Flood Situation
-
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
వరదలపై సమీక్షా సమావేశం.. నిద్రపోయిన మంత్రి
బెంగళూరు: అకాల వర్షాలతో బెంగళూరు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో వరద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐతే ఆ సమావేశంలో కర్ణాటక మంత్రి ఆర్ ఆశోక్ నిద్రపోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేస్తూ.... విమర్శల దాడికి దిగింది. రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో మునిగిపోతుంటే.... మంత్రి నిద్రమత్తులో మునిగిపోతున్నారంటూ కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. వాస్తవానికి కర్ణాటక మంత్రి ఆశోక్ కుమార్ కూడా సోమవారం, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగిన వరద సమీక్ష సమావేశానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పంచుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు జిల్లాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాదు ఆ సమావేశంలో బెంగళూరు ప్రజలను వరదల పరిస్థితి నంచి గట్టేక్కించేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందించే నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేయాలని సీఎం బొమ్మె నిర్ణయించినట్లు పేర్కొన్నారు కూడా. ಮುಳುಗುವುದರಲ್ಲಿ ಹಲವು ವಿಧಗಳಿವೆ! ರಾಜ್ಯದ ಜನ ಮಳೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ, ಸಚಿವರು ನಿದ್ದೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ! ಪ್ರವಾಹ ಪರಿಶೀಲನೆಯ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ನಲ್ಲಿ ಸಚಿವ @RAshokaBJP ಅವರ ಭರ್ಜರಿ ನಿದ್ದೆ. 'ಹಲಾಲ್ ಕಟ್' ಎಂದರೆ ಥಟ್ನೆ ಎಚ್ಚರಾಗುತ್ತಾರೆ! 'ಚಿಂತೆ ಇಲ್ಲದವಗೆ ಸಂತೆಲೂ ನಿದ್ದೆ' ಎಂಬ ಮಾತು ಸಚಿವರಿಗೇ ಹೇಳಿದ್ದೇನೋ! pic.twitter.com/e11pzCibwZ — Karnataka Congress (@INCKarnataka) September 6, 2022 ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರೊಂದಿಗೆ ಪ್ರವಾಹ ಪೀಡಿತ ಜಿಲ್ಲೆಗಳ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ನಡೆಸಿ, ರಕ್ಷಣೆ ಮತ್ತು ಪರಿಹಾರ ಕಾರ್ಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ ನಡೆಸಲಾಯಿತು. @BSBommai @BJP4India @CMofKarnataka pic.twitter.com/e7BEd6wwRt — R. Ashoka (ಆರ್. ಅಶೋಕ) (@RAshokaBJP) September 5, 2022 (చదవండి: బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు) -
భారీ వర్షాలకు బెంగళూరు జలమయం.. వాగుల్లా మారిన రోడ్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వీధులు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపుర రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఅవుట్ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మారథహళ్లిలోని స్పైక్ గార్డెన్లో ద్విచక్ర వాహనాలు వరదనీటిలో పడవల్లా కొట్టుకుపోయాయి. మారథహళ్లి సిల్క్ బోర్డు జంక్షన్లో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని సహాయ బృందాలు రక్షించాయి. #bangalorerain #bangaloretraffic #Bangalore Scene at 5:55am outside Village Super Market, Spice Garden, Marathahalli. 2-wheelers floating. Road from Spice Garden to Whitefield completely blocked pic.twitter.com/x4oWokLP4P — Ishkaran Talwar (@Ishkaran) September 5, 2022 #bangalorerain #rohan #Waterfall #societywaterfall #flood #Bangalore Bangalore rains has reached its heights. Even premium societies are facing flooding for the first time. @CMofKarnataka : Please help us. pic.twitter.com/ydxkge0Eem — ansu jain (@ansujain) September 4, 2022 #WATCH | Karnataka: A man was rescued by local security guards after he was stuck on a waterlogged road near Marathahalli-Silk Board junction road in Bengaluru pic.twitter.com/gFnZtzk6mu — ANI (@ANI) September 5, 2022 నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను రంగంలోకి దించి జలదిగ్భంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరదలకు సంబంధించిన ఫోటోలను నగరవాసులు సామాజిక వేదికగా షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు చరిత్రోలనే తొలిసారి ప్రీమియం సొసైటీల్లో కూడా వరద నీరు చేరిందని పేర్కొన్నారు. సాయం అందించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Karnataka | Several parts of Bengaluru remain inundated due to severe waterlogging after heavy rainfall. Visuals from Eco space area on Marathahalli - Silk Board junction road pic.twitter.com/kfcsAVn7U7 — ANI (@ANI) September 5, 2022 మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 10 నిమిషాలు వర్షం పడితే బెంగళూరులో పరిస్థితి ఇలా ఉంటుందా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక పన్నులు కడుతున్న తమకు సరైన మౌళిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేరా? అని ప్రశ్నించారు. భారీ వర్షాల ధాటికి ఐటీ పార్కులను అనుసంధానించే ఔటర్ రింగ్ రోడ్డుపై వరద నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ 9 వరకు బెంగళారులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చికమగళూరు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. చదవండి: భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్ యాత్ర -
కడలి వైపు నదుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా నుంచి 4.02 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 14.74 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలసిపోతోంది. జూరాల నుంచి కృష్ణా.. సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. త్రివర్ణ కాంతుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి పరవళ్లు ప్రాజెక్టులో 884.3 అడుగుల వద్ద 211.47 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 32,845 క్యూసెక్కులను, 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 586.3 అడుగులవద్ద 301.87 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ►పులిచింతలలోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల వద్ద 35.59 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. అలాగే 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ►పులిచింతల, పాలేరు, మున్నేరుల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా..4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ►ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి చేరుతున్న 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గోదావరిలో నిలకడగా వరద.. గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,80,877 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 15 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతూ.. 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పెన్‌గంగ, ప్రాణహితలలో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా గోదావరికి వరద ఇదే రీతిలో వరద కొనసాగనుందని భావిస్తున్నారు. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: సీఎం జగన్
