‘మోదీకి భారీ మెజారిటీ వస్తే.. ఆర్టికల్‌ 370 రద్దు’ | PM Narendra Modi can create history | Sakshi
Sakshi News home page

‘మోదీకి భారీ మెజారిటీ వస్తే.. ఆర్టికల్‌ 370 రద్దు’

Published Sat, Nov 4 2017 11:43 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra Modi can create history - Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370.. వివాదం మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక.. చాలా వివాదాస్పద అంశాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. తాజాగా ఆర్టికల్‌ 370పై జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370ని కొనసాగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు కల్పించిన ప్రత్యేక గౌరవమని.. దీనిని భారత ప్రభుత్వం కొనసాగించాలని ఆమె చెప్పారు. చర్చలు, పరస్పర విరుద్ధ భావాలే ప్రజాస్వామ్యానికి ఆయుపుపట్టు అని ఆమె తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీకి 2019 ఎన్నికల్లో అనూహ్యమైన, ఆశ్చర్యకర మెజారిటీ లభిస్తే.. జమ్మూకశ్మీర్‌ చరిత్రను, ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశముందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని జమ్మూ కశ్మీర్‌ బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గుప్త రెండు రోజుల కిందట డిమాండ్‌ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మొహబూబాబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement