలు - 31,500 ఆహార పొట్లాలు, 533 టన్నుల ఆహార పదార్థాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో జారవిడిచారు. 8200 దుప్పట్లు, వెయ్యి టెంట్లను సరఫరా చేశారు. - 80 వరకు సైనిక దళాల వైద్య బృందాలు కూడా సేవల్లో నిమగ్నమయ్యాయి. నాలుగు ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 21,500 మందికి చికిత్స అందించారు. 19 టన్నుల మందులను ఢిల్లీ నుంచి తరలించారు. - 13 టన్నుల నీటిని శుద్ధి చేసే టాబ్లెట్లు, 6 జల శుద్ధి ప్లాంట్లు శ్రీనగర్ చేరుకున్నాయి. - నౌకాదళ కమాండోల మూడో దళం కూడా రంగంలోకి దిగింది. 224 ఆర్మీ బోట్లను, 148 ఎన్డీఆర్ఎఫ్ పడవలను సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. తక్షణం ఆదుకోండి: సుప్రీం జమ్మూకాశ్మీర్‌లో వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సహాయ చర్యల సమన్వయం కోసం ఒక కేంద్రీకృత ఏజెన్సీని ఏర్పాటుచేసే విషయం ఆలోచించాలని కోరింది. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చేపట్టిన చర్యల వివరాలను సోమవారం తమకు అందజేయాలంది. జమ్మూకాశ్మీర్ వరదల విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్న కేంద్రప్రభుత్వ వాదనను పక్కనబెడుతూ.. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తెలుగువారిని రక్షించండి జమ్మూకాశ్మీరులోని వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె. రామ్మోహనరావు ప్రధాని కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కోరారు. నిట్ విద్యార్ధులతో పాటు 120 మంది తెలుగువా రు ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నారన్నారు. -
చేతనైనంత సాయం చేద్దాం!
న్యూఢిల్లీ: వరదల కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన కాశ్మీరీల కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విరాళాల సేకరణ ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థ కేర్ ఇండియాతో కలిసి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకేవారి కోసం కేర్ ఇండియాకు సంబంధించిన ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హాయ్.. నేను మీ కునాల్ కపూర్‌ను..! కాశ్మీర్ వరదల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. అక్కడి భీకర పరిస్థితిని మీడియా కళ్లకుగట్టినట్లు చూపించింది. ఇప్పటిదాకా 215 మంది మరణించారట. వేలాదిమంది సర్వస్వాన్ని కోల్పోయారట. ఈ దృశ్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే కాశ్మీరీల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే. అందుకే అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాతో చేతులు కలపండి. కాశ్మీరీల సహాయం కోసం విరాళాలు సేకరిద్దాం. దేశ ప్రజలుగా వారికి మనమందరం ఉన్నామనే భరోసా కల్పిద్దాం. అందుకోసం చేతనైనంత సాయం చేద్దాం. ఈ సందేశంతోనే నేను మీకో వెబ్సైట్ లింక్‌ను పంపుతున్నాను. దీనిద్వారా మీరు విరాళాలను అందజేయవచ్చు. కేర్ ఇండియా సంస్థ ఈ విరాళాలతో కాశ్మీర్ ప్రజల కోసం అవసరమై సామగ్రిని కొనుగోలు చేసి, పంపుతుంది. పాలిథిన్ కవర్లు, మ్యాట్స్, సబ్సు, టూత్ బ్రష్ వంటివేకాకుండా దుప్పట్లు వంటివి పంపుతారు. రూ. 5000 విలువజేసే వంద కిట్లను పంపుతారు. కనీసం వంద కుటుంబాలకైనా మనం సాయం చేసినవారమవుతాం. వరదల్లో చిక్కుకున్న 76,500 మందిని సహాయ శిబిరాలకు చేర్చారు. వారిలో ఎంతమందికి అన్ని సదుపాయాలు అందుతున్నాయో చెప్పలేం. మనలాంటివారు చేసే సాయం కూడా ప్రభుత్వ సాయానికి తోడైతే బాధితుల్లో మనమంతా ఉన్నామనే భరోసా పెరుగుతుంద’ని కునాల్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నాడు. -
బీఎస్ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మధిర: బీఎస్ఎఫ్ జవాన్ చింతల అంజయ్య(38) మృతదేహం స్వగ్రామమైన మధిర మండలంలోని నక్కలగరుబుకు శనివారం చేరుకుంది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ఆయన మృతిచెందారు. అంజయ్య 18 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే జమ్మూకాశ్మీర్ నుంచి ఉద్యోగోన్నతిపై ఢిల్లీకి వచ్చారు. మృతదేహాన్ని ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో, అక్కడి నుంచి ఆర్మీ బస్సులో (ఆర్మీ) సిబ్బంది శనివారం నక్కలగరుబు తీసుకొచ్చారు. అంజయ్యకు భార్య, కుమారుడు ప్రణీత్, కుమార్తె సౌజన్య ఉన్నారు. మృతదేహాన్ని మధిర టౌన్ ఎస్ఐ గూడ అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో సైనిక సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. నక్కలగరుబులో విషాదం అంజయ్య మృతితో ఆయన స్వగ్రామం నక్కలగరుబులో విషాదం నెలకొంది. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. తమ గ్రామంలోని వారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అందరికీ అంజయ్య సుపరిచితుడని స్థానికులు చెప్పారు. నాయకుల సంతాపం అంజయ్య మృతదేహాన్ని వైఎస్ఆర్ సీపీ మధిర మండల అధ్యక్షుడు యన్నం కోటేశ్వరరావు, ఆత్కూరు ఎంపీటీసీ సభ్యురాలు యన్నం రజిని, సీపీఎం నాయకుడు లింగాల కమల్‌రాజ్, రైతు సంఘం నాయకుడు చిత్తారు నాగేశ్వరరావు తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.