మసరత్ అలాం తీవ్రవాది.. రాజకీయ ఖైదీ కాదు | Alam an extremist, not a political prisoner: BJP | Sakshi
Sakshi News home page

మసరత్ అలాం తీవ్రవాది.. రాజకీయ ఖైదీ కాదు

Published Mon, Mar 9 2015 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Alam an extremist, not a political prisoner: BJP

కాన్పూర్: ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నేత మసరత్ అలాం ఒక తీవ్రవాది అని, అతడు రాజకీయ ఖైదీ అనిపించుకోడని బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి అన్నారు. అతడిని పట్టించినవారికి పదిలక్షలు ఇస్తామని అవార్డు కూడా గతంలో ప్రకటించినట్లు తెలిపారు. అలాం ఒక నేరస్తుడని, ప్రత్యేకవాదని, తీవ్రవాదని ఆయన మండిపడ్డారు.  కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగానే అలాంను విడుదల చేసినట్లు పీడీపీ ప్రకటించడంతో ఆయన ఈ మేరకు స్పందించారు. విశ్వహిందు పరిషత్ కాన్పూర్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అలాం ఎప్పటికీ రాజకీయ ఖైదీ అనిపించుకోడని తమను సంప్రదించకుండానే జమ్మూకశ్మీర్లోని పీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement