Yasin Malik
-
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
సిబ్బందిని పొట్టనబెట్టుకుంది అతడే
జమ్మూ: శ్రీనగర్‌లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యాసిన్ మాలిక్‌తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు. తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్‌పై ఉన్నాయి. -
వేర్పాటు నేత భార్యకు పాక్ పట్టం.. ప్రతీకార ధోరణే ప్రధాన కారణం?
భారతదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు పాకిస్తాన్ పట్టంకట్టింది. ఆమె పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోకి అడుగు పెట్టింది. అన్వరుల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రభుత్వంలో మానవ హక్కులు, మహిళా సాధికారతపై ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఆమె నియమితులయ్యింది. ఆమె ఒక ఉగ్రవాది భార్య అయినప్పటికీ పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల అంశంలో ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు మించిన అర్హత కలిగిన వ్యక్తులు పాకిస్తాన్లో లేరా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకం వెనుక పాకిస్తాన్ రహస్య ఎజెండా ఉందనేది స్పష్టం అవుతున్నదని వారు అంటున్నారు. ముషాల్‌కు బాధ్యతల అప్పగింత వెనుక.. నిజానికి ముషాల్ హుస్సేన్ మాలిక్ నియామకం లాంఛనప్రాయ చర్య అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ముషాల్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రముఖరాలేమీ కాదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టనూ లేదు. అటువంటి పరిస్థితిలో కాశ్మీర్ ఎజెండాను సజీవంగా నిలిపివుంచడానికి, పాకిస్తాన్ సైన్యం వినతి మేరకు ముషాల్‌ను పాకిస్తాన్ ఈ ఉన్నత పదవిలో నియమించిందని తెలుస్తోంది. ముషాల్ హుస్సేన్ కశ్మీర్ విషయంలో మొదటి నుంచి భారత్‌పై విషం చిమ్ముతూ వస్తోంది. కశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచాలని.. భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్- 370 రద్దు చేసిన అంశాన్ని తిరిగి లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న విఫల ప్రయత్నాలలో భాగమే ఈ చర్య అని విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముషాల్‌ను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ముషాల్ మాట్లాడుతూ యాసిన్ మాలిక్ విషయంలో భారత్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చేసింది. ఇదిలావుండగా ఇటీవల జీ-20 సభ్యులు శ్రీనగర్‌కు చేరుకుని, సమావేశంలో పాల్గొన్నప్పుడు మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నించింది. పీఓకే ప్రజలను తప్పుదారి పట్టించేందుకే.. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలో ముషాల్ చేరిక వెనుక పాక్ ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ముషాల్‌ను నియమించడం ద్వారా పీఓకే ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది. కాగా ముషాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్. 2005లో పాకిస్తాన్లో ఆమెకు యాసిన్ మాలిక్ పరిచయం అయ్యాడు. 2009లో వారు పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది? -
Yasin Malik: మరీ ఇంత నిర్లక్ష్యమా?
ఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న అభియోగాలతో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్ మాలిక్ ఉన్నపళంగా కోర్టులో ప్రత్యక్షం కావడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వర్చువల్‌గా విచారించే అవకాశం ఉన్నా.. కోర్టుకు తీసుకురావడం ఏంటని? జైలు అధికారులను ప్రశ్నించింది. అదే సమయంలో సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ అంశంపై కేంద్ర హోం శాఖకు ఓ ఘాటు లేఖ సైతం రాశారు. ఆదేశాలు ఇవ్వకున్నా సరే.. యాసిన్ మాలిక్‌ను అధికారులు విచారణకు తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. టెర్రర్ ఫండింగ్ కేసులో జీవిత ఖైదు పడిన యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తోటి ఖైదీల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలోనూ అతన్ని ప్రత్యేకంగా ఉంచారు కూడా. అలాంటిది.. వర్చువల్‌గా విచారించే ఛాన్స్ ఉన్నా.. జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన ఓ అభ్యర్థన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జైలు అధికారులు యాసిన్ మాలిక్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. చుట్టూ అధికారులున్నా.. మాలిక్ కోర్టు ప్రాంగణంలోనే కాసేపు కలియ తిరిగాడు. అయితే.. మాలిక్‌ను కోర్టులో భౌతికంగా హాజరుపర్చాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వర్చువల్‌గా విచారించే అవకాశం ఉంది కాదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అందుకు వీలున్నా జైలు అధికారులు ఆ పని చేయలేదని అదనపు సోలిసిటర్ జనరల్ వివరించారు. ‘‘ఇది భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది. యాసిన్ మాలిక్ ప్రాణాలకు సంబంధించిన అంశం ఇది. భవిష్యత్తులో అతన్ని బయటకు తీసుకురాకపోవడమే మంచిది’’ అని తెలిపారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని.. సంబంధిత బెంచ్ నుంచి ఆదేశాలు పొందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన బెంచ్ అదనపు సోలిసిటర్ జనరల్‌కు సూచించింది. హోం శాఖకు లేఖ యాసిన్ మాలిక్‌ను జైలు నుంచి బయటకు తీసుకువస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఓ ఘాటు లేఖ రాశారు. యాసిన్ మాలిక్‌కు పాక్ సంబంధిత ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అతనెంత కీలకమో హోంశాఖకు తెలుసు. ఇలా బయటకు తీసుకొస్తే.. అతను తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే అతన్ని ఎత్తుకెళ్లడమో కుదరకుంటే చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సర్వోన్నత న్యాయస్థానం భద్రతకు సంబంధించిన అంశం కూడా. జైలు అధికారులకు అతన్ని బయటకు తీసుకొచ్చే అధికారం ఉండదన్న విషయం గుర్తించాలి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని తుషార్ మెహతా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై తీహార్ జైలు డీజీ విచారణకు ఆదేశిస్తూ.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోరారు. సుప్రీం కోర్టు నుంచి నిత్యం ఇలాంటి నోటీసులు సర్వసాధారణంగా వెళ్తుంటాయని.. అయితే జైలు అధికారులు వాటిని తీవ్రంగా పరిగణించినందునే మాలిక్‌ను కోర్టుకు తీసుకెళ్లి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1989లో నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని హతమార్చడంతో పాటు అప్పటి కశ్మీర్ హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతురు రుబియాను అపహరించిన వ్యవహరానికి సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. అయితే.. యాసిన్ మాలిక్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 268 ఆదేశాలు ఉన్నాయి. అంటే.. కోర్టులో అతన్ని హాజరుపర్చడం నుంచి మినహాయింపు ఉంది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు(టాడా కోర్టు) అదనపు సెషన్స్ జడ్జి నిర్లక్ష్యంగా హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలనే సవాల్ చేస్తూ.. సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
జైలులో నిరాహార దీక్ష చేపట్టిన యాసిన్ మాలిక్!
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాలిక్ జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్పారు. తన కేసును సంక్రమంగా విచారంచిలేదంటూ ఆరోపణలు చేస్తూ... నిరాహారదీక్ష చేపట్టాడని వెల్లడించారు. వాస్తవానికి మాలిక్ నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే అతను 2019లో జేకేఎల్‌ఎఫ్‌ని నిషేధించిన కొద్దికాలానికే అరెస్టు అవ్వడమే కాకుండా ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష తోపాటు దాదాపు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. పైగా అతను తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఫిటిషన్ దాఖలు చేయనని కోర్టుకు తెలిపాడు కూడా. అంతేగాదు పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబుబా మఫ్తీ సోదరి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహ్మద్ సయ్యద్ కుమార్తె రుబయా సయ్యద్‌ని డిసెంబర్ 8,1989న తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కేసులో మాలిక్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాలిక్ పై కిడ్నాప్ కేసు తోపాటు 1990 జనవరిలో శ్రీనగర్‌లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కాల్చి చంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐతే మాలిక్ ప్రస్తుతం ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. (చదవండి: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్.. అసలు సినిమా ముందుంది: బీజేపీ) -
యాసిన్ మాలిక్ తీర్పుపై విమర్శా?.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్‌కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు. చదవండి: Yasin Malik: యాసిన్‌కు మరణశిక్ష ఎందుకు వేయలేదు! -
Yasin Malik: యాసిన్‌కు మరణశిక్ష ఎందుకు వేయలేదు!
ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన నేరారోపణలు రుజువుకావడంతో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్(56)కు జీవిత ఖైదు పడింది. అయితే.. యాసిన్‌కు మరణశిక్ష విధించాలన్న ఎన్ఐఏ (NIA) విజ్ఞప్తిని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తానికి యాసిన్‌కు శిక్ష పడ్డప్పటికీ.. జాతి వ్యతిరేక శక్తికి దన్నుగా నిలవడంతో పాటు శాంతి భద్రతలను దెబ్బతీసిన ఖూనీకోరుకి ఇది తక్కువే శిక్ష అనే అభిప్రాయమూ ఎక్కువగా వ్యక్తం అవుతోంది. ‘‘నా భర్తను యాసిన్ మాలిక చంపి 32 ఏళ్లు అవుతోంది. ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతుండడం ఇన్నాళ్లూ నాకు భారంగా అనిపించేది. నా భర్తను చంపిన తర్వాత కూడా మాలిక్ బతికే ఉండడం నన్నెంతో బాధించింది. రక్తపాతానికి రక్తమే సమాధానం. అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.. అని నిర్మల్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన రవి కుమార్ భార్యనే ఈ నిర్మల్ ఖన్నా. 1990లో యాసిన్ మాలిక్, రవి కుమార్‌ను చంపారనే ఆరోపణలు ఉన్నాయి. 1990లో జరిగిన పరిణామాలతో కలత చెందిన ఎందరో.. ఇవాళ్టి శిక్షతో సంతోషంగా ఉండొచ్చు. కానీ, జాతి వ్యతిరేక శక్తులకు.. వాళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లను కఠినంగా శిక్షించాలి. యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాల్సింది. ఎందుకు విధించడంలేదో అర్థం కావడం లేదు. చాలా అసంతృప్తిగా ఉంది అని వ్యాఖ్యానించారు ఆమె. ఈ విషయమై ప్రధాని మోదీని కలిసి న్యాయం కోరాతానని అంటున్నారు ఆమె. It's justice for victims of terror attacks carried out by him (Yasin Malik). Some might be satiated but I am not satisfied as I want the death penalty for him in my case: Nirmal Khanna, wife of IAF officer Ravi Khanna, a victim of a terror attack carried out by Yasin Malik pic.twitter.com/sd7Sf9ziId — ANI (@ANI) May 25, 2022 యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించగా, జమ్మూలోని టాడా (టెర్రరిస్ట్ అండ్ యాంటీ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్) కోర్టు 2020 మార్చిలో యాసిన్‌తో పాటు మరో ఆరుగురిపై నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)ని చంపినందుకు అభియోగాలు మోపింది. 1990లో రవి ఖన్నా సహా శ్రీనగర్‌లోని అధికారులు మృతి చెందారు. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది. నేను గాంధేయవాదిని..!!? కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ‘గాంధీ అహింస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొనడాన్ని ఢిల్లీ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. లోయలో పెద్ద ఎత్తున హింస చెలరేగినప్పటికీ, అతను హింసను ఖండించలేదని, పైగా తన నిరసనలను ఉపసంహరించుకోలేదని వ్యాఖ్యానించింది. 1994లో తుపాకీని పక్కనపెట్టి.. గాంధేయవాదిగా మారానన్న వాదనను సైతం స్పెషల్ జడ్జి ప్రవీణ్ సింగ్ తోసిపుచ్చారు. ఈ దోషి విషయంలో.. పరివర్తనను అంగీకరించేదే లేదు అని జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ దోషి తాను 1994కి ముందు చేసిన పనులకు ఏనాడూ పశ్చాత్తపం వ్యక్తం చేసింది లేదు. హింసను ఖండించిందీ లేదు. ప్రభుత్వం మారేందుకు అతనికి ఒక అవకాశం ఇచ్చింది. హింసను ఖండించేందుకు వేదికలపై ప్రసంగించే అవకాశం ఇచ్చింది. కానీ, ఏనాడూ తన చిత్తశుద్ధిని చూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక్కపక్క అతనేమో గాంధేయవాదిని అంటున్నాడు.. కానీ, ఆధారాలు మాత్రం మరోలా ఉన్నాయి అని జడ్జి వ్యాఖ్యానించారు. అంతా అతని(మాలిక్) గీసిన ప్లాన్ ప్రకారమే నడిచింది.. హింస చెలరేగింది అని న్యాయమూర్తి తెలిపారు. మహాత్మా గాంధీ యొక్క సూత్రాలలో, లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా.. అందులో హింసకు ఏమాత్రం తావు లేదు. కాబట్టి, ఈ దోషి(యాసిన్ మాలిక్) మహాత్ముడి ప్రస్తావన చెప్పి.. గాంధేయవాదినని చెప్పుకునే అర్హత లేదని అనుకుంటున్నా. మొత్తం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడానికి మహాత్ముడికి చౌరీ చౌరా వద్ద ఒక చిన్న హింసాత్మక సంఘటన మాత్రమే పట్టింది. కానీ, కశ్మీరీ లోయలో పెద్ద ఎత్తున హింస చెలరేగినప్పటికీ మాలిక్ హింసను ఖండించలేదు సరికదా.. తన నిరసనలను ఉపసంహరించుకోలేదు అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చే ముందు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) (నిషేధిత సంస్థ) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ .. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ ఎన్ఐఏ తొలి కేసు నమోదు చేసింది. -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
Terror Funding Case: యాసిన్ మాలిక్‌కు యావజ్జీవం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56)కు పటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మాలిక్ ఇటీవలే తన నేరాన్ని అంగీకరించడం తెలిసిందే. అతనికి మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద మాలిక్‌పై కేసులు నమోదయ్యాయి. అతనికి యావజ్జీవంతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ రూ.11 లక్షల జరిమానా కూడా విధించారు. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ మాలిక్‌పై ఎన్ఐఏ తొలి కేసు నమోదు చేసింది. కోర్టును మాలిక్ క్షమాభిక్ష కోరలేదని అతని లాయర్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే ఉరి తీయండనే కోరాడన్నారు. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పీఓకేలో శిక్షణ.. భారత్‌లో ధ్వంస రచన నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ 1966 ఏప్రిల్ 3న శ్రీనగర్‌లోని మైసుమాలో పుట్టాడు. 1980ల నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశాడు. 1988లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆయుధాల వాడకం, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. జేకేఎల్‌ఎఫ్‌లో చేరి చురుగ్గా పనిచేశాడు. 1990 ఆగస్టులో ఎన్కౌంటర్లో పోలీసులకు దొరికిపోయాడు. 1994 మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు. కశ్మీర్ విముక్తికి శాంతియుత ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించాడు. జేకేఎల్ఎఫ్ చైర్మన్‌గా ఎదిగాడు. కొన్నాళ్లు హురియత్ కాన్ఫరెన్స్‌లోనూ çపనిచేశాడు. కశ్మీర్లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ 1999లో ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టయ్యాడు. 2002లో విడుదలయ్యాడు. 2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ములిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పదేళ్ల కుమార్తె రజియా ఉంది. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి పాకిస్తాన్లో నివసిస్తోంది. యాసిన్ మాలిక్ 2013 ఫిబ్రవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌తో కలిసి వేదిక పంచుకున్నాడు. 2017 నాటి టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో మాలిక్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్‌లో హింసాకాండకు సంబంధించి అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్‌ను 1989లో కిడ్నాప్ చేసిన కేసులో కూడా విచారణను ఎదుర్కొన్నాడు. 1990లో శ్రీనగర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. -
ఉగ్ర నిధుల కేసు: యాసిన్ మాలిక్ దోషే
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేలుస్తూ గురువారం ఢిల్లీలోని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 25న అతనికి శిక్ష ఖరారు చేయనున్నట్టుగా వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 16, 17, 18, 20 సెక్షన్ల ప్రకారం యాసిన్ మాలిక్‌కు గరిష్టంగా మరణశిక్ష కాగా, కనిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అవకాశాలున్నాయి. యాసిన్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తెలిపితే తదనుగుణంగా జరిమానా విధిస్తామని ఎన్ఐఏని కోర్టు ఆదేశించింది. మాలిక్ కూడా తన ఆదాయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పేరుతో యాసిన్ మాలిక్ ఏర్పాటు చేసిన ఉగ్ర సంస్థను కేంద్రం నిషేధించింది. స్వాతంత్య్ర పోరాటం పేరుతో కశ్మీర్ లోయలో మాలిక్ నిధులు పెద్ద ఎత్తున సేకరించి, ఉగ్ర సంస్థలకు అందించాడు. చదవండి: జీవితంలో మూడేళ్లు వృథా -
కశ్మీర్ పిక్చర్లో నాయక్ – ఖల్నాయక్
రావణ కాష్టంలా మండుతూనే ఉన్న కశ్మీర్ సమస్యకు...ఆర్టికల్ 370 రద్దు పరిష్కారం అవుతుందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కాలమే..! అయితే 1949లో మొదలైన ఈ సమస్యలో కీలక పాత్ర ధారులు ఎవరు? ఆద్యుడు... రాజా హరిసింగ్! కశ్మీర్ సమస్యకు మూల పురుషుడు.. జమ్మూ కశ్మీర్ రాజ్యానికి చిట్టచివరి రాజు. 1895 సెప్టెంబరు 23న జమ్మూలోని అమర్ మహల్లో జన్మించిన రాజా హరిసింగ్... 1909లో తండ్రి రాజా అమర్ సింగ్ జమ్వాల్ మరణం తరువాత బ్రిటిష్ పాలకుల కనుసన్నల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అజ్మీర్‌లోని మేయో కాలేజీలో చదువు పూర్తయిన తరువాత డెహ్రాడూన్‌లోని ఇంపీరియల్ కేడెట్ కారŠప్స్‌లో మిలటరీ శిక్షణ పొందిన హరిసింగ్‌ను బాబాయి మహారాజా ప్రతాప్ సింగ్ 1915లో జమ్మూ కశ్మీర్ సైనికాధికారిగా నియమించారు. 1925లో గద్దెనెక్కిన రాజా హరిసింగ్.. తన రాజ్యంలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేశారు. బాల్యవివాహాలను రద్దు చేయడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికీ పూజా మందిరాలు అందుబాటులో ఉండేలా చట్టాలు చేశారు. రాజకీయంగా తొలి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన హరిసింగ్... మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ముస్లింలీగ్, దాని సభ్యులనూ పూర్తిగా వ్యతిరేకించారు. పష్తూన్ల దాడుల్లో కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన హరిసింగ్ తన చివరి రోజులను ముంబైలో గడిపారు. 1961 ఏప్రిల్ 26న హరిసింగ్ మరణించగా వీలునామా ప్రకారం.. ఆయన అస్థికలను జమ్మూ ప్రాంతం మొత్తం చల్లడంతోపాటు తావీ నదిలో నిమజ్జనం చేశారు. తొలి నేత... షేక్ అబ్దుల్లా... కశ్మీరీల సమస్యలన్నింటికీ భూస్వామ్య వ్యవస్థ కారణమని నమ్మిన.. ప్రజాస్వామ్య వ్యవస్థతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలకు మిత్రుడిగా మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తొలి రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తిగానూ షేక్ అబ్దుల్లాకు పేరుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యనభ్యసించిన షేక్ అబ్దుల్లా 1932లో కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. తరువాతి కాలంలో ఈ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌గా మారింది. 1932 సమయంలోనే జమ్మూ కశ్మీర్‌కు ఒక అసెంబ్లీ ఏర్పాటైనప్పటికీ అధికారం మాత్రం రాజా హరిసింగ్ చేతుల్లోనే ఉండేది. రాజరికం తొలగిపోయిన తరువాత మూడుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అబ్దుల్లాను షేర్ –ఏ– కశ్మీర్‌గా పిలుస్తారు. కశ్మీర్ నుంచి రాజా హరిసింగ్ తొలగాలన్న డిమాండ్‌తో ఉద్యమం నడిపిన చరిత్ర కూడా ఈయనదే. 1953లో రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లాను 11 ఏళ్లపాటు జైల్లో పెట్టారు. ఆ తరువాత 1975లో భారత ప్రధాని ఇందిరాగాంధీతో కుదిరిన ఒప్పందంతో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. 1964లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్‌కు వెళ్లిన అబ్దుల్లా అప్పటి ప్రధానితో చర్చలు జరిపారు. తొలి, చివరి ప్రెసిడెంట్... రాజా కరణ్ సింగ్... దేశంలో రాజభరణాలు, బిరుదులన్నింటినీ రద్దు చేసిన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజా కరణ్‌సింగ్. 1931 మార్చి తొమ్మిదిన ఫ్రాన్స్‌లోని కెయిన్స్‌లో జన్మించిన కరణ్‌సింగ్.. జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ ఏకైక సంతానం. కవిగా, దాతగా మాత్రమే కాకుండా.. ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి సమయంలో అమెరికాలో భారత రాయబారిగానూ పనిచేసిన ఘనత ఈయనది. 1949 అక్టోబరులో కశ్మీర్ రాజ్యం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు నుంచి 18 ఏళ్ల వయసులోనే జమ్మూకశ్మీర్ ప్రతినిధిగా నియమితుడైన కరణ్ సింగ్.. తరువాతి కాలంలో రాష్ట్ర తొలి, చివరి అధ్యక్షుడిగా, గవర్నర్‌గానూ వ్యవహరించారు. ఈ కాలంలోనే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ భారత రాష్ట్రపతి పేరుతో అనేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 1961 నుంచి తనకు అందుబాటులో ఉన్న రాజభరణాన్ని 1973లో స్వయంగా త్యజించిన వ్యక్తిగా కరణ్‌సింగ్‌కు పేరుంది. 1967–73 మధ్యకాలంలో కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984 వరకూ పలు దఫాలు లోక్‌సభకు ఎన్నికైన కరణ్‌సింగ్ వైద్య ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో తూర్పు దేశాలకు భారత ఉద్దేశాలను వివరించే దూతగానూ పనిచేశారు. 1999 వరకూ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున, ఆ తరువాత 2018 వరకూ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. అతివాది... యాసిన్ మాలిక్... జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే వేర్పాటువాద సంస్థ స్థాపకుడు యాసిన్ మాలిక్. భారత్, పాకిస్తాన్ రెండింటి నుంచి కశ్మీర్ వేరుపడాలన్నది ఈయన సిద్ధాంతం. 1966లో శ్రీనగర్‌లో జన్మించిన యాసిన్ తన సిద్ధాంతం కోసం తుపాకులు పట్టాడు కూడా. అయితే 1994 తరువాత ఈయన తీవ్రవాదాన్ని విడిచిపెట్టడమే కాకుండా... శాంతియుత మార్గాల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రచారం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ అధ్యక్షుడిగా యాసిన్ మాలిక్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రచారం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కండబలాన్ని ఎదుర్కొనేందుకు మాలిక్ ఉపయోగపడ్డారని విశ్లేషకులు అంటారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడటమే కశ్మీర్లో చొరబాట్ల సమస్యకు కారణమైందన్న విశ్లేషకుల అంచనాలను అంగీకరించని మాలిక్ రిగ్గింగ్ అంతకుమునుపు కూడా ఉందని అంటారు. 2007లో సఫర్ ఏ ఆజాదీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిన యాసిన్ మాలిక్ కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో తరచూ పాకిస్తాన్ ప్రధానితో సమావేశం కావడం, చర్చలు జరపడం భారతీయుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. 2013లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌తో కలిసి యాసిన్ మాలిక్ ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వతంత్రవాది ఒమర్ ఫారూఖ్... జమ్మూకశ్మీర్‌పై భిన్నాభిప్రాయం కలిగినవారిలో మిర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ ఒకరు. జమ్మూ కాశ్మీర్ భారత్ నుంచి వేరు పడాలని, స్వతంత్రంగా ఉండాలన్న భావజాలం కలిగిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యత్వమున్న పార్టీల్లో మిర్వాయిజ్ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ కూడా ఒకటి. 2003లో హురియత్ కాన్ఫరెన్స్ రెండుగా చీలిపోగా మిర్వాయిజ్ నేతృత్వంలోని వర్గానికి మితవాద వర్గమని పేరు. కశ్మీర్ రాజకీయాల్లోకి రాకమునుపు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకన్న మిర్వాయిజ్ ఆ తరువాతి కాలంలో ఇస్లామిక్ స్టడీస్‌లో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా చేశారు. జమ్మూ కశ్మీర్లో తొలి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ముస్లిం కాన్ఫరెన్స్ తొలి అధ్యక్షుడు మిర్వాయిజ్ తాత. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల్లో తరచూ లేవనెత్తే మిర్వాయిజ్ భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుం దని నమ్మేవారిలో ఒకరు. అయితే ఇరుపక్షాలు ప్రజల ఆశయాలను కూడా అర్థం చేసుకోవాలని అంటారాయన. ఉగ్రవాదానికి బీజం... గిలానీ... కశ్మీర్ సమస్యకు బీజం పడిన సమయం నుంచి జీవించి ఉన్న అతికొద్ది మంది రాజకీయ నేతల్లో సయ్యద్ అలీ షా గిలానీ ఒకరు. 1929 సెప్టెంబరు 29న బండిపొరలో జన్మించిన గిలానీ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి బీజం పడింది గిలానీ విధానాల కారణంగానే అని కొంతమంది నేతలు ఆరోపిస్తారు. హురియత్ కాన్ఫరెన్స్ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత తెహ్రీక్ ఏ హురియత్ పేరుతో మరో పార్టీని స్థాపించిన గిలానీ ఉగ్రవాదుల మరణాలకు నిరసనగా తరచూ కశ్మీర్లో బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపునిచ్చేవారు కశ్మీర్ సమస్యకు స్వాతంత్య్రం ఒక్కటే పరిష్కారమన్న అంశంపై ఒక సదస్సు నిర్వహించినందుకుగాను.. .2010లో భారత ప్రభుత్వం గిలానీతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవర రావులపై భారత ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. 2016లో బుర్హాన్ వానీ మరణం తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కశ్మీర్లో సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకని గిలానీ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గిలానీ పాస్‌పోర్టును 1981లోనే రద్దు చేశారు. అయితే 2006లో మూత్రనాళ కేన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గిలానీకి మళ్లీ పాస్‌పోర్టు దక్కేలా చేశారు. -
‘అన్నీ అవాస్తవాలు..అతడు బాగానే ఉన్నాడు’
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడంటూ వస్తున్న వార్తలను తీహార్ జైలు డీజీ ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. మాలిక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన భార్య ముషాల్ హుసేన్ మాలిక్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భర్తకు వెంటనే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ విఙ్ఞప్తి చేశారు. కాగా ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో యాసిన్ మాలిక్ అరెస్టైన విషయం తెలిసిందే. కశ్మీరీ పండిట్ల ఊచకోతలో మాలిక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్లో నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్యలోనూ జేకేఎల్ఎఫ్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఆయనను జమ్మూ కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. -
తీహార్ జైలుకు జేకేఎల్ఎఫ్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను జమ్మూ కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు ఎన్ఐఏ తరలించింది. మాలిక్‌ను గురువారం ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్ను నిషేధించిన నేపథ్యంలో యాసిన్ మాలిక్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వేర్పాటువాద సంస్ధ జేకేఎల్ఎఫ్ను నిషేధించారని హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. కశ్మీరీ పండిట్ల ఊచకోతకు మాలిక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్లో నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్యలోనూ జేకేఎల్ఎఫ్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. -
జేకేఎల్ఎఫ్ను నిషేధించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో యాసిన్ మాలిక్ నేతృత్వంలోని వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్ ప్రమేయంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ 1988 నుంచి కశ్మీర్లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్పై కేంద్రం వేటువేసింది. కాగా జేకేఎల్ఎఫ్, జమ్మూ కశ్మీర్లో ఇటీవల నిషేధానికి గురైన రెండవ సంస్థ కావడం గమనార్హం. మరోవైపు ఇదే నెలలో కేంద్రం జమాతే ఇస్లామి జమ్ము కశ్మీర్ సంస్థనూ నిషేధించింది. కాగా యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్పై కేంద్రం నిషేధాన్నిపీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. యాసిన్ మాలిక్ హింసను విడనాడి సమస్య పరిష్కార ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నాడని, వాజ్‌పేయి ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియలోనూ పాల్గొన్నాడని చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు కశ్మీర్‌ను బహిరంగ కారాగారంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ కశ్మీర్: జేకెఎల్‌ఎఫ్ నేత యాసిన్ మాలిక్ అరెస్ట్
-
యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చైర్మన్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. మరో మూడు రోజుల్లో భారత పార్లమెంటుపై దాడి వ్యూహకర్తలు మహమ్మద్ అఫ్జల్ గురు, మక్బూల్ భట్ల సాంవత్సరికం ఉండగా మాలిక్ పట్టుబడటం విశేషం. యాసిన్ మాలిక్‌ను జేకేఎల్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. యాసిన్ మాలిక్ కొంతకాలం క్రితం పాకిస్తాన్ పారిపోయిన సంగతి విదితమే. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురు సాంవత్సరికంలో పాల్గొనేందుకు వచ్చి పట్టుబడినట్లు తెలుస్తోంది. అప్జల్ గురు ప్రిభ్రవరి 9, 2013లో ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెల్సిందే. ఇదే జైలులో 1984, ఫిబ్రవరి 11న జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అమనుల్లా ఖాన్‌ను ఉరితీసిన సంగతి తెల్సిందే. -
యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ మొహమ్మద్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని అబిగుజార్ ప్రాంతానికి చేరుకున్న పోలీసు బృందం మాలిక్‌ను, మరో జేకేఎల్ఎఫ్ లీడర్ బషీర్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు జేకేఎల్ఎఫ్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరినీ శ్రీనగర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్టోబర్ 1న మొహర్రం సందర్భంగా కాశ్మీర్ వ్యాలీలో ఉరేగింపు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా వీరిని అరెస్టు చేశారు. -
వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ అరెస్ట్
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను గురువారం శ్రీనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వద్ద హురియత్, జెకెఎల్ఎఫ్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఈ నెల 11వరకూ జైలులో ఉంచనున్నట్లు తెలిపారు. మరోవైపు హురియత్ నేత మిర్వాజ్ ఉమర్ ఫరూక్‌ను గృహ నిర్భంధంలో ఉంచారు. కాగా ఎన్ఐఏ అధికారులు వేధిస్తున్నారంటూ, అందుకు నిరసనగా రేపు ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే కాశ్మీర్లో ఇటీవల కాలంలో వేర్పాటువాదులకు మనీలాండరింగ్ ద్వారా నిధులు సరఫరా అవుతున్నాయనే సమాచారంపై ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ చర్యలను నిరసనగా జేకేఎల్ఎఫ్, హురియత్ సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాయి. -
యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకెఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు శ్రీనగర్‌లో శనివారం అరెస్టు చేశారు. మైసుమా ప్రాంతంలోని తన నివాసంలో మాలిక్‌ను అరెస్టు చేశారని జేకెఎల్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. హురియత్ నేత సయ్యద్ అలీ గిలాని, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌లతో కలిసి మాలిక్ కాశ్మీర్ వ్యాలీ విముక్తి కోసం ఏడాదికిపైగా పోరాడుతున్నారు. -
పోలీసుల అదుపులో వేర్పాటువాదులు
శ్రీనగర్: ఇద్దరు కాశ్మీర్ వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్-లో అనుమానిత ఉగ్రవాదుల అలికిడి సమాచారం తెలుసుకున్న సైన్యం, మరికొందరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిద్దరు కూడా పుల్వామా జిల్లాలోని ట్రాల్ అనే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించింది. వీరిని సైన్యం హత మార్చిన అనంతరం ట్రాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బారీగా బలగాలు మోహరించాయి. అదే సమయంలో అటువైపు వచ్చిన కాశ్మీర్ వేర్పాటు వాదులైన మహ్మద్ యాసిన్ మాలిక్, మస్రత్ అలాం భట్ పుల్వామా జిల్లా వైపే వెళుతుండగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారిని అవంతిపురా వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరు కరడుగట్టిన కాశ్మీర్ వేర్పాటు వాదులు. ఇదిలా ఉండగా, సైన్యం అమాయకులను పొట్టన పెట్టుకుందని ఆందోళన వ్యక్తం ట్రాల్ ప్రాంతంలో పలువురు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైనికుడి చేతిలోని ఏకే 47 తుపాకీని దొంగిలించినట్లు అధికారులు చెప్తున్నారు. -
మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!
* కాశ్మీర్ అంశంపై మోడీ కఠిన వైఖరి అవలంబించాలనుకుంటున్నారు * మేమూ సిద్ధంగానే ఉన్నాం.. ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం * జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారని.. అయితే, అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ శనివారం స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కఠినంగా, మొండిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీరీలమైన మేం అందుకు సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మోడీ వచ్చాడు.. మాకిప్పుడు పరీక్షా కాలం.. కష్టమైన రోజులు. అయినా, దేవుడి దయతో ఈ పరీక్షలో పాస్ అవుతాం’ అన్నారు. మోడీకి మేమిచ్చే సందేశం ఒకటే.. మీరు సుపరిపాలన ఇస్తారు కావచ్చు.. కానీ కఠిన వైఖరి అవలంబించి ఒక ఉద్యమాన్ని అంతం చేయలేరు’ అని స్పష్టం చేశారు. హిందీ వార్తాచానల్ ఇండియా టీవీలో రజత్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాసిన్ మాలిక్ పాల్గొన్నారు. తమ వల్లనే భారత్, పాక్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అన్ని సంబంధిత వర్గాలు చర్చల్లో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామన్నారు. పాక్‌తో చర్చల సందర్భంగా శాంతిపూర్వక వాతావరణం ఏర్పడటం కోసం కాశ్మీర్ వేర్పాటువాద నేతలు పాకిస్థాన్ వెళ్లేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అనుమతించిన విషయాన్ని మాలిక్ గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్‌లు మాత్రమే కూర్చుని చర్చలు జరపడానికి కాశ్మీర్ అంశం అనేది సరిహద్దు సమస్య కాదని మాలిక్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించే ఏ చర్చల్లోనైనా కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. మిలిటెంట్ల వద్దకు వెళ్లాలని మన్మోహన్ కోరారు పాకిస్థాన్‌లోని మిలిటెంట్లతో సంప్రదించాల్సిందిగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను కోరారని మాలిక్ చెప్పారు. పాక్‌తో శాంతి ప్రక్రియ ఫలప్రదమయ్యేందుకు అది తోడ్పడుతుందని మన్మోహన్ భావించారన్నారు. మన్మోహన్ సింగ్‌తో సమావేశమైనప్పుడు శాంతి చర్చల్లో తమనూ భాగస్వాము లను చేయాలని తాను కోరిన సందర్భంలో ఆయన పై విధంగా స్పందించారని ఆయన వివరించారు.