సీఎం బర్త్ డే సందర్భంగా సిబ్బంది వితరణ | CMO officials donating one day salary for water conservation scheme on the occation of cm birthday | Sakshi
Sakshi News home page

సీఎం బర్త్ డే సందర్భంగా సిబ్బంది వితరణ

Published Wed, Jul 22 2015 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

సీఎం బర్త్ డే సందర్భంగా సిబ్బంది వితరణ

సీఎం బర్త్ డే సందర్భంగా సిబ్బంది వితరణ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సీఎం కార్యాలయ సిబ్బంది వితరణను ప్రకటించారు. వాన నీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'జల్ యుక్త్ శివార్' కార్యక్రమానికి ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దీనిపై సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ ఉద్యోగులు తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షల కంటే వారు చేసిన గొప్ప పనే తనకు ఆనందం కలిగించిందన్నారు.

జల్ యుక్త్ కార్యక్రమానకి చెరో పాతిక వేల రూపాయల విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ షేలార్, అమీత్ సతామ్ లను కూడా సీఎం అభినందించారు. చెక్ డ్యామ్ లు, నీటి మడుగులు, ఇంకుడు గుంతలు తదితర నిర్మాణాల కోసం ప్రతి ఒక్కరు విరాళాలు పంపాల్సిందిగా ఫడ్నవిస్ కోరారు. ఇదిలా ఉండగా కార్యకర్తలెవరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని, అందుకోసం వినియోగించదలచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలన్నారు. ఫడ్నవిస్తో పాటు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్నకేంద్ర మంత్రి అనంత కుమార్కు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement