
యాసిన్ మాలిక్(ఫైల్ ఫోటో)
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకెఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు శ్రీనగర్‌లో శనివారం అరెస్టు చేశారు. మైసుమా ప్రాంతంలోని తన నివాసంలో మాలిక్‌ను అరెస్టు చేశారని జేకెఎల్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. హురియత్ నేత సయ్యద్ అలీ గిలాని, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌లతో కలిసి మాలిక్ కాశ్మీర్ వ్యాలీ విముక్తి కోసం ఏడాదికిపైగా పోరాడుతున్నారు.