శ్రీనగర్: ఇద్దరు కాశ్మీర్ వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్-లో అనుమానిత ఉగ్రవాదుల అలికిడి సమాచారం తెలుసుకున్న సైన్యం, మరికొందరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిద్దరు కూడా పుల్వామా జిల్లాలోని ట్రాల్ అనే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించింది.
వీరిని సైన్యం హత మార్చిన అనంతరం ట్రాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బారీగా బలగాలు మోహరించాయి. అదే సమయంలో అటువైపు వచ్చిన కాశ్మీర్ వేర్పాటు వాదులైన మహ్మద్ యాసిన్ మాలిక్, మస్రత్ అలాం భట్ పుల్వామా జిల్లా వైపే వెళుతుండగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారిని అవంతిపురా వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరు కరడుగట్టిన కాశ్మీర్ వేర్పాటు వాదులు. ఇదిలా ఉండగా, సైన్యం అమాయకులను పొట్టన పెట్టుకుందని ఆందోళన వ్యక్తం ట్రాల్ ప్రాంతంలో పలువురు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైనికుడి చేతిలోని ఏకే 47 తుపాకీని దొంగిలించినట్లు అధికారులు చెప్తున్నారు.
పోలీసుల అదుపులో వేర్పాటువాదులు
Published Tue, Apr 14 2015 3:03 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement