యాసిన్ మాలిక్ (పాత చిత్రం)
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్) చైర్మన్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. మరో మూడు రోజుల్లో భారత పార్లమెంటుపై దాడి వ్యూహకర్తలు మహమ్మద్ అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌ల సాంవత్సరికం ఉండగా మాలిక్ పట్టుబడటం విశేషం. యాసిన్ మాలిక్‌ను జేకేఎల్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
యాసిన్ మాలిక్ కొంతకాలం క్రితం పాకిస్తాన్ పారిపోయిన సంగతి విదితమే. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురు సాంవత్సరికంలో పాల్గొనేందుకు వచ్చి పట్టుబడినట్లు తెలుస్తోంది. అప్జల్ గురు ప్రిభ్రవరి 9, 2013లో ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెల్సిందే. ఇదే జైలులో 1984, ఫిబ్రవరి 11న జేకేఎల్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అమనుల్లా ఖాన్‌ను ఉరితీసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment