CMO officials
-
న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
New Year 2022: సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుక
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం–2022 సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించారు. చదవండి: Rewind 2021: పడిలేచిన కెరటంలా.. పుష్ప గుచ్ఛాలు అందజేసి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోక్య రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నర్ తరఫున ఆయన స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం -
Telangana: 27 నుంచి ‘దళితబంధు’ సర్వే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నెల 27 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే మొదలుకానుంది. ఇందుకోసం 400 మంది జిల్లా, మండలస్థాయి అధికారులు పనిచేస్తారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ తెలిపారు. అంతకముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దళితబంధు సర్వేకు అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివరాలను సీఎంవో కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ హన్మంత్‌తో కలసి కలెక్టర్ కర్ణన్ విలేకరులకు వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలు, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంతో కలిపి మొత్తం ఏడు యూనిట్లుగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ముగ్గురు నుంచి ఐదుగురు జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సర్వే సెప్టెంబర్ 2 లేదా 3వ తేదీకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రతి కుటుంబానికి దళితబంధు పేరిట కొత్త ఖాతాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 15 మందికి ప్రత్యేక కొత్త ఖాతాలు ఇచ్చి రూ.10 లక్షల నగదు బదిలీ చేశామని వెల్లడించారు. ఇప్పటికే కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో మొత్తం రూ.1,500 కోట్లు వచ్చి చేరాయన్నారు. దళితులందరికీ ఇస్తాం: రాహుల్ బొజ్జా సమగ్ర కుటుంబ సర్వే, సంక్షేమ పథకాల జాబితా ఆధారంగా దళిత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా అన్నారు. రైతుబంధుకు ప్రతి రైతు అర్హుడైనట్లే, జిల్లాలో దళితులంతా దళితబంధుకు అర్హులే అని తెలిపారు. కేవలం యూనిట్ పెట్టించడమే కాదు, వారికి కావాల్సిన లైసెన్సింగ్, మార్కెటింగ్, పర్యవేక్షణ, సలహాలు, సూచనలు ఇస్తామని, చాలా దళిత కుటుంబాలు డెయిరీరంగంపై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. -
జాతీయ సినీ అవార్డు విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: జాతీయ సినిమా అవార్డు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎంవో అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలి
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నప్పటికీ ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా అర్హులందరికీ ఇంటి పట్టాలు, విగ్రహాల విధ్వంసం తదితర విషయాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం ► పొరపాటున ఎక్కడైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే ఇంటి పట్టాలు ఇప్పించాలి. మనది అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదు. మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. అదే సమయంలో అనర్హతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ► పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ► ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలి. ఇన్ని రోజుల్లో ఈ సేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనేది మరోసారి పరిశీలించండి. ► అమ్మ ఒడి పథకానికి సిద్ధం కావాలి. -
సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం సీఎం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబం«ధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం విషయాన్ని సీఎంఓ అ«ధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు, సమీక్ష సమావేశం నిర్వహించడం సబబుకాదని సీఎం అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయట పడాలని ఆకాంక్షించారు. అక్కడి అధికారులు ఎలాంటి సహాయం కోరినా వెంటనే అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటనను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం శ్రీశైలం పర్యటనను రద్దు చేస్తున్నట్టుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. -
సోదర భావాన్ని పెంపొందించే పండుగ రక్షా బంధన్
సాక్షి,అమరావతి: రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందుగా ఆయనతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఇతర సీఎంవో అధికారులు సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో తాజా పరిస్థితులను వారీ సందర్భంగా వివరించినట్టు సమాచారం. దీంతో వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సీఎం సూచించారు. -
జేసీ దివాకర్ రెడ్డి అలక, రాజీ నామా డ్రామా
-
‘అంతా ఆల్రైట్.. సమయం వచ్చినప్పుడు చెబుతా’
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలక, రాజీ నామా డ్రామాకు తెరపడినట్లయింది. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సూచన మేరకు సీఎంఓ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం అంతా ఆల్రైట్, రాజీనామాపై సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఈ దేశంలో ఎవరి మీద అలగలేం. అలిగితే ప్రయోజనం ఉండదు. పార్లమెంట్‌కు వెళ్లకపోవడానికి నేను అలగడం లాంటిది ఏమి లేదు’ అంటూ పార్లమెంట్‌కు వెళతానంటూ జేసీ హింట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. రాజకీయ వాతావరణం బాగాలేదు అన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు కానీ ఇప్పుడు చేస్తానంటే ఎవరూ నమ్ముతారని ఎద్దేవా చేశారు. ప్రజలు సంతోషం కోసమే తన పోరాటమని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తాను పార్లమెంట్‌కు వెళ్లనని జేసీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జేసీతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం జేసీ ఢిల్లీ వెళ్లారు. -
సీఎం బర్త్ డే సందర్భంగా సిబ్బంది వితరణ
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సీఎం కార్యాలయ సిబ్బంది వితరణను ప్రకటించారు. వాన నీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'జల్ యుక్త్ శివార్' కార్యక్రమానికి ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దీనిపై సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ ఉద్యోగులు తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షల కంటే వారు చేసిన గొప్ప పనే తనకు ఆనందం కలిగించిందన్నారు. జల్ యుక్త్ కార్యక్రమానకి చెరో పాతిక వేల రూపాయల విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ షేలార్, అమీత్ సతామ్ లను కూడా సీఎం అభినందించారు. చెక్ డ్యామ్ లు, నీటి మడుగులు, ఇంకుడు గుంతలు తదితర నిర్మాణాల కోసం ప్రతి ఒక్కరు విరాళాలు పంపాల్సిందిగా ఫడ్నవిస్ కోరారు. ఇదిలా ఉండగా కార్యకర్తలెవరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని, అందుకోసం వినియోగించదలచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలన్నారు. ఫడ్నవిస్‌తో పాటు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్నకేంద్ర మంత్రి అనంత కుమార్‌కు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.