వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్‌రెడ్డి | YSRCP MP demands compensation for crops | Sakshi
Sakshi News home page

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Published Thu, Nov 12 2015 12:21 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

YSRCP MP demands compensation for crops

పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు.

చక్రాయపేట మండలంలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. మండలంలో రైతులు వేల ఎకరాల్లో వరి పంటను విస్తారంగా సాగు చేశారు. పంట కోతకొచ్చే దశలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట మొత్తం దెబ్బతింది. దీంతో రైతులు దెబ్బతిన్న పోలాలను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement