
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించేందుకు ఆ ప్రాంతానికి చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి జరుగుతున్న అఖిలపక్ష భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరగా, ప్రధాని సానూకూలంగా స్పందించారని తెలుస్తోంది. అలాగే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని ఆజాద్ ప్రధానిని కోరారు. భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment