శ్రీనగర్: వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్‌ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఆలంపై గురువారం కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వెంటనే, కశ్మీర్‌లోయ నుంచి తరలించి జమ్మూ జైలుకు పంపించారు. ఆలం అరెస్ట్‌కు నిరసనగా హురియత్ కాన్ఫెరెన్స్ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.