-
శ్రీశైలంలోకి 1.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, అమరావతి: పరివాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు తగ్గుతుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,79,093 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ జెన్కో 19,070 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు తరలిస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ ప్రభుత్వం 17 వేల క్యూసెక్కులను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 880.2 అడుగుల్లో 189.45 టీఎంసీలు ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణాలో వరద తగ్గింది. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 27,324 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ప్రవాహం తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 72,756 క్యూసెక్కులు చేరుతుండగా.. 52,775 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 100.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ప్రస్తుతానికి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయి అయిన 885 అడుగులకు చేరినా, వరద ప్రవాహం తక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి ద్వారానే సాగర్‌కు నీటిని తరలించే అవకాశం ఉంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ తరలిస్తున్న నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 534.8 అడుగుల్లో 177.67 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన బేసిన్లో వర్షాలు లేకపోవడంతో పులిచింతలలోకి వరద ప్రవాహం కనిష్ట స్థాయిలో 760 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 37.64 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నిండాలంటే ఇంకా 8 టీఎంసీలు అవసరం. ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,714 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 8,972 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1742 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
వరద బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం
-
ధవళేశ్వరం వద్ద తగ్గిన వరద.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 14,97,070 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 15.1 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. డెల్టాకు 5,400 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 14,91,670 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన కాస్త పెరుగుదల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి కాస్త పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీలోకి 8,62,610 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్‌లోకి వస్తున్న 12,27,650 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,42,264 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 48.4 అడుగులకు చేరుకుంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 13,86,917 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 35.25 మీటర్లకు చేరింది. వస్తున్న ప్రవాహాన్ని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తూ.. అధికారులు సమర్థంగా వరదను నియంత్రిస్తున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
వరదల్లోనూ.. వెలుగుల కోసం.!
సాక్షి, అమరావతి: కరెంటు తీగ నీటిలో పడిందంటే..అటువైపు వెళితే షాక్ కొడుతుందని భయడుతుంటాం..అలాంటిది కిలోమీటర్ల కొలదీ హై టెన్షన్, లో టెన్షన్ అనే తేడా లేకుండా విద్యుత్ తీగలు తెగిపోయి వరదనీటిలో వేలాడుతుంటే..వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో పడవలపై వెళ్లి లైన్లను సరిచేసేందుకు వందలాది మంది విద్యుత్ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చీకటి అలుముకున్న గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. భారీ దెబ్బ.. గోదావరి వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీ ఎల్) పరిధిలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా 12 మండలాల్లోని 406 గ్రామాల్లో 70,148 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 సబ్స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 46 దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (టీడీఆర్) 3,964 పాడయ్యాయి. వీటిలో 3 సబ్ స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 4, టీడీఆర్‌లు 383 బాగుచేశారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నీటమునగడంతో 5,368 సర్వీసులకు విద్యుత్ అందించలేని పరిస్థితి ఏర్పడింది. మిగతా వాటిలో 10,073 సర్వీసులకు అందిస్తున్నారు. 230 ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, సెల్ టవర్లకు ఇంకా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. నిరంతర ప్రయత్నం.. అత్యవసర సర్వీసులకు, వరద బాధితులు పునరావాస కేంద్రాలకు, పలు వసతి గృహాలు, పాఠశాలలకు తాత్కాలిక విద్యుత్ లైన్లు, పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఇక దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు. అవసరమైన కండక్టర్లు, కేబు ళ్లతో సహా 17,280 స్తంభాలను అందుబాటులో ఉంచారు. ప్రతి డివిజన్‌లోనూ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో జూనియర్ లైన్మెన్ దగ్గర్నుంచి డిస్కం సీఎండీ వరకూ 850 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తున్నాం వరదల వల్ల విద్యుత్ వైర్లు నీటిలో మునిగిపోయాయి. వెంటనే వాటిని సరిచేయాలి. లేదా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అలా నిలిపివేయాలన్నా కూడా ఆ ప్రాంతానికి వరద నీటిలోనే వెళ్లాలి. అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరూ ప్రాణాలతో మిగలరు. అయినప్పటికీ వెళుతున్నాం. నాతో పాటు కొందరు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయికి పడవలపై వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే విద్యుత్ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాం. – కే సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ ఇదీ చదవండి: CM YS Jagan: 48 గంటల్లో సాయం -
ఎన్నడూలేని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం : సీఎం జగన్
-
భద్రాచలంకు మూడు వైపులా చుట్టుముట్టిన వరద
-
వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం బైక్ రైడ్.. వీడియో వైరల్
డిస్పూర్: దేశంలో భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు నీటమునిగాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తముల్పూర్ జిల్లా సందర్శనకు వెళ్లిన క్రమంలో బైక్‌పై చక్కర్లు కొట్టారు. పింక్ రంగు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలోని బగరిబారి ప్రాంతంలో బైక్ రైడ్ చేశానంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు సీఎం. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. Took a motor-bike ride to Bagaribari embankment breach site during my visit to Tamulpur. pic.twitter.com/uE4z8TgqV0 — Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2022 బైక్ రైడ్ తర్వాత బోట్లో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టి వచ్చారు సీఎం. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్సాంలోని కచార్, చిరాంగ్, మోరిగావ్, నగావ్, తముల్పూర్ జిల్లాలు నీట మునిగాయి. సుమారు 2,50,300 మందిపై వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో 76 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది అస్సాం ప్రభుత్వం. ఇప్పటి వరకు 17,014 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. బొంగాయ్‌గావ్, ధుబ్రీ, కమ్రూప్, లఖింపుర్, మంజులీ, మోరిగావ్, దక్షిణ సల్మారా, టింసుకియా జిల్లాల్లో వరదల కారణంగా భూములు కోతకు గురయ్యయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
వరద నీటిలోనే పెళ్లికూతురి వివాహ ప్రయాణం
-
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
విపత్తులు, వరద కష్టాలపై ముందస్తు జాగ్రత్తలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే విపత్తులు, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. శాఖాపరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సాగునీటి ప్రాజెక్టుల ఇన్చార్జిలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జూలై నుంచి వర్షాలు ప్రభావం చూపనున్న నేపథ్యంలో గతంలో జరిగిన నష్టాలు, వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అ«ధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ జి.అనిల్‌కుమార్.. చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, ఇందిరమ్మ వరద కాల్వ సహా 11 ప్రాజెక్టుల నిర్వాహకులకు వివిధ జాగ్రత్తలపై సోమవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వరదల సందర్భంగా విపత్తు సంసిద్ధత, ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా కార్యాలయాల్లో సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లతో పర్యవేక్షణ: ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదు ర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఈ నెల 16 నుంచి డిసెంబర్ 15 వరకు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలో సెలవు లేకుండా విధులు నిర్వహించాల్సి ఉన్నందున సిబ్బందికి కేటాయించిన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించనున్నారు. వరదలు ఉధృతంగా ఉంటే క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాయింట్లు, రెగ్యులేటర్ గేట్లు, ప్రధాన, మధ్యస్థ ప్రాజెక్ట్‌ల కోసం వరద గేట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల వివరాలు అందుబాటులో ఉండాలని, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్‌లు సమర్థవంతంగా పని చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించారు. -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని సీఎం పరిశీలించారు. నిత్యవసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. చదవండి: ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ అనంతరం అంశాల వారీగా వరద నష్టం నివేదికలను– సహాయ చర్యల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా చేశామని కలెక్టర్లు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయని తెలిపారు. ఈ సాయంత్రంలోగా వీరికి కూడ నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం దాదాపుగా అందిందని వివరించారు. సహాయక శిబిరాల నుంచి ప్రజలంతా తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? కడపలో 155 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలిగితే.. అన్నింటికీ పునరుద్ధరించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రాంత సీఎండీ ఇక్కడే ఉండి... విద్యుత్తును పూర్తిగా పునరుద్ధించారని పేర్కొన్నారు. నిన్న మళ్లీ భారీ వర్షం కారణంగా 8 ఆవాసాలకు మాత్రమే విద్యుత్తు పునరుద్ధరణలో ఇబ్బందులు వచ్చాయని, ఈరోజు పునరుద్ధరిస్తామన్నారు. అన్ని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నామని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాజంపేటలో 36 బోర్లు వేసి.. వాటిద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫైర్ టెండర్లతో ప్రతి ఇంటినీ క్లీన్ చేస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ వరదల కారణంగా మరణించిన వారికి నష్టపరిహారాన్ని కూడా శరవేగంగా అందించామని కలెక్టర్లు తెలిపారు. మృతదేహాలు లభ్యమైన కుటుంబాలకు వెంటనే అందించామని చెప్పారు. గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో ఎఫ్ఐఆర్, పంచనామాలు పూర్తిచేస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు.. దాదాపు 95 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితం అయ్యాయని, ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. తాగునీటి విషయంలో అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ►రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ►తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు. ►తాగునీటి అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి. ► ప్రతిరోజూ కూడా వ్యక్తిగతంతా కలెక్టర్లు పర్యవేక్షించాలి. ►104 కాల్ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే రెస్పాండ్ కావాలని సీఎం ఆదేశం ► శానిటేషన్‌మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ►కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ►104 నంబర్‌ను బాగా ప్రచారం చేయాలి. ►ఎవరికైనా ఏదైనా అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104కు కాల్చేస్తే వెంటనే స్పందించాలి, వారికి సహాయాన్ని అందించాలి. పశునష్ట పరిహారమూ అందించాలి ►చనిపోయిన పశువులకు వెంటనే పరిహారం అందించాలి. ►పశువులకు వాక్సినేషన్ చేయాలి. ►పశువుల దాణా కూడా పంపిణీచేయాలి. పూర్తిగా దెబ్బతిన్నవారికి కొత్త ఇళ్లు ►పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలి. ►వచ్చే 3–4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలి. ►అంతేకాక పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. ► వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలి. ►దీనివల్ల వారు వెంటనే పనులు ప్రారంభించగలుగుతారు. పంట నష్టపరిహారం ► పంట నష్టహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్ చురుగ్గా సాగాలి. ►రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలి. ►ఈ నివేదికలు ప్రకారం వెంటనే ప్రణాళికలు వేసి పనులు ప్రారంభించాలి. ►ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులను మంజూరుచేయాలి. ►నెలరోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలి. ►కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూసుకోవాలి. ►ఈలోగా రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలి. ►చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుకావాలి. 2017లో అన్నమయ్య ప్రాజెక్టు నివేదికను పట్టించుకోలేదు ►గతంలో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదికలను పట్టించుకోలేదు. ►చెయ్యేరు ప్రాంతంలో గతంలో ఉన్నడూలేని విధంగా వరద వచ్చింది. ►పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరదనీరు వచ్చింది. ►అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయగలదు, అప్పుడు అలానే డిజైన్ చేశారు ►కాని దురదృష్టవశాత్తూ 3.2 లక్షల క్యూసెక్కులనీరు వచ్చింది. ►2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారు. ►ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు పట్టించుకోలేదు. ►పింఛా విడుదల సామర్థ్యం 58వేల క్యూసెక్కులు అయితే, 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ►దీనిపై ఉన్న అన్ని వాగులు, వంకలు కూడా ఎప్పుడూలేని విధంగా వరదనీరు వచ్చింది. ►ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరద వచ్చింది. ►చెయ్యేరు వెంబడికూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ►భవిష్యత్తులో ఇలాంటి వరద వస్తుందని అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. ► ప్రస్తుతం వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని.. అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలి, రీ డిజైన్‌చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై తక్షణ నివేదిక ►13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండి. ►డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయండి. ►ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలి. ►ఉదాసీనత వల్ల ఇప్పటివరకూ పెండింగులో ఉన్న డ్యాంల భధ్రతపై దృష్టిపెట్టండి. ►అన్నమయ్య లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదు. ►దీనికోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. 26 నుంచి వర్షాలు –అప్రమత్తత ►ఈనెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి: ►27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు: ►భారీ వర్ష సూచనపై కలెక్టర్లకు నివేదికలు పంపించండి: సీఎం ►తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశానికి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజా శంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురము జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ, వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం ఎన్ హరీంద్రప్రసాద్‌లు హాజరయ్యారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, అమరావతి: ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు చదవండి: ‘చంద్రబాబు దొంగ ఏడుపులు.. ప్రజలు నమ్మరు’ Spoke to Andhra Pradesh CM @ysjagan Garu on the situation in the wake of heavy rainfall in parts of the state. Assured all possible support from the Centre. I pray for everyone’s well-being and safety. — Narendra Modi (@narendramodi) November 19, 2021 -
భద్రాద్రి ప్లాంట్‌కు ‘సీతమ్మ’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వరద గండం పొంచి ఉంది!. గోదావరిపై దుమ్ముగూడెం వద్ద 63 మీటర్ల ఎత్తుతో నిర్మించతలపెట్టిన సీతమ్మసాగర్ డ్యాంతో భవిష్యత్తులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వరద ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద గోదావరి తీరంలో 1,080 (270్ఠ4) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. గత 100 ఏళ్లలో గోదావరికి వచ్చిన గరిష్ట వరదలను పరిగణనలోకి తీసుకుని ఈ విద్యుత్ కేంద్రం కోసం నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేశారు. 2015లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణపనులు మొదలయ్యాయి. అప్పట్లో సీతమ్మసాగర్ డ్యాం నిర్మాణానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. తాజాగా సీతమ్మసాగర్ జలాశయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పరిస్థితులు మారిపోయాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును 63 మీటర్లకు పెంచి సీతమ్మసాగర్ జలాశయాన్ని నిర్మిస్తే ఎగువన ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇన్‌టేక్ వెల్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి సంస్థకు చెందిన ఇన్‌టేక్ వెల్స్.. బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికానున్నాయని ఇప్పటికే నీటిపారుదల శాఖ నిర్థారించింది. అయితే, భవిష్యత్తులో గోదావరికి భీకర వరదలు పోటెత్తితే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సైతం ముంపు ప్రమాదం తప్పదని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. వరద రక్షణ గోడలు నిర్మించి భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి రక్షణ కల్పిస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ విషయమై నీటిపారదుల శాఖ, జెన్కోల మధ్య గత కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది వణికించిన వరదలు గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. ఆగస్టు 17న 20 లక్షల క్యూసెక్కుల భారీ వరద రాగా, భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 61.60 అడుగులకు ఎగబాకింది. విద్యుత్ కేంద్రం ఇన్‌టేక్ వెల్ పిల్లర్లు దాదాపు సగం వరకు మునిగిపోగా, భద్రాద్రి విద్యుత్ కేంద్రం ప్రహరిగోడ దగ్గరికి వరకు నీళ్లొచ్చాయి. విద్యుత్ కేంద్రం లోపల కురిసిన వర్షపు నీటిని గోదావరిలోకి తీసుకెళ్లేందుకు దాదాపు రెండు మీటర్ల లోతులో నిర్మించిన డ్రెయిన్స్ నుంచి వరద నీరు విద్యుత్ కేంద్రంలోకి రివర్స్‌ఫ్లోలో పోటెత్తింది. దీనికి తోడు లోపల కురిసిన వాననీరు సైతం బయటకు వెళ్లక దీనికి జతకావడంతో విద్యుత్ కేంద్రం ఆవరణలో భారీగా నీరు నిలిచింది. వరద తీవ్రత మరింత పెరిగితే విద్యుత్ కేంద్రం ముంపునకు గురి అవుతుందని అక్కడ విధులు నిర్వహించే ఇంజనీర్లు ఆందోళనకు గురయ్యారు. వారం పాటు విద్యుదుత్పత్తిని నిలిపివేసి వరద ఉధృతి తగ్గాక మళ్లీ పునరుద్ధరించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూసెక్కుల సాధారణ వరదలకే థర్మల్ విద్యుత్ కేంద్రం కొంతవరకు ప్రభావానికి గురైందని, భవిష్యత్తులో వరదలు తీవ్రస్థాయిలో వస్తే ముంపునకు గురయ్యే అవకాశాలెక్కువ ఉంటాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గోదావరికి 1986 ఆగస్టు 16న అత్యంత భీకరంగా 36 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహంతో వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద 75.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది. గత 100 ఏళ్లల్లో గోదావరికి వచ్చిన అతిభారీ వరదలు ఇవే. మళ్లీ అంతకు మించిన వరదలు వస్తే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రం ముంపునకు గురవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో ముంపు ముప్పు మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 1986 నాటి వరదల నేపథ్యంలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కులతో భవిష్యత్తులో వరదలు వచ్చే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గరిష్ట వరదలకు సంబంధించిన అంచనాలను సవరించింది. వరద గోడలు నిర్మించినా వాగులతో సమస్యే! భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి వరద రక్షణ గోడలు నిర్మిస్తే గోదావరి వరద పోటు తప్పినా.. పరిసర ప్రాంతాల్లోని వాగుల రూపంలో కొత్త ముంపు సమస్య తలెత్తనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న స్థలంలోనే ఓ సీపేజీ వాగు ఉంది. రక్షణ గోడ నిర్మాణంతో దీని ప్రవాహం సైతం విద్యుత్ కేంద్రం లోపలి ప్రాంతంలోనే నిలిచిపోనుంది. ఇలా రక్షణ గోడలకు ఇవతల నిలిచిపోయే నీటిని పంపుల ద్వారా గోదావరిలో ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ప్లాంట్‌కు రక్షణ గోడలు భద్రాద్రి ప్లాంట్ చుట్టూ 7.76 కి.మీ నిడివితో వరద రక్షణ గోడల నిర్మించాలని జెన్కో, నీటిపారదుల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. వరద రక్షణ గోడలు నిర్మిస్తే సువిశాలమైన ప్లాంట్ లోపలి భాగంలోకురిసే వర్షపు నీటితో పాటు పరిసర ప్రాంతాల్లోని వాగుల్లోని ప్రవాహాలను ఎత్తిపోయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చుకు అదనంగా ఇందుకు రూ.వందల కోట్లలో ఖర్చు కానుందని అంచనా. లేనిపక్షంలో అనూహ్యంగా భారీ వరదలు పోటెత్తితే రూ.9962.32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టంవాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ కేంద్రంలో చాలా వరకు ఎలక్ట్రో–మెకానికల్ యంత్రపరికరాలు ముంపునకు గురైతే మరమ్మతులు సాధ్యం కాదని, మళ్లీ కొత్తవి తెచ్చుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనూహ్యంగా ముంపునకు గురికావడంతోదాదాపు ఇలానే భారీ నష్టం వాటిల్లింది. చుట్టూ రక్షణ గోడలు నిర్మించినా సరే వరద పోటెత్తినప్పుడు ..రక్షణ గోడల చుట్టూ చేరిన నీటి ఉర్ద్వ పీడనం (అప్లిఫ్ట్ ప్రెషర్)తో పవర్ ప్లాంట్ పునాదులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌తో పాటు సీతారామ ఎత్తిపోతల పథకంలోని తొలి లిఫ్టునకు సైతం గోదావరి నుంచి వరద ముప్పు ఉందని అధికారుల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో అనూహ్య వరదలు పోటెత్తవచ్చు తీవ్ర వాతావరణ మార్పులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతలకు తగ్గట్టు వర్షపాతం పెరుగుతోంది. నదుల గరిష్ట వరద ప్రవాహ మట్టాలు (ఫ్లడ్ లెవల్స్) మారిపోతున్నాయి. గత వందేళ్లలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులకు డిజైన్ చేస్తున్నారు. గతంలో వందేళ్లకొచ్చిన వరదలు ఇప్పుడు పదేళ్లలో, వెయ్యేళ్లలో వచ్చిన వరదలు వందేళ్లలోనే వస్తున్నాయి. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకోవాల్సింది. 1986లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల స్థాయి వరద మళ్లీ పునరావృతమైనా, లేక సీడబ్ల్యూసీ సవరించిన అంచనాల మేరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉంటుంది. - డాక్టర్ బాబూరావు, పర్యావరణ శాస్త్రవేత్త -
వరద తాకిడి : హర్ష భోగ్లే విచారం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో నెలకొన్న వరద పరిస్థితిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే విచారం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని అధిగమించి ఇరు రాష్ట్రాలు త్వరలోనే కోలుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితిని అధిగమించాలని కోరుకుంటున్నానని హర్ష భోగ్లే ట్వీట్ చేశారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు మరణించగా భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. హైదరాబాద్, విజయవాడ నగరాలు సహా పలు ప్రాంతాలు కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి. పలు కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. ఇక వరద తాకిడికి హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏపీలో వరద బీభత్సానికి పది మంది మరణించారు. చదవండి : ధోని కోరిక తీరకపోవచ్చు! Worried for the people in Andhra and Telangana today. Twaralo vishayaalu baagupadataayani aasistunnaanu. — Harsha Bhogle (@bhogleharsha) October 14, 2020 -
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబై: ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అంతేగాక నగరానికి వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు రైలు సర్వీసులను నిలిపివేశారు. సెంట్రల్, హార్బర్ లైన్లలో రాకపోకలు నిలిచిపోయినట్లు బ్రుహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. బాంబే హైకోర్టు కూడా నేడు సెలవు ప్రకటించినట్లు వెల్లడించింది. (చదవండి: ముంబై :టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) ఇక గత ఇరవై నాలుగు గంటల్లో ముంబైలోని పశ్చిమ ప్రాంతం(శాంతాక్రజ్ అబ్జర్వేటరీ)లో 286.4 మి.మీ., కొలాబా అబ్జర్వేటరీ(సౌత్ ముంబై)మేర వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇంతకంటే భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా వర్షాల ధాటికి లోతట్లు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ కష్టాలను వివరిస్తూ, సాయం చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. Mumbaikars, train services on Central & Harbour lines have been suspended due to water logging following the heavy rainfall yesterday. However, Western Railway is functioning as usual.#MumbaiRains#MyBMCUpdates — माझी Mumbai, आपली BMC (@mybmc) September 23, 2020 -
చచ్చినా.. చావే!
పేరేచర్ల(ఫిరంగిపురం): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసుల్లో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాలంటే కాలనీ వాసులకు చచ్చే పనవుతుంది. శ్మశానవాటికకు వెళ్లాలంటే మోకాళ్ల లోతు వాగులో దిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక చనిపోయిన వారి వెంట వచ్చే బంధువులు, మహిళలు ఆ వాగులో దిగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పి.. పట్టించుకోకపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది. చిన్న వర్షాలకే మోకాలి లోతు నీటిలో నడవాల్సి వస్తోందని, ఇక వరదలు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాలి లోతు నీటితో పాటు బురదలో కూడా మృతదేహాన్ని తీసుకెళ్లలేని పరిస్ధితి ఉంది. ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రాకూడదని, దయచేసి వంతెన నిర్మిస్తే ఎస్సీ కాలనీ వాసులకే కాకుండా పొలాలకు వెళ్లే వారికి కూడా అనువుగా ఉంటుందని వారు కోరుతున్నారు. -
రాజధానికి ముంపు గండం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘కుంభవృష్టి కురిస్తే? ఎగువ నుంచి భారీ వరద కృష్ణా నదికి వస్తే? స్థానికంగా కుంభవృష్టి కురిసినా, ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదు. రెండూ ఒకేసారి వస్తే రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణా నదిలా మారడం ఖాయం’’ అని నిపుణులు చెబుతున్నారు. గత వారం కృష్ణానదికి గరిష్టంగా 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. రాజధాని ప్రాంతంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంకాస్త వరద పెరిగి ఉంటే.. అమరావతి పరిస్థితి ఏమిటి? స్థానికంగా వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా ఉప్పొంగి ఉంటే? తదుపరి పరిణామాలను ఊహించుకోలేం. రాజధాని ప్రాంతంలో ఫ్లడ్ లైన్స్ ఏపీ నూతన రాజధాని అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. వరద వస్తే మునిగిపోయే అవకాశం ఉన్న చోట రాజధాని నగరాన్ని ఏర్పాటు మంచిది కాదని ఈ కమిటీ హెచ్చరించింది. వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని తన నివేదికలో వెల్లడించింది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరద భారీగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ‘రెడ్‌జోన్’గా గుర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన రాజధాని అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉంటుందని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ 82వ పేజీలో స్పష్టం పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్ ఉన్నాయని తెలిపింది. 2018 ఏప్రిల్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలోనూ రాజధానికి వరద ముప్పు ఉందని 176వ పేజీలో ప్రస్తావించారు. 2018 ఏప్రిల్‌లో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలో ఈ ప్రాంతానికి వరద ముంపు ఉన్నదని చెబుతున్న భాగం నిపుణుల అంచనా ప్రకారం రాజధానికి పొంచి ఉన్న ప్రమాదం - కృష్ణా నది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు ఏర్పడుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం అమరావతికి నష్టం కలిగించేదే. ఇటీవల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో 10.6 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వచి్చంది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల నీళ్లు చేరాయి. అంతకంటే ఎక్కువ వరద వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. - భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు నాగార్జున సాగర్ దిగువన చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. పైనుంచి వరద వచ్చినప్పుడు, సాగర్ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణా నది ఉగ్రరూపం దాలుస్తుంది. అది రాజధానికి అత్యంత నష్టదాయకం. - స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ఫ్లాష్ ఫ్లడ్) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రాజధానికి ముప్పు పొంచి ఉంది. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ వస్తే నీటి ప్రవాహం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. - అటు కృష్ణా నది, ఇటు కొండవీటి వాగులో ఒకేసారి వరద ఉంటే రాజధానికి ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటి వాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
జల దిగ్బంధంలో లంక గ్రామాలు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు లంక గ్రామాలు కకావికలమయ్యాయి. పొలాలతోపాటు, గ్రామాల్లోకీ వరద నీరు ప్రవేశించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో కృష్ణానది కరకట్టను అనుకొని ఉన్న తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పులిగెడ్డ అక్విడెక్టుపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు, చేపల చెరువులకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మద్దూరు గ్రామంలోకి నీరు రావటంతో పాటు, రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు పడవల్లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రేపల్లె మండలం పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల్లో వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని సబ్‌స్టేషన్‌లోకి నీరు రావటంతో 8 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీట మునిగిన పంట పొలాలు.. అపార నష్టం తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో ఉద్యాన పంటలు 13,089 ఎకరాల్లో నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో 12,262.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో వరి, 3,495 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 ఎకరాల్లో మల్బరి పంటలు నీట మునిగాయి. 165 గృహాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలకు 8,100 మందిని, గుంటూరు జిల్లాలో 14 మండలాల్లోని 53 గ్రామాల్లో 3,543 మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకూ కష్టకాలం భట్టిప్రోలు(వేమూరు), కొల్లూరు : కృష్ణానదికి వరద రావడంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే మార్గం లేక గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో మృతి చెందిన నూతక్కి రామయ్య(75)కు కరకట్టపైనే దహన సంస్కారాలు చేశారు. కొల్లూరు మండలం గాజుల్లంకలో మృతి చెందిన మత్తి జనభాయమ్మకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించే వీలులేక పడవలో కొల్లూరుకు తరలించారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో దహన సంస్కారాలకు వరద నీటిలో ఇబ్బందులు చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద కృష్ణా నది గర్భాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వరద ముంచెత్తుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని వరద నీరు చుట్టుముట్టినా తన నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. హెలిప్యాడ్, గార్డెన్, చుట్టుపక్కలున్న తోటలన్నీ నీట మునిగినా ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది ఇల్లు ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసు ఇవ్వడానికి వెళ్లిన వీఆర్వో ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించక పోవడంతో దానిని గోడకు అంటించారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 నివాసాలకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉగ్ర గోదారి
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 15 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. 14.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద సాయంత్రం 6 గంటలకు 47.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో 111 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో 20 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దేవీపట్నం మండలంలో తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు ఎనిమిదో రోజూ వరద ముంపులోనే ఉన్నాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండగా.. దిగువన ఆచంట, యలమంచిలి మండలాల్లో అనగారలంక, పెదమల్లంలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమాలలంక, దొడ్డిపట్ల పల్లెపాలెం, లక్ష్మీపాలెం, పెదలంక, కనకాయలంక గ్రామాల్లో వరద నీరు చేసింది. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, తిర్లాపురం, నాళ్లారం, కట్కూరు, కొయిదా సహా 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో గొమ్ముగూడెం, కౌండిన్యముక్తి గ్రామాలను వరద చుట్టుముట్టింది. పాత పోలవరంలోని నెక్లెస్ బండ్ కోతకు గురై గోదావరిలోకి అండలుగా జారుతూ భయపెడుతోంది. ఇదిలావుంటే.. వంశధార, నాగావళి నదుల్లో శుక్రవారం వరద తగ్గింది. ఒకరి మృతి.. ఇద్దరు గల్లంతు తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఇదే జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై నడిచి వెళ్తున్న నమీర్‌బాషా (23), షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతు కాగా.. షేక్ వజీర్ అనే యువకుడిని స్థానికులు రక్షించారు. ముంపును జయించి పెళ్లాడింది పెండ్లి కుమార్తెను ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి వివాహం జరిపించిన అరుదైన ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలో చోటుచేసుకుంది. పెదపట్నంలంకకు చెందిన దేవిశ్రీకి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం నిశ్చయించారు. ఆమెను నగరం గ్రామంలోని వరుడు దాకే బాలరాజు ఇంటికి తీసుకు వెళ్లాల్సి ఉంది. ప్రధాన రహదారులన్నీ వరద ముంపులో చిక్కుకోవడంతో దేవిశ్రీని అప్పనపల్లి మలుపు వరకు కారులో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి అనుకున్న సమయానికే వివాహ తంతును పూర్తి చేశారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందుగా ఆయనతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఇతర సీఎంవో అధికారులు సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో తాజా పరిస్థితులను వారీ సందర్భంగా వివరించినట్టు సమాచారం. దీంతో వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సీఎం సూచించారు. -
వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్‌లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది. రాత్రంతా రైలులోనే... వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి. ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన.. రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు. రెస్క్యూ టీమ్ రాక.. వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్‌కు చేరుకోనుంది. మరో 120 మందిని కాపాడిన బృందాలు ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్‌లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్లో 200 మి.మీ. వాన కురిసింది. తక్షణం స్పందించిన కేంద్రం రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్‌షా అభినందించారు. పరిమళించిన మానవత్వం.. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్‌లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు. గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
సాయానికి ‘సోషల్’ దారి
వరద ధాటికి చెల్లాచెదురైన కేరళ వరద బాధితులకు సోషల్ మీడియా ఆపద్బాంధవిగా మారి సహాయ బృందాలకు దారి చూపిస్తోంది. వరద నీటిలో చిక్కుకొని సాయంకోరే వారిలో కొందరు సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కేరళ ఫ్లడ్స్ , కేరళ ఫ్లడ్స్ హ్యాష్ ట్యాగ్‌తో ఎక్కడెక్కడిదో సమాచారం క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. బాధితులు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.3 కోట్ల మంది వరద బాధితులు ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల ద్వారా సాయాన్ని అర్థించారు. విద్యుత్ లేక అంధకారంలో మగ్గిపోతున్న వారు, ఫోన్లైన్లు కలవక ఇబ్బంది పడుతున్నవారంతా గూగుల్ మ్యాప్ ద్వారా తమ లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో తాము ఉన్న పరిస్థితిని వీడియోలు తీసి పోస్ట్చేస్తున్నారు. తీర ప్రాంతంలోని అలాపుజాలో ఉండే అజో వర్గీస్ అనే వ్యక్తి ‘నేను, మా ఇరుగు పొరుగువాళ్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. కమ్యూనికేషన్ తెగిపోయింది. మా మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి సాయం చేయండి‘ అంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షల్లో షేర్స్ వచ్చాయి. షేర్ చేస్తే మార్గం తెలుస్తుంది.. గూగుల్ మ్యాప్ ద్వారా కూడా లొకేషన్‌ను షేర్ చేస్తూ ఉండటంతో సహాయ బృందాలకు అక్కడికి వెళ్లడం సులభమవుతోంది. కేరళలోనే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ బంధువుల జాడ తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల్ని ఆశ్రయిస్తున్నారు. ‘మేము రెండో అంతస్తులో ఉన్నాం. ఇప్పటికే మొదటి అంతస్తు వరదనీటిలో మునిగిపోయింది. క్షణ క్షణానికి నీటి మట్టం పెరిగిపోతోంది. వృద్ధులు, పిల్లలు ఉన్నారు. మమ్మల్ని కాపాడండి’ అంటూ రాణిపేటకు చెందిన కొందరు పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. వరద బాధితుల సాయం కోసం ప్రభుత్వం కొన్ని వాట్సాప్ నంబర్లని ప్రత్యేకంగా కేటాయించింది. ఆ నంబర్లకి లొకేషన్ షేర్ చేస్తే చాలు వెంటనే సహాయ బృందాలను పంపిస్తోంది. ట్విట్టర్‌లోని కొంతమంది టెక్నీషియన్లు కలిసి గూగుల్ మ్యాప్‌ను అనుసంధానం చేస్తూ ఒక ప్లాట్‌ఫామ్‌ని రూపొందించారు. దీని సాయంతో సహాయక శిబిరాలు, సహాయ బృందాలు, వాలంటీర్లు, ఆహారం, మందులు, రవాణా వంటి వాటికి సంబంధించిన సమాచారం అంతా క్షణాల్లో తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా ద్వారా అందుకున్న సమాచారంతో లక్షా 50 వేల మందిని కాపాడినట్టు సమాచారం. -
దేశ రాజధానిని ముంచెత్తిన వరద
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పురాతన యమునా బ్రిడ్జిపై రాకపోకలను నిలువరించారు. వరద పరిస్థితిని ఉన్నతస్ధాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా కుండపోత వర్షాలతో ఢిల్లీ తడిసిముద్దయింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఇప్పటికే అత్యవసర సమావేశం నిర్వహించారు. హర్యానాలోని హతింకుండ్ బ్యారేజ్ నుంచి నగరానికి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తలెత్తే పరిస్థితిపైనా ఆయన అధికారులతో సమీక్షించారు. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పదివేల మందికి పైగా ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ప్రీత్ విహార్ నోడల్ అధికారి అరుణ్ గుప్తా చెప్పారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా, ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిర్వాశితుల శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. రైళ్ల రద్దు, దారిమళ్లింపు.. ఢిల్లీలో వరద ముప్పు కారణంగా పురాతన యమునా బ్రిడ్జిని మూసివేయడంతో 27 పాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. వరదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పరిస్థితిని సమీక్షించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను నెలకొల్పింది. యమునా నది ప్రమాదస్థాయిని చేరుకోవడంతో నదిపై ఢిల్లీ-హౌరా లైన్లో నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని మూసివేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 150 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జి ఢిల్లీని పొరుగు రాష్ట్రాలతో కలిపేందుకు ప్రధాన వారధిగా పనిచేస్తోంది. -
అసోంలో ప్రధాని మోదీ పర్యటన
గౌహటి : వరదలతో అతలాకుతలం అయిన అసోంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. అధికారులతో సమావేశమై నష్టనివారణ చర్యల గురించి విశ్లేషిస్తున్నారు. ఇటీవల అసోంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో 76 మంది మృతి చెందగా, సుమారు 2వేల 939 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వరదలు బీభత్సం సృష్టించిన రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని ఇప్పటికే ప్రధాని మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ప్రధాని నిన్న అసోం వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు అసోంలో వరదలు, నష్ట నివారణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌తో ప్రధాని సమీక్షించనున్నారు. కాగా అధికారుల లెక్కల ప్రకారం 29 జిల్లాల్లో 25 లక్షల మంది వర్షాలు, వరదల బారిన పడ్డారు. -
జమ్ము పరిస్థితిపై ప్రధాని ఆరా
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర సీఎం మహబూబా ముఫ్తీతో చర్చించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్న తక్షణమే తెలియజేయాలని ఆమెకు సూచించారు. ఈ మేరకు ప్రధాని శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత వారం రోజులుగా జమ్ముకాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. జీలం నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని.. విపత్తు నిర్వాహణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంగం, అనంతనాగ్, రామ్ ముషిబాగ్ ప్రాంతాల్లో నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో.. జమ్మ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూడు రోజుల క్రితమే మూసివేసిన విషయం తెలిసిందే. -
ఒడిశాకు రేపు కేంద్ర పరిశీలన బృందం
పై-లిన్ తుపాన్ తాకిడితో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ తుపాన్ సృష్టించిన బీభత్సంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం సోమవారం ఒడిశా రానుందని ఆ రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రష్మీ గోయెల్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఆ కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోతుందని చెప్పారు. పైలిన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న గంజాం, పూరీ, బాలసోర్, మయూర్ బంజ్ జిల్లాల్లో ఆ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఆ బృందాలు ఈ నెలాఖరు వరకు ఒడిశాలో పర్యటిస్తాయని చెప్పారు. పై లిన్ తుపాన్‌తో వచ్చిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల 60 మంది మృత్యువాత పడ్డారు. అలాగే వీపరితమైన ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు మూడు లక్షల చెట్లు నెలకొరిగాయి. రోడ్డు, రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఒడిశాలో పై లిన్ తుపాన్ వల్ల నెలకొన్న నష్టంపై కేంద్ర బృందం అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేయనుంది. -
వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
ఏలూరు: జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమీక్షించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ కోరారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను 600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం 50 పడవలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను రేపు కలెక్టర్ సందర్శించనున్నారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.