detain
-
సత్యపాల్ మాలిక్‌ను అరెస్ట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్‌కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్ మాలిక్ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్ మద్దతు కోరే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్‌లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్ స్పేస్ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో.. స్థానిక పీఎస్‌కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్ మాలిక్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్‌గా ఉన్న టైంలో జమ్ము కశ్మీర్లో జరిగిన ఓ భారీ అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని, ఏప్రిల్27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. थाना आर.के. पुरम के सामने पूर्व राजयपाल चौ सत्यपाल मलिक के समर्थन में पहुंचे समर्थक ।@SatyapalMalik_1#SatyapalMalik #CBISummonedSatyapalMalik#सत्यपाल_मलिक #PulwamaAttack #देश_सत्यपाल_मलिक_के_साथ_है pic.twitter.com/qR1XLbFAXg — DU JAT STUDENTS UNION (@du_jat) April 22, 2023 సంచలనాల సత్యపాల్ మాలిక్ -
మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: విచారణ పేరుతో వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో అయిదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనను అక్రమంగా నిర్బంధించారని మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. హైరదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు 2019లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమయంలో శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. ఫిబ్రవరి 27, 2019 రోజున తనను సెర్చ్ ఆపరేషన్ పేరుతో అధికారులు నిర్బంధించారని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. అయిదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, శ్రీనివాస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు. చదవండి: దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం! -
లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్‌తో ఉలిక్కిపాటు
రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్ బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. అరెస్ట్ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్‌ను ధృవీకరిస్తూ రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక ద్రవ్యాలు, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రతీకారంగానే.. పోరీ మోనీ అసలు పేరు షామ్‌సున్నాహర్. సైడ్ కిక్ వేషాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌ను, ముగ్గురు మహిళల్ని, నజీర్ సహచరుడైన డ్రగ్ డీలర్ తుహిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్టా కేసు నజీర్ అరెస్ట్ అయిన వారం తర్వాత గుల్షన్ ఆల్ కమ్యూనిటీ క్లబ్ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్ ఈ క్లబ్‌కు డైరెక్టర్ కూడా). డ్రగ్స్ మత్తులో జూన్ 7న ఆమె క్లబ్‌పై దాడి చేసిందని క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్ దొరికింది. ఆ వెంటనే నజీర్, అతని అనుచరులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. చంపేస్తారన్న కాసేపటికే.. బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్‌ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్ కేసు నమోదు అయ్యింది. -
Raj Kundra: ఈజీ మనీ కోసం కక్కుర్తి!
Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్‌ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు. ఆ లింక్‌తో.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్‌లో మదా ఐల్యాండ్‌లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd — MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021 ఈజీ మనీ కోసం.. లైవ్ స్రీ్టమింగ్ యాప్‌లు, ఐపీఎల్‌లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్‌లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్‌షాట్స్, హాట్హిట్మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. శాలువా బిజినెస్ నుంచి.. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్‌కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్‌లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్‌కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా. -
ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రధానంగా జైళ్లు ఉన్నవే నేరస్తులను శిక్షించేందుకు, సమాజానికి ఏదో సందేశం ఇవ్వడం కోసం నిందితులను నిర్బంధించడానికి కాదు’ అని ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు పోలీసులనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. జాతీయ మానవ హక్కుల సంఘం సేకరించిన లెక్కల ప్రకారం 75 శాతం మంది నిందితులు జైళ్లలోనే మగ్గుతున్నారు. కాగా, పింజ్రా ఫెమినిస్ట్ గ్రూపునకు చెందిన నాయకురాలు దేవంగన కలితకు మంగళవారం నాడే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమెను జైలు నుంచి విడుదల చేయలేదు. మరో కేసు ఆమె మీద పెండింగ్‌లో ఉండడమే అందుకు కారణం. గత రెండు వారాల్లో ఆమెను మూడుసార్లు అరెస్ట్ చేశారు. దేవంగనను ఢిల్లీ పోలీసులు చీటికి మాటికి అరెస్ట్ చేస్తున్నారు. ఏ సామాజిక సమస్యలపై ఆమె రోడ్డు మీదకు వచ్చినా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళుతున్నారు. (చదవండి: మాస్క్‌లు లేని నూతన జంటకు పదివేల ఫైన్) భారత్‌లోని జైళ్ల గదులు ఇప్పటికే 114 శాతం ఖైదీలతో కిక్కిరిసి పోయి ఉండగా, సామాజిక కార్యకర్తలను పోలీసులు చీటికి మాటికి అరెస్ట్ చేస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి భయాందోళనలు సష్టిస్తున్న నేటి పరిస్థితుల్లో జైళ్లు కిక్కిరిసి పోవడం ఎంత ప్రమాదరకమో ఊహించవచ్చు. చెన్నైలోని పుజాల్ జైలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఆ జైలులో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నేరాలను పరిష్కరించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అనుమానితులకు సందేశం ఇవ్వడం కోసం వారిని జైల్లో పెడుతున్నట్లున్నారని ఢిల్లీ కోర్టు విమర్శించింది. ఓ పక్క లాక్‌డౌన్‌ను ఉపయోగించుకొని ఢిల్లీ పోలీసులు గత ఫిబ్రవరి నెలలో జాతీయ పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రజలను వెతికి పట్టుకుంటున్నారు. జైళ్లకు పంపుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశంలోని హైకోర్టులే సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. -
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ధర్మవరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీపీఐ నేతలని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎస్పీ కార్యలయం ఎదుట ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం హంద్రీనివా ప్రాజెక్ట్ కాలువ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. గొల్లపల్లిలో సూక్ష్మసేద్యం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖిలో చర్చిస్తారు. కుంటి మద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. -
పోలీసుల అదుపులో వేర్పాటువాదులు
శ్రీనగర్: ఇద్దరు కాశ్మీర్ వేర్పాటువాదులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్-లో అనుమానిత ఉగ్రవాదుల అలికిడి సమాచారం తెలుసుకున్న సైన్యం, మరికొందరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిద్దరు కూడా పుల్వామా జిల్లాలోని ట్రాల్ అనే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించింది. వీరిని సైన్యం హత మార్చిన అనంతరం ట్రాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బారీగా బలగాలు మోహరించాయి. అదే సమయంలో అటువైపు వచ్చిన కాశ్మీర్ వేర్పాటు వాదులైన మహ్మద్ యాసిన్ మాలిక్, మస్రత్ అలాం భట్ పుల్వామా జిల్లా వైపే వెళుతుండగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారిని అవంతిపురా వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరు కరడుగట్టిన కాశ్మీర్ వేర్పాటు వాదులు. ఇదిలా ఉండగా, సైన్యం అమాయకులను పొట్టన పెట్టుకుందని ఆందోళన వ్యక్తం ట్రాల్ ప్రాంతంలో పలువురు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైనికుడి చేతిలోని ఏకే 47 తుపాకీని దొంగిలించినట్లు అధికారులు చెప్తున్నారు. -
దాల్మియా కంపెనీ ఈడీ నిర్భంధించిన గ్రామస్థులు!
కడప: వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో దాల్మియా కంపెనీ ఈడీ బజాజ్ ను గ్రామస్థులు నిర్భంధించారు. దాల్మియా కంపెనీ ఈడీ నిర్భంధంతో నవాబుపేటలో ఉద్రిక్తత నెలకొంది. దాల్మియా కంపెనీలో పనిచేస్తూ గతంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోలేదనే కారణంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈడీ బజాజ్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని దాల్మియా కంపెనీ నిర్వహకులకు గ్రామస్థులు సూచించినట్టు తెలుస్తోంది. -
లండన్ ఎయిర్‌పోర్టులో 8 గంటలు రాందేవ్ నిర్బంధం
యోగా గురు బాబా రాందేవ్‌కు ఇంగ్లండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు. శనివారం రాందేవ్‌ను విడిచిపెట్టినట్టు ఆయన ప్రతినిధి ఎస్.కె.తేజరావాలా తెలిపారు. వేధింపులకు గురైనట్టు 'స్వామీజీ' భావించారని తెలిపారు. కస్టమ్స్ అధికారులు రాందేవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్రిటన్‌కు విజట్ వీసాపై వచ్చారా లేక బిజినెస్ వీసాపైనా అన్న విషయం గురించి ఆరా తీశారు. ఆయన వెంట తీసుకెళ్లిన ఆయుర్వేద మందుల గురించి ప్రశ్నించారు. రాందేవ్ తన వెంట నాలుగు జతల దుస్తులు, కొన్ని మందులు, పుస్తకాలు తీసుకెళ్లారు. 'తనను ఎందుకు నిర్బంధించారని బాబా పలుసార్లు అధికారులను ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడూ నేరం, అనైతిక పనులు చేయలేదని చెప్పారు. ఐతే అధికారులకు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు' అని తేజరావాలా చెప్పారు. 125 కోట్ల భారతీయులందరికీ ఇది అవమానకర సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేళ్లుగా బాబా పలుసార్లు ఇంగ్లండ్ వెళ్లి యోగా తరగతులు నిర్వహించారని తెలిపారు. పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు.