సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందుగా ఆయనతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఇతర సీఎంవో అధికారులు సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో తాజా పరిస్థితులను వారీ సందర్భంగా వివరించినట్టు సమాచారం. దీంతో వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment