సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం–2022 సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించారు.
చదవండి: Rewind 2021: పడిలేచిన కెరటంలా..
పుష్ప గుచ్ఛాలు అందజేసి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోక్య రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నర్ తరఫున ఆయన స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం
Comments
Please login to add a commentAdd a comment