జమ్ము పరిస్థితిపై ప్రధాని ఆరా | PM Narendra Modi Speaks To Mehbooba Mufti On Flood Situation In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ము పరిస్థితిపై ప్రధాని ఆరా

Published Fri, Apr 7 2017 12:20 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra Modi Speaks To Mehbooba Mufti On Flood Situation In Jammu And Kashmir

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర సీఎం మహబూబా ముఫ్తీతో చర్చించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్న తక్షణమే తెలియజేయాలని ఆమెకు సూచించారు. ఈ మేరకు ప్రధాని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గత వారం రోజులుగా జమ్ముకాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు.
 
జీలం నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని.. విపత్తు నిర్వాహణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంగం, అనంతనాగ్‌, రామ్‌ ముషిబాగ్‌ ప్రాంతాల్లో నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో.. జమ్మ- శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూడు రోజుల క్రితమే మూసివేసిన విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement